terrorist arrested
-
బళ్లారిలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు
సాక్షి, బళ్లారి: నిషేధిత పీఎఫ్ఐకి సంబంధించిన కొంతమంది యువకులకు తుపాకులు, మారణాయుధాలు ఎలా ఉపయోగించాలి అనేదానిపై శిక్షణ ఇస్తున్న మహమ్మద్ యూసఫ్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని కౌల్‌బజార్‌లో తలదాచుకున్న నిందితుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధాల వాడకంపై శిక్షణ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. పీఎఫ్ఐని నిషేధించిన తర్వాత కౌల్‌బజార్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం ప్లంబర్ పని చేసుకుంటూ, గుట్టుగా ఆయుధాల శిక్షణనిచ్చేవాడని తెలిసింది. -
ఉగ్ర ప్రణాళిక విఫలం.. పాక్ ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదిని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ ఉగ్రవాది నుంచి ఏకే 47 సహా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో ఢిల్లీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఉగ్రవాదిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక)చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా స్పందిస్తూ.. స్పెషల్ సెల్ బృందం పాకిస్తాన్ ఉగ్రవాదిని పట్టుకుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా దసరా పండగ నేపథ్యంలో ఓ పెద్ద ఉగ్రదాడి జరగకుండా స్పెషల్ సెల్ బృందం విఫలం చేసిందనిపేర్కొన్నారు. -
జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్
శ్రీనగర్: ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ఇర్షాద్ అహ్మద్ రిషిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆదివారం అరెస్ట్ చేసింది 2017లో దక్షిణ కశ్మీర్ లెత్‌పోరాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ జరిగిన దాడితో ఇర్షాద్కు సంబంధం ఉన్నట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది. కాగా, ఈ దాడిలో ఐదుగురు అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇర్షాద్ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదో నిందితుడు. అతడు జైషే ఉగ్రసంస్థ అండర్ గ్రౌండ్ వర్కర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జైషే కమాండర్ నూర్ మహమ్మద్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులకు ఇర్షాద్ ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. కాగా, నిందితున్ని సోమవారం జమ్మూలోని ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. -
మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : బాంబుల తయారీలో దిట్ట, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ ఎట్టకేలకు పోలీసుల చేతికిచిక్కాడు. 2008 గుజరాత్ వరుస పేలుళ్లతోపాటు పలు రాష్ట్రాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు ఖురేషీపై కేసులున్నాయి. ఇంటర్‌పోల్ జారీచేసిన మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన ఖురేషీపై రూ.4లక్షల రివార్డు కూడా ఉంది. కాల్పుల కలకలం : 2008 గుజరాత్ పేలుళ్ల తర్వాత కనిపించకుండాపోయిన ఖురేషీ కోసం పలు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నరు. కాగా, ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అతను తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఢిల్లీ ప్రత్యేక పోలీసు రంగంలోకిదిగారు. సోమవారం ఉదయం ఆపరేషన్ ముగిసిందని, ఖురేషీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు, ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. నిమిషాల వ్యవధిలో 21 బాంబులు పేల్చి.. : దేశంలో ఉగ్రచర్యలకు సంబంధించి ‘అహ్మదాబాద్ వరుస పేలుళ్ల’ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరు పేలుళ్లు జరిగిన మరుసటిరోజే అంటే, 2008, జులై 26న అహ్మదాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబులు పేలాయి. మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి గాయాలయ్యాయి. ఆ పలుళ్లు జరిపింది తామేనని ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ ప్రకటించుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అక్కడ గురి తప్పి... ఇక్కడ పేలిందా!
చెన్నై : ఉద్యాననగరిపై ఉగ్రవాదుల గురి తప్పి.. చెన్నైని టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం జరిగిన జంట పేలుళ్లు ఘటన దానికి బలం చేకూర్చేలా ఉంది. బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక విధాన సౌధను పేల్చడానికి కుట్రపన్నిన ఐఎస్ఐ ఉగ్రవాదిని తమిళనాడు పోలీసులు రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకు జాహీర్ హుసేన్ అనే ఉగ్రవాదిని మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బెంగళూరులోని విధాన సౌధతో పాటు మరికొన్ని ఐటీ కంపెనీల కేంద్ర కార్యాలయాలను బాంబులతో పేల్చివేయడానికి కుట్రపన్నినట్లు జాహీర్ హుసేన్ వెల్లడించాడని తెలుస్తోంది. కాగా జాహీర్ హుసేన్ అరెస్ట్‌తో బెంగళూరులో ముప్పు కొంతవరకు తప్పినా.. ఉగ్రవాదులు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతన్ని అరెస్ట్ చేసిన రెండోరోజే ఈ పేలుళ్లు జరగటం గమనార్హం. దీంతోపాటు ఇంకా ఎక్కడైనా పేలుళ్లకు పాల్పడే ప్రమాదముందేమోనని నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. అయితే పేలుళ్లతో తమకు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.