Telephone Exchange
-
వేతన సవరణకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల డిమాండ్
ఏలూరు (ఆర్ఆర్పేట) : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం స్థానిక టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులకు 30 శాతం బెనిఫిట్ ఇవ్వాలని, సంస్థ ఉద్యోగుల పట్ల పక్షపాత ధోరణి విడనాడాలని, ఈ నెల 27న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చింతా ప్రసాద్, బి.రాజశేఖర్, ఎం.నారాయణరావు, జేవీ లక్ష్మీనారాయణ, పి.పుల్లారావు, బి.విక్టర్బాబు, ఆర్.రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్
జల్పాయ్గురి: భారత్–నేపాల్ సరిహద్దుల్లోని పానిటంకీలో అక్రమంగా నిర్వహిస్తున్న టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ను పోలీసులు గుర్తించారు. సిలిగురి పోలీసు కమిషనరేట్ పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దాడులు జరిపి దీనిని గుర్తించారు. దీంతో సంబంధమున్న రన్విజయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనా స్థలి నుంచి నేపాల్, భారత్లకు చెందిన 196 సిమ్ కార్డులు, 5 జీఎస్ఎమ్ గేట్వే మెషీన్లు, 4 ల్యాప్ట్యాప్లు, 3 ఓటర్ ఐడీలు, పెద్ద మొత్తంలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
భాగ్యనగరిలో ట్రింగ్.. ట్రింగ్
1895లో నగరంలోని బారాదరిలో తొలి టెలిఫోన్ను ఏర్పాటు చేశారు. నారాయణ గూడలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ను ప్రారంభించారు. 1910-12 నాటికి ఫోన్ల సంఖ్య 321కి చేరింది. రోజుకు వెయ్యి కాల్స్ చేసేవారట. కాలక్రమంలో ఎక్స్ఛేంజ్ పరిధి దాదాపు 740 కిలోమీటర్లకు విస్తరించింది. టెలికం విభాగం నుంచి నిజాం సర్కారుకు రూ. 54,600 ఆదాయం వచ్చేది. టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20 వేలు ఖర్చు పెట్టారు.