Telangana Association of United Kingdom
-
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు. -
లండన్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం
లండన్ : గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్‌కి జై నినాదాలతో లండన్ వీధులు దద్దరిల్లాయి. గణపతి నిమజ్జనం వేడుకలు నగరంలోని హౌంస్లో ప్రాంతంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్(హెచ్‌ఎఫ్‌వైఎల్) ఆధ్వర్యంలో 7వసారి ఈ వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక శోభాయాత్ర నగర వీధులలో కన్నుల పండువగా సాగింది. భారీ ఎత్తున వీధుల్లో ప్రవాస భారతీయులు నృత్యాలు చేస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం థేమ్స్ నదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. హెచ్‌ఎఫ్‌వైఎల్ సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి, ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, మల్లారెడ్డి, నవీన్‌రెడ్డి, రాకేష్ పటేల్, సత్య మాట్లాడుతూ హైదరాబాద్ కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే లండన్‌లో కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ‘వేడుకలలో భాగంగా 5వ రోజు గణపతి హోమం చేశారు. పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూని ధనంజయ్ వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు అని’ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు శ్రీమతి పవిత్ర రెడ్డి కంది దంపతులు, ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సత్యమూర్తి చిలుముల, సత్యపాల్ పింగిళి, జాహ్నవి, లత కూర్మాచలం, వంశీ పొన్నం, సత్యంరెడ్డి కంది, శ్రీకాంత్ జిల్లా, విద్య, క్రాంతి, వెంకీ ,రాజేష్ వాకా, భరత్ బాశెట్టి, లాస్య, శ్రీ లక్ష్మి, హరి బాబు, వెంకట్ రెడ్డి, అపర్ణ, శుశమున, విజిత రవికిరణ్, గణేష్ పాస్తం, రవి రేటినేని, శైలజ, శ్రావ్య, వినయ్‌రెడ్డి, మధుసూధన్ రెడ్డి, శ్వేతా, మహేందర్, రంజిత్, దీపేక్షర తదితరులు పాల్గొన్నారు. -
భారత స్వాతంత్ర్య వేడుకల్లో టాక్
లండన్: లండన్ లోని భారత హై కమీషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన స్వాతంత్ర్య వేడుకల్లో, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్.. టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ అన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత మూడు సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్లో ప్రదర్శించారు. తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, టాక్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, మూడు సంవత్సరాలుగా సాధించిన విజాయాల తో కూడిన ప్రత్యేక ‘తెలంగాణా స్టాల్’ ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు. చేనేత పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయత్వంలో చేనేత వస్త్రాలపై తీసుకొస్తున్న అవగాహనను కూడా టాక్ సంస్థ తన ప్రదర్శన లో పెట్టింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లిమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, ఇతర ప్రతినిధుల బృందం ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించారు. తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలను ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చాలా స్పూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. అలాగే తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను టాక్ సంస్థ ప్రతినిధులని అడిగి తెలుసుకున్నారు. స్టాల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్ ను భారత హై కమిషనర్ వైకే సిన్హా కట్ చేశారు. ప్రవాస తెలంగాణా వాసులు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించారు. తెలంగాణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్న తీరుని అభినందించారు. చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ తనం విదేశీ గడ్డపై ఉట్టిపలే ఉందని అభినందించారు. ఫోటోలు, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది. ‘తెలంగాణా జానపద నృత్యం’ను సాంస్కృతిక వేదిక పై ప్రదర్శించడం విశేషం. దీంతో అతిథులు కేరింతలతో ఎంతో ఉత్సాహంగా లేచి వారితో జత కలిసి నృత్యం చేశారు. తెలంగాణ జానపద నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో హైలైట్ గా నిలిచింది. జానపద నృత్య ప్రదర్శన ఇచ్చిన సత్య చిలుముల, వంశీ చిడిపోతు, నాగరాజు మన్నం, శివకుమార్ గ్రంధి, దేవి ప్రవీణ్ అడబాల( చెర్రీ) , తిరు కణపురం, రుచిత రేణికుంటలను.. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించిన ఆతిథులందరికి మన ‘హైదరాబాద్ బిర్యానీ’ రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల, జాయింట్ సెక్రటరీ లు నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల, ఇవెంట్స్ , కల్చరల్ ఇన్చార్జ్ అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, రీడింగ్ సెక్రటరీ, స్పోర్ట్స్ఇంచార్జ్ మల్లా రెడ్డి, మహిళా విభాగం ఇంచార్జ్ సుమా దేవిపురుమని, మహిళా విభాగం సెక్రటరీ సుప్రజ పులుసు, మహిళా విభాగం సభ్యులు ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, కల్చరల్ సెక్రెటరీలు సత్య చిలుముల, శ్రావ్య వందనపు, కల్చరల్ కోఆర్డినేటర్ శైలజ జెల్ల, స్పాన్సర్ సెక్రటరీ రవి రత్తినేని, ఐటీ ఇంచార్జ్ రవి ప్రదీప్ పులుసు, సంస్థ సభ్యులు రవికిరణ్, వెంకీ సుదిరెడ్డి, నవీన్ భువనగిరి, సుషుమ్న, సుమ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
లండన్ లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి
లండన్: ఎన్నారై టీఆర్ఎస్, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళి సభ ఏర్పాటు చేశారు. టాక్ సమస్త కార్యవర్గ సభ్యులు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరై జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సార్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్ జయశంకర్ సార్... జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నివాళుర్పించారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారని, నేడు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు .అనుకున్న ఆశయ సాధనకై ఆయన చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే ఇటీవల వరుస దాడులతో యూకే లోని పలు నగరాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంస్థ తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఈవెంట్స్ కో ఆర్డినేటర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితం అందరికి ఒక స్ఫూర్తి సందేశమని, ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భం ఏదైనా మనమంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఉండి, జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చెయ్యాలని, ఇదే మనం వారికిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, రవి ప్రదీప్, నవీన్ భువనగిరి, తదితరులు హాజరయ్యారు. -
టాక్ లోగో ఆవిష్కరించిన ఎంపీ కవిత
హైదరాబాద్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) లోగోను నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. లండన్ నుండి ఇక్కడికి వచ్చిన టాక్ ప్రతినిధులు నర్రా సాయి, రాకేష్ రెడ్డి ఎంపీ కవితను కలిసి సంస్థ ఆశయాలను, బంగారు తెలంగాణ నిర్మాణంలో వారి పాత్ర గురించి వివరించారు. తెలంగాణ ఆడబిడ్డ కవిత చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని, ఎప్పటికప్పుడు వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని, మమ్మల్ని ప్రోత్సహించి లోగోను ఆవిష్కరించినందుకు కవితకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడుతున్న సంస్థ యూకేలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా మంచి సేవలందించాలని కోరారు. జనవరి 28న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి నర్రా సాయి తెలిపారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. యూకేలో సైతం తెలంగాణ ఆచార సంప్రదాయాలను కాపాడటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.