
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్: ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ఇర్షాద్ అహ్మద్ రిషిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం అరెస్ట్ చేసింది 2017లో దక్షిణ కశ్మీర్ లెత్‌పోరాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ జరిగిన దాడితో ఇర్షాద్‌కు సంబంధం ఉన్నట్టుగా ఎన్‌ఐఏ అనుమానిస్తుంది. కాగా, ఈ దాడిలో ఐదుగురు అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇర్షాద్ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదో నిందితుడు. అతడు జైషే ఉగ్రసంస్థ అండర్ గ్రౌండ్ వర్కర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జైషే కమాండర్ నూర్ మహమ్మద్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులకు ఇర్షాద్ ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. కాగా, నిందితున్ని సోమవారం జమ్మూలోని ఎన్‌ఐఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment