అభినయ ఫెస్ట్
నాటి రాజుల కాలం నుంచి నేటి అధునాతన తరం అధికార కాంక్షవల్ల జరిగిన అనర్థాలను కళ్ల వుుందు ఆవిష్కరించింది ‘చక్రరత్న’ నాటకం. రవీంద్రభారతిలో సోమవారం ప్రారంభమైన ‘అభినయు నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో ప్రదదర్శించిన ఈ కన్నడ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. బెంగళూరు ‘రూపాంతర’ ఆధ్వర్యంలో కేవై నారాయుణస్వామి రచించిన ఈ నాటకాన్ని అద్భుతమైన కాస్ట్యూమ్స్, హావభావాలతో జనరంజకంగా వులిచారు. కేఎస్డీఎల్ చంద్ర దర్శకత్వం వహించారు. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్, అధికార భాషా సంఘం మాజీ సభ్యులు టి.గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ నెల 14 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది.