సేదదీరితే... లావెక్కుతారట!
పరిపరి శోధన
తీరిక దొరకడమే తడవుగా బద్ధకంగా సేదదీరుతూ గడిపేస్తున్నారా? పనీపాటా లేకుండా, సోఫాలో చారబడి టీవీ చూస్తూనో, అందుకు కూడా బద్ధకించి, తిండి కోసం తప్ప మంచం కూడా దిగకుండా గంటలకు గంటలు గడిపేస్తున్నారా..? ఇలాంటి అలవాటు ఏమంత క్షేమం కాదు. అతిగా సేదదీరితే త్వరగా లావెక్కిపోతారని టెల్ అవివ్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎంత తీరిక దొరికినా, ఒంటికి పనిచెప్పకుండా అతిగా సేదదీరితే, శరీరంలో కొవ్వుకణాలు పేరుకుపోయి, త్వరగా లావెక్కుతారని, ఆ తర్వాత స్థూలకాయంతో తలెత్తే రకరకాల సమస్యలతో బాధపడక తప్పదని వారు చెబుతున్నారు.