న్యాయవాదుల ఆందోళన ఉధృతం
కమాన్‌చౌరస్తా : తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థాన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో నిరసన ప్రదర్శనకు దిగారు. న్యాయమూర్తులు సామూహిక సెలవు పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్ష చేపట్టారు. దీక్షలో న్యాయవాదులు ఎర్రం రాజిరెడ్డి, హన్మంతరావు, జెల్ల రమేశ్, పల్లె నర్సింహారెడ్డి, సీహెచ్.వెంకటరమణారెడ్డి, ముద్దసాని సంపత్, దాడి ఓంకార్, కొలకాని భూమయ్య పాల్గొన్నారు.
భోజన విరామసమయంలో న్యాయస్థాన ఉద్యోగుల అధ్యక్ష, కార్యధర్శులు రమణారావు, పవన్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బి.రఘునందన్‌రావు పాల్గొన్నారు.
జగిత్యాలలో కోర్టు భవనం ఎక్కి నిరసన
జగిత్యాల రూరల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయూలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయూలని జగి త్యాల న్యాయవాదులు బుధవారం కోర్టుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం ఎక్కి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు విషయూన్ని జిల్లా న్యాయమూర్తి నాగమారుతిశర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు జగిత్యాల కోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తితో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్‌రెడ్డిను ఫోన్లో మాట్లాడించారు. హైకోర్టు విభజన తమ చేతుల్లో లేదని, న్యాయవాదులు, ఉద్యోగులు సమన్వయం పాటించాలని జిల్లా న్యాయమూర్తి కోరారు. న్యాయవాదుల నిరసనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం నుంచి కిందకు దిగివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, న్యాయూధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయూలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.
న్యాయవాదుల నిరసనతో కోర్టులో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో టౌన్‌సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు హన్మంతరావు, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దామోదర్‌రావు, ఎన్నమనేని నివాసరావు, పడిగెల జనార్దన్‌రెడ్డి, తాటిపర్తి శంకర్‌రెడ్డి, మహేందర్, మురళీమోహన్, గంగరాజం తదితరులు పాల్గొన్నారు. .
హుజూరాబాద్‌లో ఆమరణ దీక్ష
హుజూరాబాద్: హైకోర్టును తక్షణమే విభజించాలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బుధవారం హుజూరాబాద్ సబ్‌కోర్టు ప్రధాన గేట్ ముందు న్యాయవాది కొత్తూరి రమేష్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా న్యాయవాదులందరూ దీక్షలో కూర్చున్నారు. హైకోర్టు విభజన విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన కేంద్రమంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఏర్పడినా న్యాయవ్యవస్థపై ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతోందన్నారు. భోజన విరామ సమయంలో కోర్టు సిబ్బంది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. సీఐ రమణమూర్తి పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనలో కేసరి శేషయ్య, ఎల్‌వీ.రమణారావు, రంగారావు, ముక్కెర రాజు, బండి కళాధర్, దొంత భద్రయ్య, లక్ష్మణమూర్తి, జయక ృష్ణ, రాఘవరెడ్డి, శ్యాంసుందర్, సృజన్, విజయ్‌కుమార్, సురేష్, లింగారెడ్డి, సమ్మయ్య, కుమారస్వామి, కొండయ్య, దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.