లండన్ : గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్‌కి జై నినాదాలతో లండన్ వీధులు దద్దరిల్లాయి. గణపతి నిమజ్జనం వేడుకలు నగరంలోని హౌంస్లో ప్రాంతంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్(హెచ్‌ఎఫ్‌వైఎల్) ఆధ్వర్యంలో 7వసారి ఈ వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక శోభాయాత్ర నగర వీధులలో కన్నుల పండువగా సాగింది. భారీ ఎత్తున వీధుల్లో ప్రవాస భారతీయులు నృత్యాలు చేస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం థేమ్స్ నదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు.
హెచ్‌ఎఫ్‌వైఎల్ సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి, ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, మల్లారెడ్డి, నవీన్‌రెడ్డి, రాకేష్ పటేల్, సత్య మాట్లాడుతూ హైదరాబాద్ కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే లండన్‌లో కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ‘వేడుకలలో భాగంగా 5వ రోజు గణపతి హోమం చేశారు. పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూని ధనంజయ్ వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు అని’ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు శ్రీమతి పవిత్ర రెడ్డి కంది దంపతులు, ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సత్యమూర్తి చిలుముల, సత్యపాల్ పింగిళి, జాహ్నవి, లత కూర్మాచలం, వంశీ పొన్నం, సత్యంరెడ్డి కంది, శ్రీకాంత్ జిల్లా, విద్య, క్రాంతి, వెంకీ ,రాజేష్ వాకా, భరత్ బాశెట్టి, లాస్య, శ్రీ లక్ష్మి, హరి బాబు, వెంకట్ రెడ్డి, అపర్ణ, శుశమున, విజిత రవికిరణ్, గణేష్ పాస్తం, రవి రేటినేని, శైలజ, శ్రావ్య, వినయ్‌రెడ్డి, మధుసూధన్ రెడ్డి, శ్వేతా, మహేందర్, రంజిత్, దీపేక్షర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment