texas Police
-
తప్పు చేశాం.. టెక్సాస్ నరమేధంపై పోలీసుల ప్రకటన
టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సుమారు గంటపాటు ఆగిన తర్వాత లోపలికి ప్రేవేశించడాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు. టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ హెడ్ స్టీవెన్ మాక్క్రా ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన సమయంలో.. సుమారు గంటపాటు వేచిచూసే ధోరణి అనేది తప్పుడు నిర్ణయంగా అభివర్ణించారు ఆయన. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం ఘోరానికి కారణమైందని పేర్కొన్నారు ఆయన. దుండగున్ని కాల్పులు జరపకుండా కాసేపు నిలువరించగలిగినా సరిపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఘటన సమయంలో త్వరగా స్పందించి ఉండాలని మీరైతే ఎలా అనుకుంటున్నారో.. మేమూ అదే అనుకుంటున్నాం. ఒకవేళ అదే గనుక నష్టనివారణ మార్గం అనుకుంటే.. నేను మీకు క్షమాపణలు చెప్తున్నా.. అంటూ మీడియా సాక్షిగా బాధిత కుటుంబాలకు ఆయన క్షమాపణలు తెలియజేశాడు. టీచర్లతో పాటు కొందరు పిల్లలు కూడా 911 కి ఫోన్ చేసి సాయం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని రక్షించే అవకాశాలు ఉన్నా సకాలంలో పోలీసులు స్పందించలేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. మంగళవారం రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో నరమేధం సృష్టించిన సాల్వడోర్ రామోస్(18)ను మట్టుపెట్టడానికి.. ఒక గంట సమయం పట్టింది. ఆ సమయంలో కొందరు పోలీసులు బయట ఉండగా.. పేరెంట్స్ దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఉదయం 11.30 గం. ప్రాంతంలో సాల్వడోర్ స్కూల్లోకి ప్రవేశించగా.. సుమారు 48 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. అయితే మధ్యాహ్నం 12.50 గం. ప్రాంతంలో యూఎస్ బార్డర్ పాట్రోల్ ఏజెంట్లు తలుపులు బద్ధలు కొట్టి కాల్చి చంపారు. చదవండి: ఆ చిన్నారి ఒంటికి రక్తాన్ని పూసుకుని బతికి బయటపడింది -
అమెరికాలో మళ్లీ కాల్పులు!
అమారిలో: ఆర్లెండోలోని నైట్ క్లబ్బులో జరిగిన దారుణమైన కాల్పుల ఉదంతం మరువకముందే మళ్లీ అమెరికాలో కాల్పుల మోత మోగినట్టు తెలుస్తోంది. టెక్సాస్ అమారిలోలోని వాల్‌మార్ట్ వద్ద ఓ సాయుధుడు కాల్పులతో కలకలం రేపాడు. సాయుధుడి చేతిలో పలువురు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లడం మానుకోవాలని, ట్రాఫిక్ మీద దృష్టి పెట్టడం కన్నా సంఘటన స్థలంలో పరిస్థితులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని అమారిలో పోలీసు విభాగం సూచించింది. వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తుపాకులతో వీరంగానికి దిగినట్టు తెలుస్తున్నదని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఎవరూ కాల్పుల బారిన పడలేదని, కాల్పుల వల్ల ఎవరు గాయపడ్డట్టు సమాచారం లేదని అమారిలో పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు వాల్‌మార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగడం లేదని వెల్లడించారు. సాయుధుడి ఆధీనంలో ఉన్న బందీలంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఆర్లెండోలోని ఓ గే నైట్‌క్లబ్బులో రెండ్రోజుల కిందట ఓమర్ మతీన్ ఉన్మాదీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్స్ క్లబ్బులో పార్టీలో మునిగితేలిన యువకులపై అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 49మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశీయ ఉగ్రవాదమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టెక్సాస్‌లోని అమారిలోలో కాల్పులు చోటుచేసుకోవడం అమెరికన్లు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. -
టెక్సాస్‌లో పత్రికా స్వేచ్చపై దాడి
-
యూఎస్‌లో దుండగుడి చెరలో బందీలు
-
యూఎస్‌లో దుండగుడి చెరలో బందీలు
హ్యూస్టన్: యూఎస్ టెక్సాస్‌లోని తంబాల్ ప్రాంతీయ వైద్య కేంద్ర ఆసుపత్రిలో దుండగుడు హల్చల్ చేశాడు. ఆసుపత్రిలోని ఇద్దరు వ్యక్తులను అతడు బందీలుగా చేసుకున్నాడు. ఆ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి... బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. అయితే దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నది లేనిది తెలియలేదని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిని పోలీసులు చుట్టిముట్టారు. అసుపత్రిలోకి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. పారిస్‌లో ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో అమెరికా భద్రత దళాలు అప్రమత్తమైయ్యాయి.