
కోల్‌కతా : చిరుతపులి దాడిలో టీ గార్డెన్ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 54 ఏళ్ల మార్థియస్ ముండా శనివారం సాయంత్రం తన పశువులను ఇంటికి తీసుకువెళ్లడానికి మెటెలి బ్లాక్‌లోని బారాదిఘీ టీ ఎస్టేట్‌కు వెళ్లాడు. పశువులను తీసుకొని ఇంటికి వెళుతుండగా అప్పటికే అక్కడి చెట్ల పొదల్లో దాక్కున్న ఓ చిరుతపులి అమాంతం వెనుకవైపు నుంచి అతని మీదకు దూకింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ముండా గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు అటవీ అధికారి తెలిపారు. ఈ దాడిలో ముండా చేతికి, వీపు వెనుక భాగంలో తీవ్ర గాయాలవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment