వేతన సవరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల డిమాండ్‌ | BSNL EMPLOYEES PAY REVISION DEMAND | Sakshi
Sakshi News home page

వేతన సవరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల డిమాండ్‌

Published Tue, Jul 25 2017 9:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

వేతన సవరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల డిమాండ్‌

వేతన సవరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల డిమాండ్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం స్థానిక టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌  వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ అయిన ఉద్యోగులకు 30 శాతం బెనిఫిట్‌ ఇవ్వాలని, సంస్థ ఉద్యోగుల పట్ల పక్షపాత ధోరణి విడనాడాలని, ఈ నెల 27న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు చింతా ప్రసాద్, బి.రాజశేఖర్, ఎం.నారాయణరావు, జేవీ లక్ష్మీనారాయణ, పి.పుల్లారావు, బి.విక్టర్‌బాబు, ఆర్‌.రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement