Tenth class Supplementary examination
-
‘పది’ జవాబు పత్రాలు గల్లంతు
కాగజ్‌నగర్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల గల్లంతయిన ఘటన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జవాబు పత్రాలు గల్లంతు కాగా రెండు రోజుల అనంతరం దొరికాయి. ఈ మేరకు బుధవారం కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న కాగజ్‌నగర్ పట్టణంలోని మూడు కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 65 మంది విద్యార్థులు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు రాయగా వాటికి సంబంధించిన జవాబు పత్రాలను అదే రోజు సాయంత్రం పట్టణంలోని తపాలా కార్యాలయానికి తరలించారు. పోస్టల్ అధికారులు ఒక బ్యాగులో జవాబు పత్రాలను భద్రపరిచి రైలు ద్వారా మంచిర్యాల సార్టింగ్ కేంద్రానికి తరలించడానికి ప్రయత్నించారు. జవాబు పత్రాల బ్యాగుతోపాటు మొత్తం 13 బ్యాగులు ఆటోలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. గ్రాండ్‌ట్రంక్ (జీటీ) ఎక్స్‌ప్రెస్‌లో మంచిర్యాలకు తరలించడానికి ఆర్ఎంఎస్ (రైల్వే మెయిన్ సర్వీసెస్) బోగీలో ఎక్కిస్తుండగా అందులో ఒక బ్యాగు లేనట్లు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. అయినా ఎంతకూ దొరక్కపోవడంతో ఈ నెల 11న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో నుంచి జారిపడటంతో.. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాగులు తరలించిన రోజు ఈదురుగాలులతో కూడిన వర్షం ఉండటంతో ఆటో నుంచి జవాబు పత్రాలు కింద పడినట్లు తేల్చారు. ఆ బ్యాగు గుర్తుతెలియని మహిళకు దొరకడంతో ఆమె ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో అప్పగించింది. రైల్వే ఉద్యోగి విధు లు ముగించుకుని బుధవారం ఇంటికి రావడంతో అతని కంట పడింది. పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. డీఈవో భిక్షపతి సమక్షంలో పరీక్ష కేంద్రాల సూపరింటెం డెట్లు శంకరయ్య, హన్మంతు, వరలక్ష్మి బ్యాగును పరిశీలించారు. తాము వేసిన సీలులో ఏ తేడా లేదని తేలడంతో జిల్లా అధికారికి అప్పగించారు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జవాబు పత్రాలు గల్లంతైన ట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. -
టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 61 శాతం ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ - ఈనెల 31 వరకు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు - షార్ట్ మెమోతోనే ప్రవేశాలకు అవకాశం సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 61.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 97,471 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. జూన్ 15 నుంచి 29 వరకు నిర్వహించిన పరీక్షలకు 95,736 మంది హాజరయ్యారు. అందులో 58,661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి 1.64 శాతం మంది తక్కువగా ఉత్తీర్ణులయ్యారు. 60.06 శాతం మంది బాలురు, 62.79 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. వరంగల్ జిల్లా 88.49 శాతం ఉత్తీర ్ణతతో మొదటి స్థానంలో నిలువగా, ఖమ్మం జిల్లా 52.75 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలను పాఠశాల విద్య ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ ఆదివారం ైెహ దరాబాద్‌లో విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా జూనియర్ కాలేజీల్లో చేరవచ్చని ఆయన సూచించారు. లాంగ్ మెమో, టీసీ లేదన్న ఆందోళన వద్దని, ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ప్రస్తుత మార్కుల షీట్ ఆధారంగా కాలేజీల్లో చేరవచ్చని తెలిపారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 25లోగా రీ కౌంటింగ్ దరఖాస్తులు ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, లేదా మార్కులు తక్కువ వచ్చాయన్న అనుమానం ఉన్న వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 18 నుంచి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్బీహెచ్ లేదా ఎస్బీఐలో ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి, ప్రభుత్వ పరీక్షల విభాగానికి నేరుగా, లేదా పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవచ్చు. రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం విద్యార్థులు 18 నుంచి 25వ తేదీలోగా సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 ఫీజుగా చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై సంబంధిత ప్రధానోపాధ్యాయుని ధ్రువీకరణ సంతకం చేయించి అందజేయాలి.