కుందేళ్లకు స్వీడిష్ మసాజ్ | Rabbits Swedish Massage | Sakshi
Sakshi News home page

కుందేళ్లకు స్వీడిష్ మసాజ్

Published Tue, Sep 22 2015 11:58 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కుందేళ్లకు స్వీడిష్ మసాజ్ - Sakshi

కుందేళ్లకు స్వీడిష్ మసాజ్

పరిపరి శోధన
టాలీవుడ్ పుణ్యమా అని మనకు ఇక్కడ థాయ్ మసాజ్ ఫేమస్ అండ్ ఫెమీలియర్ గానీ, పడమటి దేశాల్లో స్వీడిష్ మసాజ్ బాగా పాపులర్. మసాజ్ మనుషులకేనా, కుందేళ్లకు చేస్తే ఎలా ఉంటుందని ఓహయో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలకు అమోఘమైన ఐడియా వచ్చింది. ఈ ఐడియాకు 3.87 లక్షల డాలర్ల సర్కారు సాయం కూడా తోడైంది. ఇంకేం..? రెండేళ్లకు పైగా సుదీర్ఘ పరిశోధన సాగించి, కుందేళ్లపై స్వీడిష్ మసాజ్ ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. ఈ మసాజ్ ఫలితంగా కుందేళ్ల కండరాలు చురుగ్గా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధన ఫలితం ఆధారంగా మనుషులకు మసాజ్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు తేవాలనే దానిపై మరింత అధ్యయనం చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement