బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నేరస్థులను గాలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలోని బీజేపీకి చెందిన కార్యకర్త సాయి ప్రసాద్‌ను ఇంటరాగేట్ చేస్తున్నట్లు సమాచారం. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో ప్రసాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్‌ఐఏ అతడిని విచారణకు తీసుకొచ్చింది.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి 10 రోజుల క్రితం ఎన్‌ఐఏ పలు ఇళ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపైన పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
NIA has interrogated a BJP leader in Thirthahalli, Shivamoga, in connection with the Rameswaram Cafe blast case in Bengaluru.
— Dr Jwala Gurunath (@DrJwalaG) April 5, 2024
Don't be surprised that it's linked to BJP.
Remember how fast bhakts jumped & abu$ed congress govt in Karnataka .#RameshwaramCafe
Comments
Please login to add a commentAdd a comment