మళ్లీ మళ్లీ వినేలా..
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కబాలి’. పా.రంజిత్ దర్శకుడు. రాధికా ఆప్టే కథానాయిక. కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలు. సంతోష్ నారాయణ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 26న విడుదల చేయనున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇందులో రజనీకాంత్ నట విశ్వరూపాన్ని మరోసారి చూస్తారు. దర్శకుడు ఆయనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. సంతోష్ నారాయణ స్వరపరిచిన బాణీలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి. మంచి సాహిత్యం కుదిరింది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.