టాక్‌ లోగో ఆవిష్కరించిన ఎంపీ కవిత | Telangana Association of United Kingdom unveiled by MP Kavitha | Sakshi
Sakshi News home page

టాక్‌ లోగో ఆవిష్కరించిన ఎంపీ కవిత

Published Tue, Jan 24 2017 7:46 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

టాక్‌ లోగో ఆవిష్కరించిన ఎంపీ కవిత - Sakshi

టాక్‌ లోగో ఆవిష్కరించిన ఎంపీ కవిత

హైదరాబాద్‌: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) లోగోను నిజామాబాద్‌ ఎంపీ కవిత ఆవిష్కరించారు. లండన్ నుండి ఇక్కడికి వచ్చిన టాక్ ప్రతినిధులు నర్రా సాయి, రాకేష్ రెడ్డి ఎంపీ కవితను కలిసి సంస్థ ఆశయాలను, బంగారు తెలంగాణ నిర్మాణంలో వారి పాత్ర గురించి  వివరించారు. తెలంగాణ ఆడబిడ్డ కవిత చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని, ఎప్పటికప్పుడు వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని, మమ్మల్ని ప్రోత్సహించి లోగోను ఆవిష్కరించినందుకు కవితకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.

నూతనంగా ఏర్పడుతున్న సంస్థ యూకేలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా మంచి  సేవలందించాలని కోరారు. జనవరి 28న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి నర్రా సాయి తెలిపారు.  ఎంపీ కవిత మాట్లాడుతూ.. యూకేలో సైతం తెలంగాణ ఆచార సంప్రదాయాలను కాపాడటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement