అశ్విన్ @ నెంబర్‌వన్
కోల్‌కతా టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ విజృంభించిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు, సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబరచడంతో ర్యాంక్ మెరుగుపడింది. తాజా జాబితాలో షకీబల్ హసన్, కలిస్‌ను వెనక్కినెట్టి అశ్విన్ నెంబర్‌వన్ పీఠం అధిరోహించాడు.
ఇక బ్యాట్స్‌మెన్, బౌలర్ల జాబితాల్లోనూ అశ్విన్ ర్యాంక్ మెరుగైంది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్, బౌలర్ల జాబితాలో రెండు స్థానాలు సంపాదించి ఆరో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా జాబితాలో భారత క్రికెటర్ల ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి.