Telangana water grid
-
కేసీఆర్ చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్
హైదరాబాద్: తెలంగాణ వాటర్ గ్రిడ్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, వైస్ చైర్మన్‌గా కె.తారకరామారావు (కేటీఆర్) లను నియమిస్తూ జీఓ విడుదలైంది. ఈ కమిటీలో మరో పది మంది సభ్యులను కూడా నియమించారు. దాదాపు 27 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న విషయం తెలిసిందే. భూమి చుట్టు కొలత 33వేల కిలోమీటర్లయితే, అంతకు నాలుగు రెట్ల పొడవున 1,26,036 కిలోమీటర్ల మేరకు పైపులైన్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత తాగునీటిని అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించిన సర్వే కోసం 317 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు. ఈ పథకం కింద మొత్తం 24 గ్రిడ్లతో అన్ని గ్రామాలు అనుసంధానం చేస్తూ పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు.. -
తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం అభినందన
ప్రాజెక్టును అధ్యయనం చేయాలని అన్ని రాష్ట్రాలకు నోట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ నమూనాను కేంద్ర ప్రభుత్వం అభినందించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా మంచినీరందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం నోట్ పంపింది. నోట్లో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. బడ్జెట్లో కూడా రూ. 2వేల కోట్లు కేటాయించింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సాయం కూడా పొందుతోంది. ఈ ప్రయత్నాలు అభినందనీయం. ఈ వాటర్‌గ్రిడ్ నమూనా ఆచరణాత్మకంగా ఉన్నందున, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేసే అంశాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలి’ అని పేర్కొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ మంచినీటి వార్షిక ప్రణాళిక సమావేశంలో వాటర్‌గ్రిడ్ పథకంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ఈ నోట్‌ను రూపొందించి అన్ని రాష్ట్రాలకూ పంపింది. గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఎంతో శ్రమించి ఈ ప్రాజెక్టును రూపొందించారని, ఈ నమూనా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
వాటర్‌గ్రిడ్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
రెండ్రోజుల్లో నోటిఫికేషన్ తేనున్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా.. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని భావించింది. వాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లభించాకే ఆర్డినెన్స్ ఫైలును గవర్నర్‌కు పంపాలి. అయితే సర్క్యులేషన్ పద్ధతిన మంత్రులందరి ఆమోదం తీసుకొని ఆఘమేగాల మీద ఆర్డినెన్స్ ఫైలును గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. తాజాగా గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.