ఉమాభారతితో భేటీ కానున్న హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం న్యూఢిల్లీ వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని ఆయన ఈ సందర్భంగా ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తలెత్తాయి. దాంతో నీరు.... నిప్పుగా మారి ఇరు రాష్ట్రాల మధ్య వైరం పొడచూపుతుంది. శ్రీశైలం జల విద్యుత్‌పై కృష్ణా బోర్డు ఇచ్చిన తీర్పుపై గతంలో మంత్రి హరీష్ రావు ... కేంద్ర మంత్రి ఉమా భారతితో భేటీ అయిన సంగతి తెలిసిందే.