tezpur
-
Droupadi Murmu: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 ఎంకేఐ విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె శనివారం ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానికి స్థావరానికి చేరుకున్నారు. తొలుత అక్కడ ఆమె భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. తదనంతరం ఆమె యుద్ధ విమానంలో పర్యటించేందుకు యాంటీ గ్రావిటీ సూట్ ధరించి..సుఖోయ్ 30లో కొద్దిసేపు ప్రయాణించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. దీంతో ఈ సుఖోయ్‌లో పర్యటించిన భారత రెండోవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. కాగా 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ సుఖోయ్ 30 ఎంకేఐ అనేది రెండు సీట్లతో కూడిన ఫైటర్ జెట్. దీన్ని రష్యాకి చెందిన సుఖోయ్ సంస్థ అభివృద్ధి చేయగా..భారత ఏరోస్పేస్ దిగ్గజం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జెట్‌ని నిర్మించింది. #WATCH | President Droupadi Murmu lands at Tezpur Air Force Station, Assam after taking a sortie in the Sukhoi 30 MKI fighter aircraft pic.twitter.com/xRnjERbEnv — ANI (@ANI) April 8, 2023 (చదవండి: హనీ ట్రాప్‌లో అనుకోకుండా జరిగిన హత్య..ఐతే ఆ 'సారీ నోట్'..) -
ఘోర ప్రమాదం; తునాతునకలైన కారు
తేజ్ పూర్: అస్సాంలోని తేజ్‌పూర్ సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనిక అధికారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి కారు తునాతునకలైంది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కేంద్ర హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. అసోంలో బోడో తీవ్రవాదులు, ఆదివాసీలకు మధ్య జరుగుతున్న ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తిన ప్రాంతాల పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాప్టర్.. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అసోంలోని తేజ్‌పూర్ ప్రాంతంలో రాజ్‌నాథ్ బృందం ప్రయాణిస్తున్న చాపర్‌ను అత్యవసరంగా దించారు. చాపర్‌లో తలెత్తిన లోపాన్ని పైలట్ వెంటనే గుర్తించి దాన్ని దించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.