బెంగాల్‌లో ఎన్‌ఐఏ అధికారులపై దాడి.. | Anti Terror Agency NIA attacked in Bengal East Medinipur | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ఎన్‌ఐఏ అధికారులపై దాడి..

Published Sat, Apr 6 2024 12:18 PM | Last Updated on Sat, Apr 6 2024 1:23 PM

Anti Terror Agency NIA attacked in Bengal East Medinipur - Sakshi

లక్నో: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టింది. 2022లో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్‌ఐఏకు చెందిన యాంటీ టెర్రర్‌ స్కాడ్‌ బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. ఈ  కేసులో ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానాతో సహా ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారుల అరెస్టు చేశారు.

అయితే జిల్లాలోని భూపతినగర్‌ ప్రాంతం నుంచి అధికారులు తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఒక గుంపు  ఎన్‌ఐఏ బృందంపై దాడి చేసింది. ఇటుకలు, రాళ్లతో అధికారులపై తిరగబడ్డారు. ఈ ఘటనణలో ఒక అధికారి గాయపడ్డారు. అలాగే ఏజెన్సీకి చెందిన ఓకారును కూడా ధ్వంస చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొంతమంది మహిళలు, పురుషులు అధికారులను అడ్డగించి, వారిపై గట్టిగట్టిగా అరవడం ప్రారంభించారు. వాళ్లను వెనక్కి వెళ్లాలని అరిచారు. అయితే పలువురు మహిళలు తమ చేతుల్లో వెదురు కర్రలతో భద్రతా సిబ్బంది ముందు కూర్చున్నారు. 

అనంతరం ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని కుటుంబ సభ్యులతో పాటు గుర్తు తెలియని వక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అధికారులపై దాడి ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.

అయితే తాము సోదాలు చేసేముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగానే సమాచారమిచ్చినప్పటికీ, సరైన భద్రతను స్థానిక పోలీసులు కల్పించలేకపోయారని ఎన్ఐఏ బృందాలు ఆరోపించాయి. కాగా 2022 డిసెంబర్ 3న భూపతినగర్‌లోని టీఎంసీ నేత ఇంటి వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.
చదవండి: 
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement