కేసీఆర్ చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్
హైదరాబాద్: తెలంగాణ వాటర్ గ్రిడ్ చైర్మన్గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, వైస్ చైర్మన్గా కె.తారకరామారావు (కేటీఆర్) లను నియమిస్తూ జీఓ విడుదలైంది. ఈ కమిటీలో మరో పది మంది సభ్యులను కూడా నియమించారు. దాదాపు 27 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న విషయం తెలిసిందే.
భూమి చుట్టు కొలత 33వేల కిలోమీటర్లయితే, అంతకు నాలుగు రెట్ల పొడవున 1,26,036 కిలోమీటర్ల మేరకు పైపులైన్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత తాగునీటిని అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించిన సర్వే కోసం 317 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు. ఈ పథకం కింద మొత్తం 24 గ్రిడ్‌లతో అన్ని గ్రామాలు అనుసంధానం చేస్తూ పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తారు..