thai massage
-
యునెస్కో గుర్తింపు పొందిన ఫేమస్ మసాజ్
బ్యాంకాక్ : ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గురువారం థాయ్ మాసజ్ను వారసత్వ జాబితాలో చేర్చినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి థాయ్ మసాజ్ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు తెలిసింది. 2500 ఏళ్ల క్రితమే ఈ విధానం థాయ్‌కు వచ్చిందని థాయ్ ప్రజలు అంటున్నారు. -
కుందేళ్లకు స్వీడిష్ మసాజ్
పరిపరి శోధన టాలీవుడ్ పుణ్యమా అని మనకు ఇక్కడ థాయ్ మసాజ్ ఫేమస్ అండ్ ఫెమీలియర్ గానీ, పడమటి దేశాల్లో స్వీడిష్ మసాజ్ బాగా పాపులర్. మసాజ్ మనుషులకేనా, కుందేళ్లకు చేస్తే ఎలా ఉంటుందని ఓహయో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలకు అమోఘమైన ఐడియా వచ్చింది. ఈ ఐడియాకు 3.87 లక్షల డాలర్ల సర్కారు సాయం కూడా తోడైంది. ఇంకేం..? రెండేళ్లకు పైగా సుదీర్ఘ పరిశోధన సాగించి, కుందేళ్లపై స్వీడిష్ మసాజ్ ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. ఈ మసాజ్ ఫలితంగా కుందేళ్ల కండరాలు చురుగ్గా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధన ఫలితం ఆధారంగా మనుషులకు మసాజ్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు తేవాలనే దానిపై మరింత అధ్యయనం చేయనున్నట్లు ప్రకటించారు. -
బంజారాహిల్స్‌లో థాయ్ మసాజ్.. 21 మంది అరెస్టు
వెస్ట్‌జోన్ పోలీసులు మరోసారి మసాజ్ సెంటర్ల మీద దాడులు చేశారు. నాలుగు మసాజ్ సెంటర్లపై దాడులు చేసి మొత్తం 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలు, నలుగురు పశ్చిమ బెంగాల్ యువతులు ఉన్నారు. మసాజ్ చేయించుకుంటున్న ఏడుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవీకే, సిటీ సెంటర్, అఫ్సినిటీ, పిస్తా స్పాలపై పోలీసులు ఇప్పటివరకు దాడులు చేశారు.