tempo driver
-
పోలీసులు X టెంపో డ్రైవర్
న్యూఢిల్లీ: పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో కొడుతుంటే మూడు చక్రాల టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసిన వైనానికి సంబంధించిన వీడియో ఢిల్లీలో సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల వాహనం, టెంపో ఢీకొనడంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తమ సహోద్యోగుల్లో ఒకరి కాలిపైకి టెంపో (గ్రామీణ సేవ) చక్రం ఎక్కడంతో పోలీసులు డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. ఆటోలో ఉన్న అతని కొడుకుని బయటకు లాగి కొట్టారు. దీనితో టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసి వారి వెంటపడ్డాడు. డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం పరామర్శించారు. ఈ కేసులో నిందితుడికి తగిన న్యాయం జరిగేలా అమిత్ షా చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం అమరీందర్ కోరారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ఈ ఘటనను ఖండించారు. ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ కాగా వీడియోలో ఉన్నట్టుగా గుర్తించిన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీసు ప్రతినిధి అనిల్ మిట్టల్ చెప్పారు. కాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరింది. -
డ్రైవర్‌కు జైలు శిక్ష
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా) : అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలం అల్లాపల్లికి చెందిన కె.మునెప్ప(40) మరణానికి కారకుడైన కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా దిగవూరు పంచాయతీ కాగితి గ్రామానికి చెందిన టెంపో డ్రైవర్ ఎస్.మహబూబ్‌బాషాకు చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టు గురువారం శిక్ష వేసింది. ఏపీపీ రామకృష్ణ, మదనపల్లె రూరల్ ఎస్ఐ రవిప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం...2011లో మదనపల్లె నుంచి మహబూబ్‌బాషా టెంపోను నడుపుకుంటూ కర్ణాటకకు బయలుదేరాడు. అదే సమయంలో అల్లాపల్లెకు చెందిన మునెప్ప వెంకటేశ్వరస్వామి దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు. మార్గమధ్యంలోని బెంగళూరు రోడ్డులో గల చిప్పిలిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో ఢీకొని అతను అక్కడికక్కడే మరణించారు. అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితునికి మదనపల్లె ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మోహనరావు మూడు నెలల సాధారణ జైలుతో పాటు రూ.3 వేలు జరిమానా విధిస్తూ తీర్పువెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరపున రామకృష్ణ వాదించారు.