ఏనుగుల దాడిలో ఐదుకు చేరిన మృతులు
బర్ధమాన్: పశ్చిమ బెంగాల్లో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. బర్ధమాన్ ప్రాంతంలో అడవి ఏనుగుల మంద నుంచి చెదిరిపోయిన కొన్ని ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించాయి. ఆదివారం జరిగిన వేరు ఘటల్లో..నలుగురు వ్యక్తులు మృతి చెందగా ఇవాళ ఉదయం మరో వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందాడు. అటవీ శాఖ అధికారుల అలసత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
బర్ధమాన్ జిల్లాలోని నశిగ్రామ్ గ్రామానికి చెందిన ఆనందమయి రాయ్ (60), నారాయణ్ చంద్ర మాఝి(60), బఘాసొలే గ్రామానికి చెందిన ప్రకాశ్ బోయ్‌రా(40)లను ఏనుగులు తొక్కి చంపాయి.మరో ఘటనలో మంతేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్ గ్రామంలో తన పొలంలో పనిచేస్తున్న సిరాజ్ షేక్(45)ను సైతం అడవి ఏనుగు వెంటాడి తొక్కి చంపేసింది. తొండంతో సిరాజ్ కాలిని పట్టుకొన్న ఏనుగు అతన్ని నేలకేసి కొడుతున్న దృశ్యాలు పలువురిని విస్మయానికి గురిచేశాయి.