Telangana state BJP president
-
'రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయండి'
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితీన్ గడ్కారీని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కారీని కిషన్ రెడ్డి కలిశారు. అనంతరం కిషన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఇంగ్లాండ్, డ్రైపోర్ట్ పద్దతులను తెలంగాణలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గడ్కరీని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని... తప్పకుండా వస్తానని ఆయన హమీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సత్వర అభివృద్ధికి పలు ప్రాజెక్టులు కోసం కిషన్ రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. -
సరైన ఫలితాలు సాధించలేకపోయాం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోడీ అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలవల్ల రాష్ట్రంలో సరైన ఫలితాలు సాధించలేకపోయామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారమిక్కడ బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాల పాలనతో విసుగెత్తిన ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన ప్రజాతీర్పును వెల్లడించారని అన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో తాము ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని అంగీకరించారు. ఓటమికి దారితీసిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలను గమనిస్తే తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ అధికంగా ఉందని, అది టీఆర్ఎస్కు బాగా అనుకూలించిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2019లో బలమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.