లక్ష కోట్లు దాటిన మొదటి ప్రణాళిక ఏది?
ప్రణాళికలు
పదో పంచవర్ష ప్రణాళిక
పదో పంచవర్ష ప్రణాళికలో సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి, పేదరికం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2002 లో ఆమోదించింది. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.15,25,639 కోట్లు. వీటిలో శక్తి/ ఇంధన రంగానికి 27%, సేవల రంగానికి 26%, రవాణా, సమాచార రంగానికి 23%, వ్యవసాయం, నీటిపారుదలకు 20%, పరిశ్రమలకు 4% కేటాయించారు.
10వ ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం 8%. సాధించింది 7.8%. వృద్ధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల ముఖ్యలక్ష్యం మెరుగైన జీవన విధానాన్ని సాధించడం. దీన్ని గుర్తించి పదో పంచవర్ష ప్రణాళికలో 8 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతోపాటు అదనంగా ప్రజా సంక్షేమం పెంపొందించే కొన్ని అంశాలను పొందుపరిచారు. అవి...
* జాతీయాదాయ వృద్ధిరేటు లక్ష్యం 8% (సాధించింది 7.8%)
* వ్యవసాయ రంగం వృద్ధిరేటు లక్ష్యం 4% (సాధించింది 3.42%)
* పారిశ్రామిక రంగం వృద్ధిరేటు లక్ష్యం 8.9% (సాధించింది 8.74%)
* సేవల రంగం వృద్ధిరేటు లక్ష్యం 9.4% (సాధించింది) 9.3%
* జీడీపీలో పొదుపురేటు వృద్ధి లక్ష్యం26.8% (సాధించింది 23.3%)
* జీడీపీలో పెట్టుబడి వృద్ధిరేటు 28.4% (సాధించింది 28.1%)
పదో ప్రణాళికలో పైనపేర్కొన్న కీలక అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలకు చాలా దగ్గరగా చేరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథం వైపు మళ్లించడానికి దోహదం చేయగలిగారు. కానీ, వృద్ధి ప్రక్రియలో ఉన్న కఠినత్వం వల్ల దాని ప్రయోజనాలు సమాజంలోని పేద, బలహీన వర్గాలకు అందలేదు.
పదో ప్రణాళికలో నిర్దేశించిన మరికొన్ని లక్ష్యాలు
* 2007 నాటికి అందరికీ సార్వత్రిక, ప్రాథమిక విద్యను కల్పించడం.
* అక్షరాస్యత రేటును 75 శాతానికి పెంచడం.
* పేదరికం నిష్పత్తిని 2007 నాటికి 5% పాయింట్లు, 2012 నాటికి 15% పాయింట్లు తగ్గించడం.
* 2001-11 దశాబ్దంలో జనాభావృద్ధి రేటు 16.2 శాతానికి తగ్గించడం.
* 2007 నాటికి 50 మిలియన్ల (5 కోట్లు) ఉద్యోగావకాశాలు కల్పించడం.
* అడవుల విస్తీర్ణం 2007 నాటికి 25 శాతానికి, 2012 నాటికి 33 శాతానికి విస్తరింపజేయడం.
* జీడీపీలో పన్ను నిష్పత్తిని 10.3 శాతానికి పెంచడం.
* ఏటా సగటున 7.5 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) సమీకరించడం.
* సగటు ద్రవ్యోల్బణం రేటు 5 శాతానికి మించకుండా చూడటం.
* 2012 నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ రక్షిత తాగునీరు అందించడం.
* 2007 నాటికి దేశంలోని నదులు, 2012 నాటికి గుర్తించిన నీటి వనరుల ఆధారాలన్నింటినీ శుద్ధి చేయడం. (కాలుష్యానికి గురైన ముఖ్య నదులన్నింటినీ శుద్ధి చేయడం).
పదో ప్రణాళికలో ప్రారంభించినముఖ్యమైన పథకాలు
ప్రణాళికా సంఘం సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ గుప్తా 'Indian Vision 2020’°రూపొందించారు. దీన్ని ప్రణాళికా సంఘం 2003 జనవరి 23న విడుదల చేసింది. ఇది 2020 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను గుర్తించింది.
Vision - 2020 ముఖ్యాంశాలు:
1. జీడీపీ వార్షిక వృద్ధిరేటు 9% సాధించాలి.
2. 2020 నాటికి నిరుద్యోగిత, పేదరికం, నిరక్షరాస్యతలను నిర్మూలించాలి.
3. 6-14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలి.
4. పర్యావరణ సమతౌల్యం సాధించాలి.
5. వార్షిక ఉద్యోగ కల్పనరేటు 2% పెంచు తూ, 2020 నాటికి 20 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.
6. వ్యవసాయ రంగం ఉపాధి కల్పనను
2020 నాటికి 40 శాతానికి తగ్గించాలి.
PURA (Provision of Urban Amenities in Rural Areas):
ఏపీజే అబ్దుల్ కలాం నమూనా ఆధారంగా గ్రామాలను పటిష్ట పర్చేందుకు పట్టణాల్లోని సౌకర్యాలను గ్రామాల్లో కల్పించడానికి 2004 ఫిబ్రవరి 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ్క్ఖఖఅ నమూనా 4 రంగాల మధ్య సంధానంతో కూడింది. అవి:
1. భౌతిక అంశాల అనుసంధానం
2. ఆర్థిక అంశాల అనుసంధానం
3. విద్య లేదా పరిజ్ఞాన అనుసంధానం
4. విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రానిక్ అనుసంధానం
ఈ నమూనాలో కొన్ని మున్సిపాలిటీలను ఎంపిక చేసి, వాటి చుట్టూ 15 కి.మీ. పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో మున్సిపాలిటీ స్థాయి సౌకర్యాలు కల్పించే చర్యలు చేపట్టారు. 15 నుంచి 20 గ్రామాలను అనుసంధానం చేసి రోడ్లు నిర్మించడం, ప్రతి 5-7 కి.మీ. వ్యవధిలో ఒక రింగ్ రోడ్, పాఠశాల, ఒక ఉన్నత విద్యాకేంద్రం, ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే అంశాలను తీసుకున్నారు. 2020 నాటికి ‘సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించాలి’ అనేది దీని లక్ష్యం.
JNNURM (Jawaharlal Nehru National Urban Renewal Mission):
ఇది దేశంలో పట్టణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం. దీన్ని 2005 డిసెంబరు 3న ప్రారంభించారు. దేశంలోని ఎంపిక చేసిన 63 పట్టణాల్లో 2005 నుంచి 2012 లోపు పేదవారికి గృహ వసతి కల్పించడం, వారికి కనీస వసతులు కల్పించి పట్టణ పేదప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టారు.
BNY (Bharath Nirman Yojana):
గామీణ అవస్థాపన సౌకర్యాలను మెరుగుపర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీన్ని 2005 డిసెంబరు 16న ప్రారంభించారు. 6 అంశాలను మెరుగుపర్చడం వల్ల వృద్ధిని సాధించాలని నిర్ణయించారు. మొదట ఈ కార్యక్రమానికి కాలపరిమితిని 4 ఏళ్లుగా (2005-09) నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో 6 అంశాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం రూ. 1,74,000 కోట్లు కేటాయించారు.
ఆరు అంశాలు:
1. సాగునీరు
2. తాగునీరు
3. గ్రామీణ రోడ్లు - రవాణా
4. గృహవసతి
5. గ్రామీణ సమాచారం (టెలిఫోన్)
6.గ్రామీణ విద్యుద్దీకరణ
(Rural Electrification)
ఈ ఆరు అంశాలను గ్రామీణ ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తారు.
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో ప్రణాళికల గురించి దేంట్లో ప్రస్తావించారు?
1) పౌర హక్కులు 2) పౌర విధులు
3) ఆదేశిక సూత్రాలు
4) సమన్వయ సూత్రాలు
2. భారత క్షిపణి పితామహుడు ఎవరు?
1) హోమీ జె. బాబా
2) ఏపీజే అబ్దుల్ కలాం
3) విక్రమ్ సారాబాయ్
4) బి.వి.రావ్
3. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు కొద్దిమందికే లభించాయని, వీటిని అన్ని వర్గాలవారికి వర్తించే విధంగా రెండో తరం ఆర్థిక సంస్కరణలు అవసరమని ఎన్నో ప్రణాళికలో పేర్కొన్నారు?
1) 8 2) 9 3) 10 4) 11
4. 1991లోని ఆర్థిక సంస్కరణలు ఏ రంగంలో ప్రవేశపెట్టలేదు?
1) బ్యాంకింగ్ రంగం
2) విదేశీ వర్తకం
3) పన్నుల విధానం
4) శ్రామిక చట్టాలు
5. కిందివాటిలో 8వ ప్రణాళికలో అనుసరించని అంశం ఏది?
1) ఉద్యోగ కల్పన
2) మానవ వనరుల అభివృద్ధి
3) వికేంద్రీకరణ
4) ప్రభుత్వ నియంత్రణ
6. భారత్ నిర్మాణ్ పథకం (2005-09)లో భాగం కాని అవస్థాపనా సౌకర్యం ఏది?
1) గ్రామీణ ఆరోగ్యం
2) గ్రామీణ రోడ్లు
3) గ్రామీణ ఆవాసం
4) నీటి పారుదల
7. భారతదేశంలో తొలిసారిగా 5 శాతం వృద్ధిరేటును మించిన ప్రణాళిక ఏది?
1) 5 2) 6 3) 4 4) 3
8. భారతదేశంలో లక్ష కోట్లు దాటిన మొదటి ప్రణాళిక ఏది?
1) 5 2) 6 3) 4 4) 3
9. కిందివాటిలో 7వ ప్రణాళికలో అనుసరించిన అంశాలేవి?
1) వేతన వస్తు వ్యూహం
2) ఆహారం - ఉపాధి - ఉత్పాదకత
3) రాజీవ్ మోడల్ 4) పైవన్నీ
10. 2003లో ప్రారంభించిన ధరల స్థిరీకరణ నిధిలో భాగం కాని పంట ఏది?
1) కాఫీ 2) రబ్బర్
3) పత్తి 4) పొగాకు
11. భారతదేశంలో అమలు చేయని ప్రణాళిక విధానం ఏది?
1) ఆర్థిక ప్రణాళిక
2) సూచనాత్మక ప్రణాళిక
3) నిర్దేశాత్మక ప్రణాళిక
4) పైవేవీకావు
12. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు కిందివాటిలో ఏ ప్రణాళికా విధానం అనుసరణీయం?
1) ఆర్థిక ప్రణాళిక
2) సూచనాత్మక ప్రణాళిక
3) నిర్దేశాత్మక ప్రణాళిక
4) మిశ్రమ ప్రణాళిక
13. ఎన్నో ప్రణాళికలో మొదటిసారిగా ప్రభుత్వ పెట్టుబడి కంటే ప్రైవేట్ పెట్టుబడి ఎక్కువగా ఉంది?
1) 5 2) 7 3) 8 4) 11
14. జాతీయ సామాజిక సహాయత కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం?
1) 1985 2) 1995
3) 2005 4) 2012
15. {V>-Ò$× ప్రాంతాల్లో భూమిలేని కుటుంబాలకు సంవత్సరానికి వంద రోజులు ఉపాధి కల్పించడానికి దేశంలో ప్రారంభించిన మొదటి పథకం ఏది?
1) RLEGP 2) NREGP 3) JRY 4) NRY
16. కిందివాటిలో గ్రామీణాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యంఇచ్చిన ప్రణాళిక ఏది?
1)7వ 2) 8వ 3)9వ 4)10వ
17. ‘తెలంగాణా అభివృద్ధి బోర్డు’ను ఎన్నో ప్రణాళికలో ఏర్పాటు చేశారు?
1) 12 2) 11 3) 10 4) 4
18. భారతదేశంలో 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1975 జనవరి 1 2) 1975 ఏప్రిల్ 1
3) 1975 మే 1 4) 1975 జూలై 1