temple Trust Board
-
పదేళ్ల తర్వాత నెరవేరుతున్న కల
సాక్షి, అద్దంకి(ప్రకాశం) : జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పదేళ్ల తర్వాత పాలక మండలి ఏర్పాటు కోసం దేవాదాయ శాఖ గత నెల 30న జీవో నంబర్ 986ను జారీ చేసింది. వార్షికాదాయం రూ.3 కోట్ల ఆదాయం ఉండి..అసిస్టెంట్ కమిషనర్ స్థాయి దేవస్థానమైన శింగరకొండకు జనవరి నాటికి తొమ్మిది మందితో కూడిన పాలక మండలి కొలువుదీరనుంది. పాలకమండలి ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం మంగళం శింగరకొండ దేవస్థానానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. 2008 ఆగస్టు వరకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్ని శ్రీమన్నారాయణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలక మండలి నియామకం చేపట్టలేక పోయారు. ఆ తర్వాత టీడీపీ పాలనలో వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే రవికుమార్, అప్పటికే టీడీపీలో కొనసాగుతున్న కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరులో పాలక మండలి ఏర్పాటు కాలేదు. తాము చెప్పిన వారినే కమిటీలోకి తీసుకోవాలంటూ ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో పాలక మండలిని నియమించలేకపోయారు. ఫలితంగా పదేళ్ల నుంచి దేవస్థానానికి పాలక మండలి లేకుండానే అధికారుల పాలనలో నడుస్తోంది. గత నెల 30న పాలక మండలి ఏర్పాటుకు జీవో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత నెల 30న దేవదాయ శాఖ జీవో నంబర్ 986 ద్వారా పాలక మండలి నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవో ప్రకారం 9 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19న ఆఖరు తేదీగా ప్రకటించారు. మహిళలకు ప్రాధాన్యం దేవస్థానం కమిటీ సభ్యుల్లో 50 శాతం మంది మహిళలు ఉండాలి. మిగిలిన 50 శాతం మంది ఎస్సీ, ఎస్సీ, బీసీ (హిందువులై ఉండాలి) వర్గాలకు చెందిన వారికి కేటాయించనున్నారు. అర్హులైన వారు ఈ నెల 19వ తేదీ సాయంత్ర లోపు దేవస్థానం కార్యాలయంలో ఏసీ తిమ్మనాయుడుకి దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. సభ్యులుగా దరఖాస్తు చేసే వారు కుల «ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేయాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత పరిశీలనతో జనవరి నాటికి నూతన పాలక మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆశావహులు మాత్రం తమను కమిటీ సభ్యులుగా నియమించాలంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
అరసవల్లి ఆలయ ‘ట్రస్ట్’ బోర్డుకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి మంచి రోజులు రానున్నాయి. వార్షికాదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకున్న ఆలయాల ధర్మకర్తల సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. నాటి రెవెన్యూ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చొరవతో ట్రస్ట్ బోర్డు దిగ్విజయంగా పనిచేసింది. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హయాంలోనే మళ్లీ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 20 తేదీలోగా ఆసక్తి గల సభ్యులు ధృవీకరణలతో కూడిన ఫారం–2ను నింపి ఆలయ సహాయ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం మాత్రమే ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారమే నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 25 ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అరసవల్లి కూడా ఉంది. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు, తొమ్మిది మంది ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ధర్మకర్త వ్యవహరించనున్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించనున్నాం. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి, దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తాం. – వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈవో -
దే..వుడా
నామినేటెడ్ పోస్టులు అవినీతిపాలు కష్టపడే వారికి నిరాశే ముందస్తు ఒప్పందాలతో చేతులు మారుతున్న రూ.లక్షలు పుణ్య క్షేత్రాలనూ వదలని అవినీతి దాహం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టపడే వారికి కాకుండా అధికార పార్టీలోని పెద్దలు కాసులకు కక్కుర్తిపడి పదవుల పందేరానికి తెగబడుతుండడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవస్థానం చైర్మన్లు ఇలా ఒకటేమిటి అన్నింటా వారే ప్రత్యక్షమై లక్షణంగా లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతుండడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. పి.గన్నవరం, అమలాపురం, కొత్తపేట, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఎ.ఎం.సి. చైర్మ¯ŒS పదవులను ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు జేబులో వేసుకొన్నారనే విషయం తెలిసిన ఆ పార్టీ క్యాడరే కారాలు, మిరియాలు నూరుతోంది. ఎ.ఎం.సి. చైర్మ¯ŒSలతోపాటు పుణ్యక్షేత్రాల ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పదవులను కూడా అంగడి సరుకు చేసేశారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడిని ట్రస్టుబోర్డు నియామక ప్రక్రియను ఆ పార్టీ నేతలు వివాదాస్పదం చేసి బజారుకీడ్చిన విషయం తెలిసిందే. దీంతో ట్రస్టుబోర్డు సభ్యుల నియామకం దాదాపు పూర్తి అయిపోయే చివరి దశలో ఆ నోటిఫికేష¯ŒSనే రద్దు అయిపోయిన పరిస్థితికి దారితీసింది. కోనసీమ పుణ్యక్షేత్రల్లోనూ రాజకీయ సెగే... ఇప్పుడు కోనసీమలో రెండు ప్రధానమైన ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మన్ల నియామకంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరుప్రఖ్యాతులున్న ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకట్వేరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయాల చైర్మ¯ŒS గిరీలపై ఆర్థికపరమైన లావాదేవీలతో పార్టీ జెండా భుజానమోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ రెండు ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మ¯ŒS పోస్టులకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో వాడపల్లి వెంకన్న ఆలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS గిరీ నియామకంలో ఇటువంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మ¯ŒS గిరీ కోసం ఇద్దరు నేతలు పోటీపడ్డారు. గత సంప్రదాయాన్ని అనుసరించి మాజీ చైర్మ¯ŒS తోటకూర సుబ్బరాజును నియోజవకర్గానికి చెందిన ఒక మాజీ నేత ప్రతిపాదించారు. పార్టీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న మరో నాయకుడు రావులపాలెం మండలం వెదిరేశ్వరం మాజీ సర్పంచి సయ్యపురాజు రామకృష్ణంరాజును తెరమీదకు తెచ్చారు. నియామకం దేవస్థానం ఉన్న మండలానికి చెందిన నాయకుడే అర్హుడని వైరివర్గ నేత మెలిక పెట్టడంతో lప్రత్యామ్నాయంగా ఆత్రేయపురం మండలం అంకంపాలెం సర్పంచి కరుటూరి నరసింహరావు పేరు ప్రతిపాదించారు. ఇలా ఇరు వర్గాల నేతలు ప్రారంభంలో చెరో పేరు సూచించినా చివరకు ఆర్థికంగా స్థితిమంతుడైన ఒక నాయకుడికి కట్టబెట్టేలా వారి మధ్య ఒప్పందం కుదిరిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట పంతానికిపోయిన ఇరు వర్గాల నేతలు చివరకు రూ.20 లక్షలకు బేరంతో ఒప్పందానికి వచ్చి ఎ¯ŒSఓసీ ఇచ్చారని పార్టీ కోడైకూస్తోంది. ఇందులో కొంత అడ్వాన్సు కూడా ఇచ్చుకున్నారని సమాచారం. అన్ని లక్షలు ఇవ్వడానికి అందులో ఏముందని ద్వితీయశ్రేణి నేతలు ప్రశ్నిస్తుంటే చైర్మ¯ŒS పదవి చేపట్టడం ప్రతిష్టాత్మకమని ఆశావహుడైన ఆ నేత సమర్థించుకుంటుండడం గమనార్హం. ఈ లావాదేవీల వ్యవహారం బయటకు పొక్కడంతో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆర్థికంగా బలమైన ఒక సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు చెబుతామని అల్టిమేటమ్ ఇవ్వడంతో నియామకం ప్రస్తుతానికి వాయిదా వేశారని తెలిసింది. ర్యాలి జగన్మోహినిలో కూడా... ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయ చైర్మ¯ŒS నియామకానికి కూడా దాదాపు ఇవే కారణాలతో బ్రేక్ పడింది. ఈ చైర్మ¯ŒS గిరీ విషయంలో కూడా ఇరు వర్గాలు పేర్లు ప్రతిపాదించాయి. ఎప్పుడూ క్షత్రియ సామాజిక వర్గానికి కట్టబెడుతూ వస్తున్న క్రమంలో మాజీ చైర్మ¯ŒS సత్యనారాయణరాజును ఒక నేత, సీనియర్ నాయకుడైన కుడుపూడి ఏడుకొండలను మరో నేత ప్రతిపాదించగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ పోçస్టుకు రూ.10 లక్షలకు డీల్ నడుస్తోందని పార్టీలో చర్చనీయాంశమైంది. లక్షలు లేకుండా పని అయ్యేటట్టు కనిపించడం లేదని పార్టీలో ద్వితీయశ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కొండంత అవమానం
దైవ సన్నిధిలో ‘దేశం’ రాజకీయం క్యాడర్ అంటే కరివేపాకులా! పదవులు అమ్ముకోడానికే కుటిల రాజకీయాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కూరలో కరివేపాకుల్లా వాడుకుని అవసరం తీరాక పక్కన పడేస్తున్నారని మహిళా కార్యకర్తలంటే మరీ చులకనగా చూస్తున్నారంటూ ఆ పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. పదవులు ఇచ్చినట్టే ఇచ్చి హఠాత్తుగా లేవు పొమ్మంటుండడంతో పార్టీ క్యాడర్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. కాకినాడ∙ బాలత్రిపురసుందరి ఆలయ ట్రస్టు బోర్డు నియామకం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) సిఫార్సుతో దేవాదాయశాఖ కమిషనర్ వై.అనురాధ ఏర్పాటు చేసిన ట్రస్టుబోర్డు దీనికి వేదికగా మారుతోంది. ఎమ్మెల్యేకు అన్నీ తానై వ్యవహరిస్దున్న టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గ్రంధి బాబ్జీlచైర్మన్‌గా మరో తొమ్మిది మంది సభ్యులతో ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటై తరువాత పలు మార్పులకు గరైంది. దీంతో కమిటీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయనీయకుండా ఏడుగురితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన కర్రి పాపారావు, టీడీపీ మహిళా నేత సలాది ఉదయలక్ష్మిని పక్కనపెట్టేశారు. కొండబాబుకు కాకినాడ సిటీ నియోజకవకర్గ పార్టీ టిక్కెట్టు ప్రకటించక ముందు నుంచీ ఉదయ లక్ష్మి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రస్టుబోర్డులో నియమించినట్టే నియమించి ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎమ్మెల్యే, అనుచరులు ప్లేటు ఫిరాయించారని, ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదని, ఉదయలక్ష్మి చేసిన తప్పేమిటని ఆమె అనుచరులు ఎమ్మెల్యేను ప్రశ్నించడానికి వెళ్లినా పట్లించుకోలేదని ఆమె వర్గం వాపోతోంది. మహిళలకు ఇదేనా మర్యాద... పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మహిళా నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని తెలుగు మహిళలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఆలయ ట్రస్టుబోర్డు ప్రమాణ స్వీకారోత్సవాలు అట్టహాసంగా నిర్వహించడం పరిపాటి. అందుకు భిన్నంగా బాలాత్రిపుర సుందరి ఆలయ ట్రస్టుబోర్డు ప్రమాణస్వీకారం నాలుగు గోడల మధ్య ‘మమ’ అనిపించేయడంలో ఆంతర్యమేమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం మహిళా సభ్యురాలు ప్రమాణం చేయకుండా ట్రస్టుబోర్డు నియామకం పూర్తయినట్టు కాదని దేవాదాయ శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ జారీ చేసిన లిఖితపూర్వక ఉత్తర్వులనే బేఖాతరుచేసి ఇద్దరు సభ్యులను పక్కన పెట్టేయడం ఎంత వరకు సమంజసమని ఉదయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులను అమ్ముకున్నారా..? పదవులను అయినకాడికి మరొకరికి అమ్మేసుకోవడంతోనే ఉదయలక్ష్మి, పాపారావు విషయంలో అలా వ్యవహరించారనే విమర్శలున్నాయి. తప్పించేందుకు సాంకేతిక కారణాలను వెతికే పనిలో ఎమ్మెల్యే అనుచరవర్గం ఉందని పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఉదయలక్ష్మి స్థానంలో మరొకరిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీవర్గాల సమాచారం. ఈ విషయం దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు దృష్టికి కూడా వెళ్లింది. తనకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే సహా ఇతర నేతలపై ఉదయలక్ష్మి బాహాటంగానే దుమ్మెత్తిపోçస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం హల్చల్ చేస్తోంది. ఉదయలక్ష్మితోపాటు బీజేపీ నుంచి నియమించిన కర్రి పాపారావును కూడా ప్రమాణస్వీకారం చేయనివ్వలేదు. అలాగే జగన్నాథపురం వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్టు బోర్డులో బీజేపీ మజ్థూర్ మోర్చా విభాగానికి చెందిన కొక్కిరిగెడ్డ ప్రసాద్‌ను నియమించారు. ఇక్కడ ప్రసాద్‌ను కూడా ప్రమాణస్వీకార సమయానికి పక్కనబెట్టేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్ ఆధ్వర్యంలో కాకినాడ దేవాదాయశాఖ డీసీ కార్యాలయం వద్ద ఈ విషయంపై ధర్నా కూడా చేశారు. జగన్నాథపురం వెంకటేశ్వర ఆలయ ట్రస్టుబోర్డు వ్యవహారంలో అయితే తెలుగు తమ్ముళ్ల ఆగడాలు భరించలేక ఈఓ శివబాబు సెలవుపెట్టేసి మరీ వెళ్లిపోవాల్సి వచ్చింది. అంటే తమ్ముళ్ల వ్యవహారాలు ఏ స్థాయికి చేరుకున్నాయో తేటతెల్లమవుతోంది. నేను చేసిన తప్పేమిటో చెప్పండి నేను చేసిన తప్పు ఏమిటో చెప్పమంటున్నా. పార్టీ కోసం మొదటి నుంచీ పనిచేస్తూ వస్తున్నాను. ట్రస్టుబోర్డులో నియమించినా ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. దేవాదాయశాఖాధికారులను అడుగుతుంటే మాకేమీ తెలీదు ఎమ్మెల్యేని అడగమంటున్నారు. ఎమ్మెల్యేని అడుగుదామని వెళుతుంటే బిజీగా ఉన్నారని పంపేస్తున్నారు. – సలాది ఉదయలక్ష్మి, తెలుగు మహిళ ఎమ్మెల్యే ఆదేశాలతో నిలుపుదల చేశాం కాకినాడ శాసన సభ్యుడు వనమాడి వేంకటేశ్వరరావు ఆదేశాలతో ఉదయలక్ష్మి నియామకం నిలుపుదల చేశాం. ఆమె నియామకాన్ని శాసన సభ్యుడు అంగీకరించలేదు. – చింతపల్లి విజయ భాస్కరరెడ్డి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయ ఈఓ -
కూకట్ పల్లి సాయిబాబా గుడిలో అక్రమాలు
హైదరాబాద్: కూకట్ పల్లి నిజాం పేట సాయిబాబా దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాలయానికి చందాల రూపంలో వచ్చిన డబ్బును ఆలయ ట్రస్ట్ మెంబర్లు వాడుకుంటున్నట్లు సినీనటి చల్లా జయలలిత ఆరోపించారు. ఆలయట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఒకరైన లతా చౌదరి లక్షలు కాజేశారని జయలలిత తెలిపారు. ఆలయంలో బాబాకు పూజలు నిర్వహిస్తున్న పూజారులు సైతం నిష్టగా ఉండటం లేదని, గుట్కాలు తింటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని భక్తులు ఆరోపించారు. -
ఆశల పల్లకి
- మార్కెట్ కమిటీలు, ఆలయ ట్రస్ట్‌బోర్డు పదవులపై కన్నేసిన టీడీపీ నేతలు - వెయ్యి మందికి పదవీ యోగం - వేలాది మంది ఆశావహులు ఏలూరు : నామినేటెడ్ పదవులపై కన్నేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాటిని దక్కించుకునేందు కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్కెట్ కమిటీ, ఆలయ ట్రస్ట్‌బోర్డు పదవుల్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా పదవులు లేక అజ్ఞాతవాసం గడిపిన నాయకులు ఇప్పుడు ఆ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అధ్యక్ష, డెరైక్టర్ పదవులు 18చొప్పున మొత్తం 324 ఉన్నారుు. దేవాదాయ శాఖ పరిధిలో 150 ఆలయూలకు ట్రస్టుబోర్డులు ఉన్నారు. వీటిలో 3నుంచి 9 వరకూ పదవులు ఉంటారుు. సగటున 4 పదవులు ఉన్నాయనుకున్నా 600 మంది నాయకులు, కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు లభిస్తారుు. ఆ పదవులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు అప్పగించడం ద్వారా వారి సేవలను ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇదే విషయూన్ని రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశంలో చర్చించడంతోపాటు వెంటనే మార్కెట్ కమిటీ పాలకవర్గాలను, ట్రస్ట్‌బోర్డు కమిటీలను నియమించాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ పదవుల్లో ఉన్నవారు గౌరవంగా తప్పుకునేలా చూడాలని, లేదంటే ఆయూ కమిటీలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు తమకు త్వరలోనే పదవీయోగం పట్టబోతోందని మురిసిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయూ పదవులను అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థి తి అగమ్యగోచరంగా తయూరైం ది. నామినేటెడ్ పదవుల భర్తీకి త్వరలోనే ఆర్డినెన్స్ రానుందని సమాచారం.