ఆప్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం: గడ్కరీ | Industrialist brokered Aam Aadmi Party-Congress deal to stop BJP, Gadkari says | Sakshi
Sakshi News home page

ఆప్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం: గడ్కరీ

Published Sat, Dec 28 2013 11:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Industrialist brokered Aam Aadmi Party-Congress deal to stop BJP, Gadkari says

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధాని కాకుండా నిరోధించడం, ఢిల్లీలో బీజేపీని అడ్డుకోవడానికి ఆప్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ ఆరోపించారు. నగరంలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య ఐదు నక్షత్రాల హోటల్‌లో ఒప్పందం కుదిరినట్టు ఆ సంగతి తెలిసిన వ్యక్తి తనకు వెల్లడించాడని గడ్కరీ అన్నారు. విధానసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 31 సీట్లు రావడం తెలిసిందే. 
 
 పాలనను గమనిస్తాం: హర్షవర్దన్
 ప్రతిపక్ష పార్టీగా బీజేపీ తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తుందని, కేజ్రీవాల్ ఎంత త్వరగా తన హామీలను పరిష్కరిస్తారో గమనిస్తుంటామని బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ‘అన్ని సమస్యలనూ పరిష్కరించే మహిమలు తన దగ్గర ఉన్నాయని ఎన్నికల ప్రచారం సమయంలో కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడేమో తన దగ్గర మంత్రదండం ఏదీ లేదని చెబుతున్నారు’ అని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలనూ బీజేపీ గెల్చుకుంటుదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement