ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
Published Mon, Jul 25 2016 11:09 PM | Last Updated on Wed, May 29 2019 3:25 PM
వరంగల్ లీగల్/ న్యూశాయంపేట : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును కేటాయించాలని కోరుతూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంత ర్ వద్ద చేపట్టిన ధర్నాలో జిలా న్యాయవాదు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జయాకర్, రమణ, సహోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లం నాగరాజు, సీనియర్ న్యాయవాది, టాడు గౌరవాధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 300 మందికి పైగా లాయర్లు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, జడ్జీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తాళ్లపెల్లి జనార్దన్, వలుస సుధీర్, నీలా శ్రీధర్‌రావు, తాటికొండ కృష్ణమూర్తి, సంజీవరావు, చిదంబర్‌నాథ్, సంసాని సునిల్, విద్యాధర్‌రాజ్, లలిత, స్వప్న పాల్గొన్నారు.
50వ రోజుకు చేరిన నిరసనలు
వరంగల్ లీగల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో న్యాయవాదుల నిరసన కార్యక్రమాలు సో మవారం 50వ రోజుకు చేరాయి. బార్ అ సోసియేషన్ మహిళా కార్యదర్శి మానేపల్లి కవిత నేతృత్వంలో న్యాయవాదులు ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలి పారు. కార్యక్రమంలో శ్రీనివా స్, జాఫర్, రమణాకర్‌రాజు, మహేంద్రప్రసాద్, అంబ రీషరావు, శ్రీహరిస్వామి, సదాశివుడు, దయాకర్, రమేష్, ఆండాళు, భాగ్యమ్మ, పద్మలత, జ్యోతి, రంజిత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement