'పన్ను వసూళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టం' | No harassment on businessmen due to tax payment, says Talasani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

'పన్ను వసూళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టం'

Published Thu, Apr 9 2015 1:24 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

'పన్ను వసూళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టం' - Sakshi

'పన్ను వసూళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టం'

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా పన్నులు వసూలు చేస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... పన్ను వసూళ్ల కోసం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసాల కారణంగా ప్రభుత్వానికి రావాలసిన రాబడి కొంత తగ్గిన మాట వాస్తవమేనని తలసాని వెల్లడించారు.

కార్పొరేట్ ఆస్పత్రులకు నిర్దేశించిన విధంగా పన్నులు చెల్లించడం లేదన్నారు. ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ సినిమా టిక్కెట్లు విక్రయాలపై ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని ఆయన తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలన్ని పన్నుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తలసాని శ్రీనివాస యాదవ్ ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement