ten years completed
-
PM Narendra Modi: పదేళ్ల మన్‌కీ బాత్
న్యూఢిల్లీ: ‘‘మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్న వాదనలో నిజం లేదని మన్‌కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలకు అమితమైన ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమంతో తేటతెల్లమైంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం 114వ మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. దేశ ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం మారిందంటూ ప్రశంసించారు. దీనికి పదేళ్లు పూర్తయిన సందర్భం తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. ‘‘సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైంది. భారత స్ఫూర్తిని వేడుక చేసుకొనే విశిష్టమైన వేదికగా మారింది. దీనితో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రయాణంలో శ్రోతలు నాతోపాటు కలిసి నడిచారు. దేశ నలుమూలల నుంచి నాకు సమాచారం చేరవేశారు. మన్‌కీ బాత్ అంటే నా వరకు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం లాంటిదే. దీనితో అనుసంధానమైన ప్రతి అంశం ద్వారా సామాన్య ప్రజలను దర్శించుకున్నట్లే భావిస్తా. ప్రజలే నాకు దేవుళ్లు. 22 భారతీయ, 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ మలుపులో మరోసారి ప్రజల ఆశీస్సులు కోరుతున్నా’’ అన్నారు.పుణే మెట్రో తొలి దశ ప్రారంభం పుణే: ‘‘గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఒక ప్రణాళిక, దార్శనికత లోపించాయి. మేమొచ్చాక వచ్చాక పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పాత పని సంస్కృతికి చరమగీతం పాడాం’’ అని మోదీ చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో పుణే మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే స్మారక బాలిక పాఠశాల’ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. గత ప్రభుత్వాల విధానాలు అమల్లో ఉంటే పుణే మెట్రో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయి ఉండేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చొరవతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయని చెప్పారు. వాటికీ పదేళ్లు ప్రతిష్టాత్మకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కూడా పదేళ్లు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కూ అక్టోబర్ 2న పదేళ్లు పూర్తవుతాయన్నారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ విజయవంతమవుతోంది. జీవితాంతం పరిశుభ్రత కోసం తపించిన మహాత్మా గాం«దీకి ఇదో గొప్ప నివాళి. ఇక పారిశ్రామికవేత్తలతో పాటు చిరు వ్యాపారుల కృషితో ‘మేకిన్ ఇండియా’ విజయవంతమైంది. మన యువశక్తి కృషితో తయారీ రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. అటోమొబైల్స్ మొదలుకుని రక్షణ దాకా అన్ని రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి.స్థానికతకు జై స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ప్రోత్సహిస్తే అంతిమంగా దేశానికే లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. ‘‘మన గడ్డపై మన కళాకారులు, కారి్మకుల రెక్కల కష్టంతో తయారైన ఉత్పత్తులే మనకు గర్వకారణం. పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయండి’’ అని పిలుపునిచ్చారు. జల సంరక్షణలో నూతన విధానాలు చక్కటి ఫలితాలిస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘కొన్నిచోట్ల మహిళా శక్తి జలశక్తిని పెంచుతోంది. మరికొన్నిచోట్ల జలశక్తి మహిళా శక్తికి తోడ్పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పురా గ్రామంలో భారీ నీటి కుంట నిర్మించి భూగర్భ జలాలను పెంచారు. డ్వాక్రా మహిళలు అందులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు’’ అని చెప్పారు. -
Srinu Vaitla Birth Day: నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ..!
శ్రీను వైట్ల... ట్వంటీటూ ఇయర్స్ ఇండస్ట్రీ. డైరెక్టర్‌గా పదిహేడు సినిమాలు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్నారు. ఒక్క ప్రశ్నకు మాత్రం ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అనేశారు. మహేశ్‌బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘దూకుడు’కి నేటితో పదేళ్లు. శుక్రవారం శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీను వైట్లతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ.. ► ‘దూకుడు’ సినిమాకి పదేళ్లయిన సందర్భంగా కొన్ని విశేషాలు? మహేశ్‌బాబుతో సినిమా అనుకున్నాక ఒక స్టోరీ లైన్ అనుకోవడం.. దాన్ని మహేశ్ ఒప్పుకోవడం జరిగాయి. ఆ తర్వాత ఆ లైన్‌ని ఎనభై శాతం డెవలప్ చేశాక నాకు అసంతృప్తిగా అనిపించింది. డ్రాప్ చేసేశాను. ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకుంటున్న సమయంలో ‘మహేశ్‌ని ఎమ్మెల్యే గెటప్‌లో చూపిస్తే ఎలా ఉంటుంది?’ అనిపించింది. అలా పుట్టినదే ‘దూకుడు’. మహేశ్‌కి చెబితే ఎగ్జయిట్ అయ్యారు. పగ, ప్రతీకారాల నేపథ్యంలో వినోద ప్రధానంగా గోపీమోహన్‌తో కలసి, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశా. బాగా వచ్చింది. సెన్సేషనల్ హిట్టయింది. ► 22 ఏళ్ల క్రితం సినిమా కష్టాల్లాంటి కష్టాలు ఫేస్ చేసే ఉంటారు. ఫైనల్లీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు కూల్‌గా ఉండేంత పొజిషన్లో ఉన్నారు... ఎగ్జాట్లీ.. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. ఈ కరోనా టైమ్‌లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా.. షూటింగ్లకి దూరమవుతున్నామనే బాధ తప్ప వేరే కష్టాలు లేవు. అయితే ఇంట్లో ఎవర్నీ కాలు బయటపెట్టనివ్వకుండా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్నాను. ఆ విషయంలో నా పిల్లలు (ముగ్గురు కుమార్తెలు) కొంచెం కోపం ప్రదర్శించినా.. ఎందుకింత ప్రొటెక్టివ్‌గా ఉన్నానో తర్వాత అర్థం చేసుకున్నారు. ► స్త్రీల విషయంలో సమాజంలో పరిస్థితులు అంత బాగాలేవు. మరి.. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా చాలా జాగ్రత్తగా ఉంటారా? ఉంటున్నాను.. ఒక్కోసారి పిల్లల విషయంలో ‘ఓవర్ ప్రొటెక్టివ్’గా ఉంటాను. వాళ్లు ఇబ్బందిపడుతున్నారని అర్థం అవుతుంది. కానీ, జరుగుతున్న ఘోరాలు విన్నప్పుడు పిల్లల విషయంలో ఎక్స్ట్రా కేర్‌గా ఉండటం తప్పులేదనిపిస్తుంది. పెద్దమ్మాయి ప్లస్ టు, రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, మూడో పాప సెవెన్త్ చదువుతోంది. మెచ్యూర్టీ వచ్చాక నేనెందుకు అంత ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉన్నానో వాళ్లకు అర్థమవుతుంది. ► ‘అమర్ అక్బర్ ఆంటోని’ 2018 చివర్లో రిలీజైంది. 2020లో లాక్డౌన్. ఆ ఏడాదిన్నర గ్యాప్‌లో ఏం చేశారు? 2019లో ఒక స్క్రి‹ప్ట్ రెడీ చేశాను. 2020లో అది స్టార్ట్ అవ్వాలి. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత మరో కథ, ఆ తర్వాత ఇంకో ఆలోచన వస్తే.. నా రైటర్స్ టీమ్‌కి నచ్చడంతో అది కూడా తయారు చేశాం. మొత్తం మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో ‘ఢీ అండ్ ఢీ’ ఒకటి. ► ‘ఢీ’లో కథ, దానితో పాటు సాగే కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. మరి.. ‘ఢీ అండ్ ఢీ’లోనూ ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ వంటి డైలాగ్స్.. అంత కామెడీ ఉంటుందా? రెట్టింపు ఉంటుంది. అందుకే ‘ఢీ అండ్ ఢీ’కి ‘డబుల్ డోస్’ అని క్యాప్షన్ పెట్టాం. డబుల్ డోస్ ఆఫ్ కామెడీ అని అర్థం. ఇది ‘ఢీ’కి సీక్వెల్ కాదు. వేరే కథ. రావుగారూ.. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దులా పాపులర్ అయ్యే ౖడైలాగ్ ఇందులోనూ ఉంది. మిగతా అన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి. ► ‘ఢీ’లో విష్ణు కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు మేకోవర్‌తో స్లిమ్ అయ్యారు. ఇది ప్లస్సవుతుందా? కచ్చితంగా ప్లస్.. మేకోవర్ విషయంలో విష్ణు వండర్ఫుల్. ఎంతో కష్టపడి, ఫిట్‌గా తయారయ్యారు. ‘ఢీ’లో విష్ణు బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మెచ్యూర్టీ వచ్చింది కాబట్టి మ్యాగ్జిమమ్ పర్ఫార్మెన్స్ రాబట్టగలుగుతాననే నమ్మకం ఉంది. ‘ఢీ’ కంటే కూడా ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్లో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► గౌతమ్ మీనన్ వంటి దర్శకులు ఇటు సినిమాల్లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో నటులుగా కనిపిస్తున్నారు.. మీకా ఉద్దేశం లేదా? నాకు ఫొటోలు దిగడమంటేనే ఇబ్బంది. కెమెరా వెనకాల ఆర్టిస్టులకు ఎంతైనా చేసి చూపిస్తాను. కానీ, యాక్ట్ చేయాలనుకోలేదు. నాకా క్వాలిటీ లేదు. గౌతమ్ మీనన్ గురించి చెప్పాలంటే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇష్టం. ► దర్శకుడిగా ఓటీటీ ప్రాజెక్ట్ ఏదైనా? ఇప్పుడు నా దగ్గరున్న మూడు కథలు థియేటర్ మీటర్‌ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవే. ఓటీటీ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. ► మీతో ఎన్నో సినిమాలు చేసిన ప్రకాశ్‌రాజ్, రెండో సినిమా చేయనున్న విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.. గెలుపు ఎవరిదని ఊహిస్తున్నారు? ‘ఢీ’లో డైలాగే చెబుతాను. ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ... (నవ్వేస్తూ). ఇప్పుడు నా దృష్టంతా త్వరలో మొదలుపెట్టబోయే ‘ఢీ అండ్ ఢీ’ మీదే ఉంది. ఎంత బాగా తీయాలా అనే ప్లానింగ్‌లో ఉన్నాను. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నాం. ► కొన్ని హిట్స్‌తో పాటు ఫ్లాప్స్ చూశారు కదా.. ఫ్లాప్స్కి కారణం తెలుసుకున్నారా? నా నుంచి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారని గ్రహించాను. దానికి దూరంగా వెళ్లినప్పుడు వేరేగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే కథలో ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాను. -
హార్మోనికా లవర్స్‌కి పదేళ్లు
అదో బుల్లి పరికరం...చేతుల్లో ఇమిడిపోతుంది. నోటికి చేర్చితే రాగాలు చిలుకుతుంది. హీరోల మనసులోని భావాలను హీరోయిన్ల మనసులకు వీనుల విందుగా చేర్చింది. వారిద్దరి ప్రేమ‘చిత్రాల’కు రాగాలు జత చేసింది. గతకాలపు వైభవంగా మిగిలిపోతున్న మౌత్ ఆర్గాన్ వురఫ్ హార్మోనికా సిటీలో తిరిగి సందడి చేస్తోంది. ఆధునికుల అభిరుచిలో కొత్తగా వినిపిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో:‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ’ రాజేష్ ఖన్నా పాడుతుంటే సుజిత్ కుమార్ ఓ చేత్తో కార్ నడిపిస్తూ మరో చేత్తో ఓ చిరు సంగీత పరికరాన్ని పలికిస్తాడు. షోలే సినిమాలో అమితాబ్‌బచ్చన్, మైనే ప్యార్ కియాలో సల్మాన్‌ఖాన్, సాజన్ సినిమాలో సంజయ్‌దత్, మన దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ (నర్సింహా)... ఇలా మేటి స్టార్స్ చేతుల్లో ముద్దుగా ఒదిగిపోయి ముచ్చటైన ప్రేమ పలుకులకు తందాన పాడిన మౌత్ ఆర్గాన్ (సాంకేతిక నామం హార్మోనికా). దీనికి పునర్వైభవం తేవడానికి సినిమాలకే పరిమితం కాదని ప్రతి ఒక్కరూ పలకించి, ఆలకించి ఆస్వాదించదగ్గ వాయిద్యమని అంటున్న హార్మోనికా లవర్స్ ఆఫ్ హైదరాబాద్ హార్మోనికా వాడకం విస్త్రుతికి కృషి చేస్తోంది. 10న వార్షికోత్సవం నగరంలో గత నెల 14 నుంచి ఇండియన్ మౌత్ ఆర్గాన్ ప్లేయర్స్ మీట్ నిర్వహించారు. బేగంపేట్‌లోని ది మనోహర్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మీట్‌కు నగరానికి చెందిన భిన్న రంగాలకు చెందిన మహిళలు, పురుషులు హాజరై మౌత్ ఆర్గాన్ సంగీతంతో అలరించారు. ఈ నెల 10 వ తేదీన హోర్మోనికా లవర్స్ ఆఫ్ హైదరాబాద్ 10వ వార్షికోత్సవం జరుపుకోనుంది. మౌత్ ఆర్గాన్‌కు సంబంధించిన విశేషాలు కోరుకునేవారు లాగిన్ కావచ్చు.. www. harmonicahyderabad. blogspot. in పాడు... పాడించు... హార్మోనికా, అకార్డియన్ లాంటి వాటిని రీడ్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హార్మోనికా ఫ్యాన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఏటేటా హార్మోనికా అండ్ రీడ్ ఇన్స్ట్రుమెంట్ ఫెస్టివల్ పేరుతో నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రోజంతా కొనసాగే ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్స్‌లో హార్మోనికాతో పాటుగా సాక్సాఫోన్, అకార్డియన్, మెలొడికా... వంటివి ప్రస్తుతం కనుమరుగయ్యే దశలో ఉన్నవన్నీ ఇందులో భాగం అవుతున్నాయి. ఈ పరికరాలకు సంబంధించిన బ్రాండ్ విశేషాలు, తయారీ, స్కేల్... తదితర సమాచారం అందిస్తున్నారు. ‘ఈ గ్రూప్స్ పుణ్యమాని రీడ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్స్‌కి మళ్లీ ఊపు వస్తోంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని అభిమానిస్తున్న వాళ్లలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటీ నిపుణులు ఉన్నారు’ అని హార్మోనికా లవర్స్ క్లబ్ నిర్వాహకులు రమణ చెప్పారు. బెస్ట్ఇన్స్ట్రుమెంట్ ఇది... మా సంస్థను పదేళ్ల క్రితం అక్టోబరు 8న ఏర్పాటు చేశాం. హార్మోనికాను పలకించే అభిమానించే వారెవరైనా సభ్యులు కావచ్చు. మేం ప్రతి వారం ఇందిరాపార్క్ వేదికగా సమావేశమవుతాం. ఇది ఎవరైనా సరే నేర్చుకోగలిగిన ఎక్కడైనా సరే ప్లే చేయగలిగిన బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. మేం ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా ప్లే చేయడం నేర్పిస్తాం.– కె.రమణ, హార్మోనికా లవర్స్ ఆఫ్ హైదరాబాద్ -
అంత సీన్ లేదండీ బాబూ!
మిల్క్ బ్యూటీ తమన్నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పినవాళ్లూ, చెబుతున్నవాళ్లూ చాలామందే ఉన్నారు. మరి, తమన్నా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? ఇంతవరకూ ఆమెకు నచ్చిన వ్యక్తి తారసపడలేదా? ఈ ప్రశ్నలే తమన్నా ముందుంచితే - ‘‘ఒకవేళ ప్రేమలో పడాలని లక్ష్యంగా పెట్టుకుని ఉంటే, ఎవరో ఒకరు నచ్చేవారేమో. కానీ, ఇప్పటివరకు నాకు పరిచయమైనవాళ్లల్లో ఏ అబ్బాయినీ ఆ కోణంలో చూడలేదు. అసలు నాకంత తీరిక ఎక్కడుంది? హీరోయిన్ అయ్యి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లూ ఎలా గడిచిపోయాయో తెలియడంలేదు. ఏదో నిన్నా, మొన్నా వచ్చినట్లుంది’’ అన్నారు. డేటింగ్ పై మీ అభిప్రాయం? అనడిగితే - ‘‘బాగానే ఉంటుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకూ ఆ అనుభవం లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడానికే కష్టంగా ఉంది. ఇక, మిగతావాటికి ఎక్కడ టైముంటుంది? ఇప్పట్లో డేటింగ్ చేసే సీన్ లేదండీ బాబూ. ప్రస్తుతం నా ప్రేమనంతా సినిమాలకు అంకితం చేసేశా’’ అని తమన్నా తెలిపారు.