
హన్మకొండలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న స్పెషల్ సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఓరుగల్లు బాట పట్టారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండలోని కాకతీయ హోటల్ ప్రాంగణా నికి చేరుకున్నారు. ఆ తర్వాత 2.30 గంటలకు కాకతీయ హరిత హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్క్‌షాప్ నిర్వహిం చారు. సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటి గా ఈ వర్క్‌షాప్ జరిగింది. కొద్ది విరామంతో రాత్రి వరకు వర్క్‌షాపు కొనసాగించారు. ఎౖMð్సజ్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ శాఖల స్పెష ల్ చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్ సమాచార పౌరసంబంధాల శాఖతో పాటు ఇతరులను ఎవరినీ కూడా వర్క్‌షాపునకు అనుమతించలేదు. జిల్లా కలెక్టర్లు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గోప్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సీఎం కేసీఆర్‌కు నివేదిక రూపంలో అందజేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment