Pakistan: Arrest Of Terrorists In Delhi Big Attack Failed- Sakshi
Sakshi News home page

ఉగ్ర ప్రణాళిక విఫలం.. పాక్‌ ఉగ్రవాది అరెస్ట్‌

Published Tue, Oct 12 2021 1:02 PM | Last Updated on Tue, Oct 12 2021 3:32 PM

Pakistan Terrorist Arrested In Delhi Big Attack Foiled - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఉగ్రవాదిని ఢిల్లీలో స్పెషల్‌ సెల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఆ ఉగ్రవాది నుంచి ఏకే 47 సహా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో ఢిల్లీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఉగ్ర‌వాదిపై చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల(నిరోధ‌క‌)చ‌ట్టం, పేలుడు ప‌దార్థాల చ‌ట్టం, ఆయుధాల చ‌ట్టంతోపాటు ఇత‌ర సంబంధిత చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 

ఈ ఘటనపై పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ అస్థానా స్పందిస్తూ.. స్పెషల్‌ సెల్‌ బృందం పాకిస్తాన్‌ ఉగ్రవాదిని పట్టుకుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా దసరా పండగ నేపథ్యంలో ఓ పెద్ద ఉగ్రదాడి జరగకుండా స్పెషల్‌ సెల్‌ బృందం విఫలం చేసిందనిపేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement