Telangana judges
-
న్యాయవాదుల ఆందోళన ఉధృతం
కమాన్‌చౌరస్తా : తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థాన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో నిరసన ప్రదర్శనకు దిగారు. న్యాయమూర్తులు సామూహిక సెలవు పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్ష చేపట్టారు. దీక్షలో న్యాయవాదులు ఎర్రం రాజిరెడ్డి, హన్మంతరావు, జెల్ల రమేశ్, పల్లె నర్సింహారెడ్డి, సీహెచ్.వెంకటరమణారెడ్డి, ముద్దసాని సంపత్, దాడి ఓంకార్, కొలకాని భూమయ్య పాల్గొన్నారు. భోజన విరామసమయంలో న్యాయస్థాన ఉద్యోగుల అధ్యక్ష, కార్యధర్శులు రమణారావు, పవన్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బి.రఘునందన్‌రావు పాల్గొన్నారు. జగిత్యాలలో కోర్టు భవనం ఎక్కి నిరసన జగిత్యాల రూరల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయూలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయూలని జగి త్యాల న్యాయవాదులు బుధవారం కోర్టుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం ఎక్కి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు విషయూన్ని జిల్లా న్యాయమూర్తి నాగమారుతిశర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు జగిత్యాల కోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తితో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్రెడ్డిను ఫోన్లో మాట్లాడించారు. హైకోర్టు విభజన తమ చేతుల్లో లేదని, న్యాయవాదులు, ఉద్యోగులు సమన్వయం పాటించాలని జిల్లా న్యాయమూర్తి కోరారు. న్యాయవాదుల నిరసనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం నుంచి కిందకు దిగివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, న్యాయూధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయూలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. న్యాయవాదుల నిరసనతో కోర్టులో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో టౌన్‌సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు హన్మంతరావు, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దామోదర్‌రావు, ఎన్నమనేని నివాసరావు, పడిగెల జనార్దన్‌రెడ్డి, తాటిపర్తి శంకర్‌రెడ్డి, మహేందర్, మురళీమోహన్, గంగరాజం తదితరులు పాల్గొన్నారు. . హుజూరాబాద్‌లో ఆమరణ దీక్ష హుజూరాబాద్: హైకోర్టును తక్షణమే విభజించాలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బుధవారం హుజూరాబాద్ సబ్‌కోర్టు ప్రధాన గేట్ ముందు న్యాయవాది కొత్తూరి రమేష్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా న్యాయవాదులందరూ దీక్షలో కూర్చున్నారు. హైకోర్టు విభజన విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన కేంద్రమంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఏర్పడినా న్యాయవ్యవస్థపై ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతోందన్నారు. భోజన విరామ సమయంలో కోర్టు సిబ్బంది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. సీఐ రమణమూర్తి పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనలో కేసరి శేషయ్య, ఎల్వీ.రమణారావు, రంగారావు, ముక్కెర రాజు, బండి కళాధర్, దొంత భద్రయ్య, లక్ష్మణమూర్తి, జయక ృష్ణ, రాఘవరెడ్డి, శ్యాంసుందర్, సృజన్, విజయ్‌కుమార్, సురేష్, లింగారెడ్డి, సమ్మయ్య, కుమారస్వామి, కొండయ్య, దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
200 మందికిపైగా మూకుమ్మడి సెలవులు?
హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు ఆందోళన మరింత ఉధృతం దాల్చుతోంది. న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ న్యాయాధికారులు మరోసారి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. మరోవైపు సహచర న్యాయాధికారులు, సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్ చేయడంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో 15 రోజులపాటు సామూహిక సెలవులు పెట్టాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన జడ్జిలపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 200 మంది న్యాయాధికారులు మూకుమ్మడిగా సెలవులపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు న్యాయవాదుల ఆందోళనలు, మరోవైపు కోర్టు సిబ్బంది పెన్‌డౌన్‌తో సహాయ నిరాకరణ కార్యక్రమాలు, మరోవైపు న్యాయాధికారుల సామూహిక సెలవుతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరో 15 రోజులపాటు న్యాయాధికారులు సామూహికంగా సెలవులో వెళ్లాలని నిర్ణయం తీసుకోవటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. జూలై 1 నుంచి న్యాయశాఖఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. దీంతో న్యాయస్థానాల తాళాలు తెరిచే పరిస్థితి కూడా ఉండదు. మూగబోయిన కోర్టులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు మూగబోయాయి. న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో న్యాయవ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయింది. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఈ 22 రోజుల్లో దాదాపుగా కేసులు విచారణకు నోచుకోలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల ఫోరమ్స్, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సహా ఇతర క్వాజీజ్యుడీషియల్ సంస్థలు పనిచేయడం లేదు. దాదాపు 10 రోజులపాటు కొన్ని బెయిల్ పిటిషన్లు కూడా విచారణకు నోచుకోలేదంటే పరిస్ధితిని అర్థం చేసుకోవచ్చు. జూలై 1 నుంచి న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెకు దిగితే న్యాయస్థానాల తాళాలు తెరిచేవారు కూడా ఉండరు. ఇద్దరు న్యాయాధికారుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా దాదాపు 200 మంది న్యాయాధికారులు రెండు రోజులపాటు సామూహికంగా సాధారణ (క్యాజువల్) సెలవులో వెళ్లారు. అయితే మరో 11 మంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేయడంతో మరో 15 రోజులపాటు సామూహికంగా సెలవులో వెళ్లాలని న్యాయాధికారుల సంఘం ఇవాళ నిర్ణయించింది. -
మరో 9మంది జడ్జిలపై సస్పెన్షన్ వేటు!
హైదరాబాద్ : మరో తొమ్మిదిమంది న్యాయమూర్తులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సస్పెండ్ అయిన వారిలో తిరుపతి, రాధాకృష్ణ, రమాకాంత్ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, వి.వరప్రసాద్‌లపై న్యాయస్థానం సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా మరో తొమ్మిదిమంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అలాగే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ మురళీధర్పైనా సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ 11మంది న్యాయమూర్తులు సస్పెండ్ అయ్యారు. అయితే న్యాయమూర్తుల సస్పెన్షన్ పై ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ 120 మంది న్యాయాధికారులు ఆదివారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఆ మరుసటి రోజే వారిపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. మరోవైపు హైకోర్టు నిర్ణయంతో తెలంగాణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా సస్పెండ్ అయిన న్యాయమూర్తులు వివరాలు: 1. రవీందర్ రెడ్డి 2.వర ప్రసాద్ 3.మురళీధర్ 4.శ్రీనివాస్ రెడ్డి 5.చంద్రశేఖర్ ప్రసాద్ 6.రాధాకృష్ణ చౌహాన్ 7.తిరుపతి 8.రమాకాంత్ 9.సరిత 10.వేణు 11.రాజు -
న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర
► సంఘం అధ్యక్ష, కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు ► సంయుక్త కార్యదర్శి డిప్యుటేషన్ రద్దు ► రోడ్డెక్కిన మరుసటి రోజే హైకోర్టు చర్య ► భగ్గుమన్న న్యాయాధికారులు, న్యాయవాదులు ► నేటి నుంచి న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులు ► రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో స్తంభించనున్న విధులు ► ఏసీజే కోర్టు విధులను బహిష్కరించాలని న్యాయవాదుల తీర్మానం ► న్యాయశాఖ ఉద్యోగుల సహాయ నిరాకరణ సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపుల వివాదం మరో కీలక మలుపు తిరిగింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, వి.వరప్రసాద్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న సంఘం సంయుక్త కార్యదర్శి రాధాకృష్ణ చాహవాన్ డిప్యుటేషన్‌ను రద్దు చేసింది. తిరిగి ఆయన్ను గతంలో పనిచేసిన సైబరాబాద్ 24వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు పంపింది. న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ 120 మంది న్యాయాధికారులు ఆదివారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే వారిపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే హైకోర్టు తీరుపై అటు న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు భగ్గుమన్నారు. మంగళవారం నుంచి సామూహిక సెలవులపై వెళ్లాలని న్యాయాధికారులు నిర్ణయించారు. అటు న్యాయవాదులు కూడా మంగళవారం నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కోర్టు విధులను బహిష్కరించాలని తీర్మానించారు. న్యాయశాఖకు చెందిన ఉద్యోగులు సహాయ నిరాకరణకు నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం నుంచి తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధులు స్తంభించనున్నాయి. బాధ్యతలు వేరే వారికి అప్పగించండి న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలంటూ న్యాయవాదులు ప్రారంభించిన ఆందోళనల్లో పాల్గొన్నారంటూ న్యాయాధికారుల సంఘం నేతలను రిజిస్ట్రార్ జనరల్ ద్వారా హైకోర్టు వివరణ కోరింది. దీనిపై సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వివరణలు ఇచ్చారు. అయితే ఈ వివరణలపై సంతృప్తి చెందని హైకోర్టు వీరిపై సస్పెన్షన్ వేటు వేయాలని తీర్మానించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం న్యాయాధికారులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 నిబంధనలను అనుసరించి వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంటనే వారు నిర్వర్తిస్తున్న బాధ్యతలను మరొకరికి అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా వారికి తేల్చి చెప్పింది. లాయర్ల అత్యవసర సమావేశం రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు మండిపడ్డారు. హైకోర్టులో న్యాయవాదులు సాయంత్రం నాలుగు గంటలకు అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు నేతృత్వంలో సమావేశమైన న్యాయవాదులు ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్‌ను ఖండిస్తూ తీర్మానం చేశారు. వారి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని వెంటనే వెనక్కి పిలిపించాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకు ఏసీజే కోర్టు విధులను బహిష్కరించాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. బదిలీపై వెళ్లనున్న ఏసీజేకు వీడ్కోలు సభ ఏర్పాటు చేయరాదని, ఆ సభను బహిష్కరించాలని తీర్మానించారు. అనంతరం ర్యాలీగా మదీనా వరకు వెళ్లి ఏసీజేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం హైకోర్టు గేట్ల ముందు బైఠాయించి నిరసన తెలియచేశారు. నేడు న్యాయాధికారుల కార్యాచరణ సహచర న్యాయాధికారులు, సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్ చేయడంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించారు. 200 మంది న్యాయాధికారులు సామూహికంగా సెలవులపై వెళ్లాలని నిర్ణయించి, ఆ మేరకు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే నిరాహారదీక్షకు దిగాలని కూడా యోచిస్తున్నారు. మంగళవారం జరిగే సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్‌ను ఉమ్మడి బార్ కౌన్సిల్‌లోని తెలంగాణ సభ్యులు ఖండించారు. వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. సహాయ నిరాకరణ పాటించాని న్యాయశాఖ ఉద్యోగులు నిర్ణయించారు. జేఏసీ కో-కన్వీనర్ ఆత్మహత్యాయత్నం న్యాయాధికారుల సస్పెన్షన్‌తో మనస్తాపానికి గురైన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ ఎం.ఎస్. తిరుమల్ రావు సోమవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పొసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సస్పెన్షన్‌ను నిరసిస్తూ జేఏసీ లాయర్లు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో జై తెలంగాణ నినాదాలు చేస్తూ తిరుమల్ రావు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.వెంటనే న్యాయవాదులు, పోలీసులు ఆయన్ను నిలువరించి పురానీహవేలిలోని దుర్రు షెహవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయులో చికిత్స అందజేస్తున్నారు. తెలంగాణ జేఏసీ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, సిటీ సివిల్ కోర్టు జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తిరుమల్‌రావును పరామర్శించారు. మరోవైపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తిరుమల్‌రావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.