telangana collectors
-
కలెక్టర్ల ఓరుగల్లు బాట!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఓరుగల్లు బాట పట్టారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండలోని కాకతీయ హోటల్ ప్రాంగణా నికి చేరుకున్నారు. ఆ తర్వాత 2.30 గంటలకు కాకతీయ హరిత హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్క్‌షాప్ నిర్వహిం చారు. సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటి గా ఈ వర్క్‌షాప్ జరిగింది. కొద్ది విరామంతో రాత్రి వరకు వర్క్‌షాపు కొనసాగించారు. ఎౖMð్సజ్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ శాఖల స్పెష ల్ చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్ సమాచార పౌరసంబంధాల శాఖతో పాటు ఇతరులను ఎవరినీ కూడా వర్క్‌షాపునకు అనుమతించలేదు. జిల్లా కలెక్టర్లు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గోప్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సీఎం కేసీఆర్‌కు నివేదిక రూపంలో అందజేసినట్లు తెలిసింది. -
తెలంగాణ కలెక్టర్లు, జేసీలకు ఫార్చునర్లు
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఫార్చునర్ కార్ల సదుపాయాన్ని కల్పించనున్నారు. ఇందుకోసం 21 ఫార్చునర్లను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్ల కొనుగోళ్లకు 5.25 కోట్ల రూపాయలు విడుదల చేస్తే టీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దళితులకు భూ పంపిణీ కోసం 60 కోట్ల రూపాయలు విడుదల చేసింది. -
మహిళల పేరు మీదే భూమి రిజిస్ట్రేషన్: కేసీఆర్
హైదరాబాద్: దళితుల అభివృద్ధే తమ ప్రభుత్వ మొదటి లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణను 510 యూనిట్లుగా విభజించి దళితుల అభివృద్ధి పథకాల అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌పై తెలంగాణ కలెక్టర్లతో కేసీఆర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా దళితుల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. భూములు లేని పేద దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామని హామీయిచ్చారు. దళితుల అభివృద్ధి కోసం ఏడాదికి జిల్లాకు రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. పథకాల అమలు, పర్యవేక్షణ, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను అండగా ఉంటానని కలెక్టర్లకు భరోసాయిచ్చారు. దళితులకు ఇచ్చే భూమి మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.