ఐఫోన్ అన్‌లాక్ చేసినందుకు రూ.8.66 కోట్లు!
వాషింగ్టన్: అమెరికాలో శాన్ బెర్నార్డినో కాల్పుల ఘటనలో మరణించిన ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫారూక్ వాడిన యాపిల్ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసినందుకు హ్యాకర్స్‌కు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ రూ.8.66కోట్ల ఫీజు చెల్లించింది. లండన్‌లో గురువారం జరిగిన భద్రతా సదస్సులో ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమీ ఈమేరకు పరోక్షంగా వెల్లడించారు.
‘నేను రిటైరయ్యేలోగా పొందే వేతనం కంటే ఎక్కువ ఫీజును హ్యాకర్లకు ఇచ్చాం’అని ఆయన అన్నారు. ఏడాదికి రూ.1.23కోట్ల వేతనాన్ని పొందుతున్న జేమ్స్ ఏడేళ్ల తర్వాత రిటైర్ అవనున్నారు. ఈ లెక్కన హ్యాకర్లకు రూ.8.66కోట్లు చెల్లించినట్లు సమాచారం.