టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 61 శాతం ఉత్తీర్ణత | 61 percent pass in the Tenth advanced | Sakshi
Sakshi News home page

టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 61 శాతం ఉత్తీర్ణత

Published Mon, Jul 18 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 61 శాతం ఉత్తీర్ణత

టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 61 శాతం ఉత్తీర్ణత

- ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ
- ఈనెల 31 వరకు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు
- షార్ట్ మెమోతోనే ప్రవేశాలకు అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 61.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 97,471 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. జూన్ 15 నుంచి 29 వరకు నిర్వహించిన పరీక్షలకు 95,736 మంది హాజరయ్యారు. అందులో 58,661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి 1.64 శాతం మంది తక్కువగా ఉత్తీర్ణులయ్యారు. 60.06 శాతం మంది బాలురు, 62.79 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. వరంగల్ జిల్లా 88.49 శాతం ఉత్తీర ్ణతతో మొదటి స్థానంలో నిలువగా, ఖమ్మం జిల్లా 52.75 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలను పాఠశాల విద్య ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ ఆదివారం ైెహ దరాబాద్‌లో విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా జూనియర్ కాలేజీల్లో చేరవచ్చని ఆయన సూచించారు. లాంగ్ మెమో, టీసీ లేదన్న ఆందోళన వద్దని, ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న ప్రస్తుత మార్కుల షీట్ ఆధారంగా కాలేజీల్లో చేరవచ్చని తెలిపారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

 ఈనెల 25లోగా రీ కౌంటింగ్ దరఖాస్తులు
 ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, లేదా మార్కులు తక్కువ వచ్చాయన్న అనుమానం ఉన్న వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్  కోసం ఈనెల 18  నుంచి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌బీహెచ్ లేదా ఎస్‌బీఐలో ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి, ప్రభుత్వ పరీక్షల విభాగానికి నేరుగా, లేదా పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవచ్చు. రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం విద్యార్థులు 18 నుంచి 25వ తేదీలోగా సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 ఫీజుగా చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై సంబంధిత ప్రధానోపాధ్యాయుని ధ్రువీకరణ సంతకం చేయించి అందజేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement