దే..వుడా | oo my god ..temple trust board selections issue | Sakshi
Sakshi News home page

దే..వుడా

Published Tue, Nov 29 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

oo my god ..temple trust board selections issue

  • నామినేటెడ్‌ పోస్టులు అవినీతిపాలు
  • కష్టపడే వారికి నిరాశే
  • ముందస్తు ఒప్పందాలతో చేతులు మారుతున్న రూ.లక్షలు
  • పుణ్య క్షేత్రాలనూ వదలని అవినీతి దాహం
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    కష్టపడే వారికి కాకుండా అధికార పార్టీలోని పెద్దలు కాసులకు కక్కుర్తిపడి పదవుల పందేరానికి తెగబడుతుండడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవస్థానం చైర్మన్లు ఇలా ఒకటేమిటి అన్నింటా వారే  ప్రత్యక్షమై లక్షణంగా లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతుండడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. పి.గన్నవరం, అమలాపురం, కొత్తపేట, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఎ.ఎం.సి. చైర్మ¯ŒS పదవులను ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు జేబులో వేసుకొన్నారనే విషయం తెలిసిన ఆ పార్టీ క్యాడరే  కారాలు, మిరియాలు నూరుతోంది. ఎ.ఎం.సి. చైర్మ¯ŒSలతోపాటు పుణ్యక్షేత్రాల ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పదవులను కూడా అంగడి సరుకు చేసేశారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడిని ట్రస్టుబోర్డు నియామక ప్రక్రియను ఆ పార్టీ నేతలు వివాదాస్పదం చేసి బజారుకీడ్చిన విషయం తెలిసిందే. దీంతో ట్రస్టుబోర్డు సభ్యుల నియామకం దాదాపు పూర్తి అయిపోయే చివరి దశలో ఆ నోటిఫికేష¯ŒSనే రద్దు అయిపోయిన పరిస్థితికి దారితీసింది. 
    కోనసీమ పుణ్యక్షేత్రల్లోనూ రాజకీయ సెగే...
    ఇప్పుడు కోనసీమలో రెండు ప్రధానమైన ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మన్ల నియామకంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరుప్రఖ్యాతులున్న ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకట్వేరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయాల చైర్మ¯ŒS గిరీలపై ఆర్థికపరమైన లావాదేవీలతో పార్టీ జెండా భుజానమోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ రెండు ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మ¯ŒS పోస్టులకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో వాడపల్లి వెంకన్న ఆలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మ¯ŒS గిరీ నియామకంలో ఇటువంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. 
    వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మ¯ŒS గిరీ కోసం ఇద్దరు నేతలు పోటీపడ్డారు. గత సంప్రదాయాన్ని అనుసరించి మాజీ చైర్మ¯ŒS తోటకూర సుబ్బరాజును నియోజవకర్గానికి చెందిన ఒక మాజీ నేత ప్రతిపాదించారు. పార్టీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న మరో నాయకుడు రావులపాలెం మండలం వెదిరేశ్వరం మాజీ సర్పంచి సయ్యపురాజు రామకృష్ణంరాజును తెరమీదకు తెచ్చారు. నియామకం దేవస్థానం ఉన్న మండలానికి చెందిన నాయకుడే అర్హుడని వైరివర్గ నేత మెలిక పెట్టడంతో lప్రత్యామ్నాయంగా ఆత్రేయపురం మండలం అంకంపాలెం సర్పంచి కరుటూరి నరసింహరావు పేరు ప్రతిపాదించారు. ఇలా ఇరు వర్గాల నేతలు ప్రారంభంలో చెరో పేరు సూచించినా చివరకు ఆర్థికంగా స్థితిమంతుడైన ఒక నాయకుడికి కట్టబెట్టేలా వారి మధ్య ఒప్పందం కుదిరిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట పంతానికిపోయిన ఇరు వర్గాల నేతలు చివరకు రూ.20 లక్షలకు బేరంతో ఒప్పందానికి వచ్చి ఎ¯ŒSఓసీ ఇచ్చారని పార్టీ కోడైకూస్తోంది. ఇందులో కొంత అడ్వాన్సు కూడా ఇచ్చుకున్నారని సమాచారం. అన్ని లక్షలు ఇవ్వడానికి అందులో ఏముందని ద్వితీయశ్రేణి నేతలు ప్రశ్నిస్తుంటే చైర్మ¯ŒS పదవి చేపట్టడం ప్రతిష్టాత్మకమని ఆశావహుడైన ఆ నేత సమర్థించుకుంటుండడం గమనార్హం. ఈ లావాదేవీల వ్యవహారం బయటకు పొక్కడంతో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆర్థికంగా బలమైన ఒక సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు చెబుతామని అల్టిమేటమ్‌ ఇవ్వడంతో నియామకం ప్రస్తుతానికి వాయిదా వేశారని తెలిసింది. 
    ర్యాలి జగన్మోహినిలో కూడా...
    ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయ చైర్మ¯ŒS నియామకానికి కూడా దాదాపు ఇవే కారణాలతో బ్రేక్‌ పడింది. ఈ చైర్మ¯ŒS గిరీ విషయంలో కూడా ఇరు వర్గాలు పేర్లు ప్రతిపాదించాయి. ఎప్పుడూ క్షత్రియ సామాజిక వర్గానికి కట్టబెడుతూ వస్తున్న క్రమంలో మాజీ చైర్మ¯ŒS సత్యనారాయణరాజును ఒక నేత, సీనియర్‌ నాయకుడైన కుడుపూడి ఏడుకొండలను మరో నేత ప్రతిపాదించగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ పోçస్టుకు రూ.10 లక్షలకు డీల్‌ నడుస్తోందని పార్టీలో చర్చనీయాంశమైంది. లక్షలు లేకుండా పని అయ్యేటట్టు కనిపించడం లేదని పార్టీలో ద్వితీయశ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement