'రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయండి' | Kishan reddy meeting with Nitin Gadkari at New delhi | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయండి'

Published Wed, Jul 2 2014 1:14 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

'రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయండి' - Sakshi

'రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయండి'

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితీన్ గడ్కారీని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కారీని కిషన్ రెడ్డి కలిశారు. అనంతరం కిషన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఇంగ్లాండ్, డ్రైపోర్ట్ పద్దతులను తెలంగాణలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

 

హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గడ్కరీని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని... తప్పకుండా వస్తానని ఆయన హమీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సత్వర అభివృద్ధికి పలు ప్రాజెక్టులు కోసం కిషన్ రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement