telangana commercial tax minister
-
'కోడిపందాల కోసం కాదు.. సంబరాల కోసమే వెళ్తున్నా'
హైదరాబాద్ : ఈ ఏడాది సంకాంత్రి పండగకి కూడా ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం వెళ్తున్నట్లు తెలంగాణ వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. అయితే కోడిపందాల కోసం మాత్రం కాదని... సంక్రాంతి సంబరాల కోసమే అని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... పేదలకు న్యాయం జరగాలన్నదే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు పరస్పరం గౌరవించుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవడంలో తప్పు లేదని తలసాని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడమే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయని... అ పద్దతి సరికాదని తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. మరో మూడు ఏళ్లలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉండదని చెప్పారు. నగరంలో మేం చేసిన అభివృద్ధి.... చేయాల్సిన దానిపై నగర ప్రజలకు వివరిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు. -
'పన్ను వసూళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా పన్నులు వసూలు చేస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... పన్ను వసూళ్ల కోసం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసాల కారణంగా ప్రభుత్వానికి రావాలసిన రాబడి కొంత తగ్గిన మాట వాస్తవమేనని తలసాని వెల్లడించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు నిర్దేశించిన విధంగా పన్నులు చెల్లించడం లేదన్నారు. ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ సినిమా టిక్కెట్లు విక్రయాలపై ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని ఆయన తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలన్ని పన్నుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తలసాని శ్రీనివాస యాదవ్ ఈ సందర్భంగా వివరించారు.