Special High Court
-
దద్దరిల్లిన లోక్‌సభ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనిపై చర్చ జరపాలంటూ పార్టీ లోక్‌సభా పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి బుధవారం వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ సభ్యులు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, నగేశ్, పసునూరి దయాకర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సీతారాం నాయక్ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ అంశాన్ని లేవనెత్తేందుకు జీరో అవర్‌లో సమయం ఇస్తానని, సభ్యులు కూర్చోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు. అయినా ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు.. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆందోళన సద్దుమణగకపోవడంతో స్పీకర్.. సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభం కాగానే టీఆర్ఎస్ సభ్యులు మళ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఏదైనా చెప్పాలనుకుంటే మీ సీట్లలోకి వెళ్లాలి. మీ నాయకుడు గానీ, మీలో ఒకరు గానీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను. ఇలా వెల్ నుంచి కాదు.. మీ సీట్లకు వెళ్లండి’’అంటూ పదేపదే విజ్ఞప్తి చేశారు. దీంతో జితేందర్‌రెడ్డి తన స్థానం నుంచి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఎంపీలను వెనక్కు రావాలని పిలిచారు. అయితే సభ్యులెవరూ వెల్ నుంచి వెళ్లకపోవడంతో జితేందర్‌రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనల మధ్య సభను స్పీకర్ మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేశారు. మా సహనానికీ హద్దుంటుంది మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే.. టీఆర్ఎస్ సభ్యులు మళ్లీ ఆందోళన కొనసాగించారు. కాసేపటికి జితేందర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం వచ్చింది. ‘‘సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లయ్యింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఉమ్మడి హైకోర్టు విభజన జరగాలి. కానీ ఇంతవరకు జరగలేదు. దీనిపై ఇప్పటికి చాలాసార్లు హామీలు ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా హామీ ఇచ్చారు. కానీ మూడున్నరేళ్లు గడచిపోయాయి. మా సహనం నశిస్తోంది. తెలంగాణ లాయర్లు ఆందోళన బాట పట్టారు. వారికి రావాల్సిన పదోన్నతులు రాలేదు. అన్యాయం జరిగింది. హైకోర్టు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి అర్థమే లేదు. అందువల్ల వెంటనే హైకోర్టును విభజించాలి. కేంద్ర న్యాయశాఖ మంత్రి వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. నిర్దిష్ట కాలపరిమితి విధించాలి’’అని డిమాండ్ చేశారు. న్యాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ సమాధానమిచ్చారు. ‘‘టీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైనది. అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయి. వారి ఆందోళనను న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా. అందువల్ల వారిని కూర్చోవాలని కోరుతున్నా’’అని అన్నారు. అయినా టీఆర్ఎస్ సభ్యులు సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. చివరగా న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలోకి వచ్చి.. ఈ అంశంపై గురువారం పూర్తి వివరాలతో ప్రకటన చేస్తానని, సభ్యుల సెంటిమెంట్‌ను అర్థం చేసుకున్నానని చెప్పారు. నిర్దిష్ట కాల వ్యవధిలోగా హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న స్పష్టమైన ప్రకటనతో రావాలని జితేందర్‌రెడ్డి కోరారు. ఎందుకు జాప్యం చేస్తున్నట్టు?: ఎంపీ కవిత ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ వాయిదా పడిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారన్నారు. ఇప్పుడు సుప్రీంపై నెపం నెట్టే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొన్నారు. -
హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..!
-
హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..!
- పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టత లేదు - న్యాయాధికారుల నియామకం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయాధికారుల క్యాడర్ విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భం గా బుధవారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఉండాలన్న ఉద్దేశాన్ని మాత్రమే పార్లమెంటు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొంది. అయితే కానిస్టిట్యూట్(ఏర్పాటు) చేయాల్సింది ఎవరు? ఎప్పుడు ఏర్పాటు చేయాలి? ఎలా ఏర్పాటు చేయాలి? అన్న అంశాలను ఈ చట్టం ప్రస్తావించలేదు. పార్లమెం టు ఆ చట్టంలో ఈ అంశాలను పొందుపరిచి ఉండాల్సింది. కొత్త హైకోర్టు ఏర్పాటుకు కొత్త చట్టం అవసరం అన్నది మా అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?’’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్, హైకోర్టు రిజిస్ట్రీ తరఫు న్యాయవాది వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. రాష్ట్రపతి నోటిఫై మేరకే ఏపీ హైకోర్టు ఏర్పాటు..! ఇందుకు జైసింగ్ సమాధానం ఇస్తూ.. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30 దీనిని నిర్వచించిందన్నారు. ఏపీకి ఆర్టికల్ 214, పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31 కింద కొత్త హైకోర్టు ఏర్పడేవరకు హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని తెలిపారు. ‘‘సెక్షన్ 31(1) ప్రకారం సెక్షన్ 30 నియమాలకు లోబడి ఏపీకి ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో హైకోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా పిలవాలి. సెక్షన్31(2) ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన స్థానం.. రాష్ట్రపతి ఎక్కడ నోటిఫై చేస్తారో అక్కడ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.దీనిపై జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు. ఇందిరా జైసింగ్ సమాధానమిస్తూ.. ‘‘భవిష్యత్తులో అక్కడ హైకోర్టు ఉంటుందని సెక్షన్ 30 చెప్పింది. హైకోర్టు ఏర్పాటు ఎక్కడ అన్న విషయం మాత్రమే నిర్ధారించాల్సి ఉంది. సెక్షన్ 5 రాజధాని గురించి చెప్పింది. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైకోర్టు గురించి ఈ సెక్షన్లో ప్రస్తావన లేదు..’’ అని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ ‘‘కానిస్టిట్యూట్ అనే పదానికి అర్థం ఏంటి? మనకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే భౌతికంగా హైకోర్టు విభజన ఎప్పుడు జరగాలన్నదే. కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఈ చట్టం సరిపోతుందా? లేక కొత్త చట్టం కావాలా అన్నదే ఇక్కడ ప్రశ్న. రాజధాని అన్నది కేవలం ఒక భావన మాత్రమే. అదొక చట్టపరమైన పరిధి కాదు..’ అని పేర్కొన్నారు. న్యాయాధికారుల విభజనపై నియమం ఏదైనా ఉందా? న్యాయాధికారుల నియామకాల వివాదానికి సంబంధించి జస్టిస్ చలమేశ్వర్ పలు ప్రశ్నలు వేశారు. దీనికి ఇందిరా జైసింగ్ స్పందిస్తూ.. సెక్షన్ 77, 78లలో ఉద్యోగుల సేవలు, విభజనకు సంబంధించిన ప్రాతిపదిక చెప్పారే తప్ప సబార్డినేట్ జ్యుడిషియల్ అధికారుల ప్రస్తావనేదీ లేదన్నారు. వీటి మార్గదర్శకాలు కేంద్రం రూపొందించాలా? లేక హైకోర్టు రూపొందించాలా? అన్న దానిపైనే వివాదం ఉందన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ తరపున వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ..ధర్మాసనం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరిస్తామన్నారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ తన వాదనలు వినిపించారు. -
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
వరంగల్ లీగల్/ న్యూశాయంపేట : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును కేటాయించాలని కోరుతూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంత ర్ వద్ద చేపట్టిన ధర్నాలో జిలా న్యాయవాదు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జయాకర్, రమణ, సహోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లం నాగరాజు, సీనియర్ న్యాయవాది, టాడు గౌరవాధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 300 మందికి పైగా లాయర్లు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, జడ్జీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తాళ్లపెల్లి జనార్దన్, వలుస సుధీర్, నీలా శ్రీధర్‌రావు, తాటికొండ కృష్ణమూర్తి, సంజీవరావు, చిదంబర్నాథ్, సంసాని సునిల్, విద్యాధర్రాజ్, లలిత, స్వప్న పాల్గొన్నారు. 50వ రోజుకు చేరిన నిరసనలు వరంగల్ లీగల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో న్యాయవాదుల నిరసన కార్యక్రమాలు సో మవారం 50వ రోజుకు చేరాయి. బార్ అ సోసియేషన్ మహిళా కార్యదర్శి మానేపల్లి కవిత నేతృత్వంలో న్యాయవాదులు ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలి పారు. కార్యక్రమంలో శ్రీనివా స్, జాఫర్, రమణాకర్‌రాజు, మహేంద్రప్రసాద్, అంబ రీషరావు, శ్రీహరిస్వామి, సదాశివుడు, దయాకర్, రమేష్, ఆండాళు, భాగ్యమ్మ, పద్మలత, జ్యోతి, రంజిత్ పాల్గొన్నారు. -
న్యాయవాదుల ఆందోళన ఉధృతం
కమాన్‌చౌరస్తా : తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థాన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో నిరసన ప్రదర్శనకు దిగారు. న్యాయమూర్తులు సామూహిక సెలవు పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్ష చేపట్టారు. దీక్షలో న్యాయవాదులు ఎర్రం రాజిరెడ్డి, హన్మంతరావు, జెల్ల రమేశ్, పల్లె నర్సింహారెడ్డి, సీహెచ్.వెంకటరమణారెడ్డి, ముద్దసాని సంపత్, దాడి ఓంకార్, కొలకాని భూమయ్య పాల్గొన్నారు. భోజన విరామసమయంలో న్యాయస్థాన ఉద్యోగుల అధ్యక్ష, కార్యధర్శులు రమణారావు, పవన్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బి.రఘునందన్‌రావు పాల్గొన్నారు. జగిత్యాలలో కోర్టు భవనం ఎక్కి నిరసన జగిత్యాల రూరల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయూలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయూలని జగి త్యాల న్యాయవాదులు బుధవారం కోర్టుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం ఎక్కి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు విషయూన్ని జిల్లా న్యాయమూర్తి నాగమారుతిశర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు జగిత్యాల కోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తితో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్రెడ్డిను ఫోన్లో మాట్లాడించారు. హైకోర్టు విభజన తమ చేతుల్లో లేదని, న్యాయవాదులు, ఉద్యోగులు సమన్వయం పాటించాలని జిల్లా న్యాయమూర్తి కోరారు. న్యాయవాదుల నిరసనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం నుంచి కిందకు దిగివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, న్యాయూధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయూలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. న్యాయవాదుల నిరసనతో కోర్టులో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో టౌన్‌సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు హన్మంతరావు, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దామోదర్‌రావు, ఎన్నమనేని నివాసరావు, పడిగెల జనార్దన్‌రెడ్డి, తాటిపర్తి శంకర్‌రెడ్డి, మహేందర్, మురళీమోహన్, గంగరాజం తదితరులు పాల్గొన్నారు. . హుజూరాబాద్‌లో ఆమరణ దీక్ష హుజూరాబాద్: హైకోర్టును తక్షణమే విభజించాలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బుధవారం హుజూరాబాద్ సబ్‌కోర్టు ప్రధాన గేట్ ముందు న్యాయవాది కొత్తూరి రమేష్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా న్యాయవాదులందరూ దీక్షలో కూర్చున్నారు. హైకోర్టు విభజన విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన కేంద్రమంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఏర్పడినా న్యాయవ్యవస్థపై ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతోందన్నారు. భోజన విరామ సమయంలో కోర్టు సిబ్బంది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. సీఐ రమణమూర్తి పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనలో కేసరి శేషయ్య, ఎల్వీ.రమణారావు, రంగారావు, ముక్కెర రాజు, బండి కళాధర్, దొంత భద్రయ్య, లక్ష్మణమూర్తి, జయక ృష్ణ, రాఘవరెడ్డి, శ్యాంసుందర్, సృజన్, విజయ్‌కుమార్, సురేష్, లింగారెడ్డి, సమ్మయ్య, కుమారస్వామి, కొండయ్య, దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ
విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేశారని తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. హైకోర్టు విభజన జరిగితే న్యాయశాఖలో అనేక ఖాళీలు ఏర్పడతాయని.. జడ్జి పోస్టులను కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చే వడ్డీని జూ నియర్ న్యాయవాదులకు అందేలా చూస్తామని తెలిపారు. అలాగే న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, గృహ నిర్మాణ సదుపాయాన్ని కల్పించే విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్పోర్ట్స్ లాంజ్‌ను, బార్ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యు లు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఫెడరేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు చింతల క్రిష్ణ, భూపాల్‌రాజ్, సంపూర్ణ, తిరుపతి వర్మ, వినోద్‌కుమార్ పాల్గొన్నారు. -
నా చేతులు కట్టేసి ఉన్నాయి
- ఏపీకి ప్రత్యేక హైకోర్టుపై కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ - కోర్టులో వివాదం తేలేదాకా ఏమీ చేయలేం - ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హైకోర్టు విషయంలో తన చేతులు కట్టేసి ఉన్నాయని, హైకోర్టు ఏర్పాటును కేంద్రం కీలకాంశంగా పరిగణిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేనన్నారు. ఆదివారం నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. హైకోర్టుకు స్థలం, వసతులు, నిధులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిం చాల్సి ఉంటుందన్నారు. భూమి, ఇతర సదుపాయాలు కల్పించే బాధ్యత ఏపీ సీఎందేనని హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ఈ అంశంపై చర్యలకు గతంలో ఏపీ సీఎం, గవర్నర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఏపీ సీఎం నుంచి సమాధానం రాలేదన్నారు. ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, కొత్త హైకోర్టును ఏపీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా.. కేంద్రం కట్టుబడి ఉందన్నారు. -
ప్రత్యేక హైకోర్టుపై దద్దరిల్లిన లోక్‌సభ
* ప్రత్యేక హైకోర్టుపై టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య వాగ్వాదం * ‘కొందరి’ వల్లే విభజనలో తాత్సారమన్న టీఆర్ఎస్ సభ్యులు * తెలంగాణను హైకోర్టు ద్వారా పాలించాలనుకుంటున్నారు: కవిత * చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పేర్లు ప్రస్తావించిన జితేందర్‌రెడ్డి * టీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వెంకయ్యనాయుడు * ఇక్కడ లేనివారి పేర్లు ప్రస్తావించొద్దు.. రాజకీయం చేయొద్దని ఆగ్రహం * హైకోర్టు ఏర్పాటు కోసం బాబుకు లేఖ రాశామన్న సదానందగౌడ * చంద్రబాబు హైకోర్టుకు ఏర్పాట్లు చేశాకే తదుపరి చర్యలని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రత్యేక హైకోర్టు’ అంశంపై బుధవారం లోక్‌సభ దద్దరిల్లింది. టీఆర్ఎస్ ఎంపీల ఆరోపణలు.. టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీల వాదోపవాదాలు, కేంద్ర మంత్రుల వివరణలతో కొద్దిసేపు తీవ్రస్థాయిలో గందరగోళం చోటుచేసుకుంది. హైకోర్టు విభజన జరుగకుండా కొందరు తాత్సారం చేయిస్తున్నారని, ‘వాళ్లు’ హైకోర్టు ద్వారా తెలంగాణను పాలించాలనుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఇది రాజకీయ నిర్ణయమని పేర్కొంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పేర్లను ప్రస్తావించారు. దీంతో టీడీపీ సభ్యులు లేచి టీఆర్ఎస్ సభ్యులతో వాదనకు దిగారు. మరోవైపు తొలుత హైకోర్టు విభజన అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ చివరలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాక తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేకహైకోర్టు అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా... స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఏఎస్ఆర్ నాయక్, బాల్క సుమన్, బీబీ పాటిల్, నగేశ్, కొత్తా ప్రతాప్‌రెడ్డి ప్లకార్డులతో మౌన ప్రదర్శన ప్రారంభించారు. అందులో కొత్తేం లేదు: ప్రత్యేక హైకోర్టు అంశంపై సదానందగౌడ ప్రకటన తరువాత జితేందర్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మంత్రి ప్రకటనలో కొత్త విషయమేం లేదు. అయితే మీడియాలో, పత్రికల్లోనే కాకుండా అందరూ చెప్పేదేంటంటే చంద్రబాబు, వెంకయ్యనాయుడు’’ అంటూ ప్రస్తావించబోతుండగా.. స్పీకర్ జోక్యం చేసుకున్నారు. మీడియా విషయాలపై ఇక్కడ చర్చ సరికాదన్నారు. తాను చెప్పేది తప్పయితే రికార్డుల నుంచి తొలగించాలని జితేందర్‌రెడ్డి చెబుతుండగానే.. ‘ఇకపై మీరు మాట్లాడేది రికార్డులకు వెళ్లదు’ అని చెప్పారు. మళ్లీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేనేం చెప్పాలనుకున్నానంటే న్యాయమంత్రిపై ఉత్తుత్తి ఆరోపణలు చేస్తున్నారు’’ అని వివరణ ఇచ్చారు. ‘‘నిన్న కేంద్ర మంత్రి సమాధానం తరువాత మేమంతా అరుణ్ జైట్లీని కలిశాం. నిన్న మా సహచరుడు వినోద్ సభలో కూడా చెప్పారు. ఏపీ సచివాలయం హైదరాబాద్‌లోనే ఉంది. డీజీపీ ఇక్కడే ఉన్నారు. ఏసీబీ ఇక్కడే ఉంది. వారి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఒక విషయమైతే... హైకోర్టు ఇవ్వడం కూడా ముఖ్యమైన విషయం. ఇప్పుడు న్యాయమంత్రి రివ్యూ పిటిషన్ ఉందంటున్నారు. అసలు అదెందుకు వేశారు? హైకోర్టుకు భవనాలను ఇస్తామని, పదేళ్లపాటు అన్ని వసతులు అందిస్తామని చెబుతూ వేసిన పిటిషన్ అది. మా సీఎం వాళ్లను బాగా చూసుకుంటారు. ఇప్పటివరకు కూడా హైదరాబాద్‌లో విద్వేషపూరిత నేరాలేవీ జరగలేదు. పార్లమెంటరీ మంత్రికి అభ్యం తరం లేనప్పుడు, హోం మంత్రి, ఆర్థిక మంత్రి, న్యాయమంత్రికి అభ్యంతరం లేనప్పుడు మరి తాత్సా రం ఎందుకు? ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు. కేవలం రాజ కీయపర నిర్ణయం. ఒక్కరాత్రిలో తీసుకునే నిర్ణయం. ఒకవేళ ఈరోజు కేబినెట్ సమావేశం జరిగితే ఆ నిర్ణయం తీసుకుంటే తేలిపోతుంది. మీరే చూస్తున్నారు. మీకు మేం ఇబ్బంది కల్గించడం లేదు. మేమే నిల్చొని మా బాధను మౌనంగా తెలుపుతున్నాం. అయినా నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నా’’ అని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ అంశం: అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రివ్యూ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేసిందంటే.. న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ పరిధిని చాలెంజ్ చేశారు. కేంద్రం వేయాల్సిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఇదొక రాజకీయ అంశం.. (కవిత ఈ సందర్భంలో పలువురి పేర్లు ప్రస్తావించగా స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించారు) వాళ్లు తెలంగాణను హైకోర్టు ద్వారా పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. దీనిపై స్పీకర్ జోక్యం చేసుకుంటూ ‘‘వాళ్ల పేర్లు ఉండకూడదు. ఎలాంటి ఆరోపణలు ఎవరిపైనా ఉండకూడదు. కవితా.. ఇది సరికాదు’’ అని సూచించారు. అనంతరం కవిత మాట్లాడుతుండగా.. మా నాయకుడి పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్నాయుడు వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతి వాదనకు దిగారు. వెంకయ్య ఆగ్రహం: సదానందగౌడ సమాధానం తర్వాత బాల్క సుమన్ తదితర టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు ఏర్పాటులో తాత్సారం వెనక కొందరు ఉన్నారంటూ వారి పేర్లను బిగ్గరగా చెప్పడంతో.. వెంకయ్యనాయుడు లేచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా దుష్పరిణామం. హైకోర్టు విభజనలో చాలా స్పష్టంగా ఉన్నాం. వినోద్.. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వినే ఓపికా ఉండాలి. మీకు వినాలని లేకుంటే నేను వదిలేస్తాను. తాను చేసిన ప్రకటనను కూడా ఉపసంహరించుకోవాలని మా న్యాయమంత్రికి చెబుతా.. మీరు చేయాలనుకున్నది చేసుకోండి’’ అంటూ కూర్చున్నారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులు తిరిగి పలు ఆరోపణలు చేయడంతో వెంకయ్య మళ్లీ లేచారు. ‘‘ఆ ప్రాంతం ఏంటి? ఈ ప్రాంతం ఏంటి? మాది ప్రాంతీయ పార్టీ కాదు. ఇక్కడ లేని వారి పేర్లను ప్రస్తావించవద్దు. హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుందన్న విషయం మనం గ్రహించాలి. మీరిచ్చిన హామీలన్నీ 14 నెలల్లో నెరవేర్చలేదని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? ఏపీ హైకోర్టుకు సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నందున ఈ అంశాన్ని కూడా హైకోర్టు ముందుంచాలని నేను మా న్యాయమంత్రిని కోరుతున్నా.. దీన్ని రాజకీయం చేయొద్దు’’ అంటూ మండిపడ్డారు. అనంతరం సదానందగౌడ మాట్లాడుతూ ‘‘ఏపీ హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరుతాం. అవి ఏర్పాటు కాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం..’’ అని చెప్పారు. న్యాయస్థానం పరిధిలో ఉంది.. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత ప్రత్యేక హైకోర్టు అంశంపై కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ ఒక ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుంది, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలి. ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతంలో హైకోర్టుకు భవనాలు, న్యాయమూర్తులు, సిబ్బందికి నివాస గృహాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇది ఏపీ ప్రభుత్వ బాధ్యత. దీనిని ఉమ్మడి హైకోర్టుతో చర్చించి నెరవేర్చాల్సి ఉంది. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం కలసి నిర్ణయించుకున్న తరువాత, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేంద్రం తదుపరి చర్యల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రికి, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేంద్రం ఇప్పటికే లేఖ రాసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. దానిపై మే 1, 2015న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ పరిధిలో హైకోర్టు ఏర్పాటుకు తగిన ప్రాంతాన్ని గుర్తించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోపు ఏపీ సీఎం, చీఫ్ జస్టిస్ కలసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 14న ఉందని కూడా తెలిపారు. అందువల్ల ఈ అంశం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది..’’ అని సదానందగౌడ పేర్కొన్నారు. -
ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదుల దీక్ష..విరమణ
నిజామాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేయాలని గత మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు అమరణ నిరాహర దీక్షకు దిగారు. ఈ క్రమంలో శనివారం జిల్లాను సందర్శించిన మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డిలు ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు స్పష్టమైన హామీనిచ్చారు. అనంతరం న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం హైకోర్టు కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫైల్‌ను సుప్రీంకోర్టుకు పంపినట్లు మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రత్యేక హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు నుంచి మంగళవారంలోగా స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆయన న్యాయవాదులను దీక్ష విరమించాలని కోరారు. అనంతరం మంత్రులు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.