thammineni
-
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
-
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
వరంగల్ అర్బన్: మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మిర్చి రైతులతో మాట్లాడారు. మరో నాలుగు రోజుల్లోగా క్వింటాలుకు మద్దతు ధర రూ.13వేలుగా ప్రకటించకుంటే మార్కెట్లు ధ్వంసమవుతాయని హెచ్చరించారు. అవసరమైతే కోల్డ్ స్టోరేజీలను రైతులు ఆక్రమిస్తారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు వ్యాపారులు బుక్ చేసుకున్నారని, ఎవరు బుక్ చేశారో ఆన్ లైన్ లో పేర్లు సహా వివరాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.1లక్ష 49 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం రూ.250 కోట్ల రైతుల కోసం కేటాయించలేరా అని ప్రశ్నించారు. వేములవాడ, యాదాద్రి ఆలయాల అభివృద్ధి కోసం లక్షల కోట్లు వెచ్చించే సర్కారు రైతుల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు. జార్ఖండ్‌లో మిర్చి క్వింటాలుకు ధర రూ.14 వేల వరకు పలుకుతోందని చెప్పారు. -
తప్పుల తడకగా జిల్లాల నోటిఫికేషన్
జనగామకు అన్ని అర్హతలు ఉన్నాయి జిల్లాల విభజనను స్వాగతిస్తున్నాం జనగామ కోసం స్పష్టంగా లేఖ ఇచ్చిన ఏకైక పార్టీ మాదే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనగామ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న కొత్త జిల్లాలను ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుల తడక, అశాస్త్రీయంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జనగామ జిల్లా కోసం తలపెట్టిన దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లాల పునర్విభజను స్వాగతిస్తున్నామని, అయితే జిల్లాను విభజించే సమయంలో జనాభా, భౌగోళిక ప్రాధాన్యత, చరిత్ర, సాంస్కృతిక ఐక్యత వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కానీ ప్రభుత్వం చేసిన కసరత్తు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నారు. జిల్లాల విభజనలో వారసత్వ సంపద, సాంస్కృతిక ఐక్యత కనిపించడం లేదన్నారు. వరంగల్‌ను నాలుగు జిల్లాలుగా విభజించే క్రమంలో అభివృద్ధి చెందిన జనగామను ఆ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం సంకోచించడం భావ్యం కాదన్నారు. పోరాటాలకు వారసత్వంగా ఉన్న జనగామను ఈ విషయంలో విస్మరించడం సిగ్గుచేటన్నారు. జనగామ జిల్లా చేయాల్సిందేనని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా ప్రభుత్వాని లేఖ ఇచ్చిన ఏకైక పార్టీ తమదేనని స్పష్టం చేశారు. ‘జనగామ జిల్లా చేయాలని అనుకున్నా.. దాంట్లో ఎవరూ కలవడానికి ఒప్పుకోవడం లేదు’ అని సీఎం కేసీఆర్ తమతో చెప్పడం విస్మయానికి గురి చేసిందన్నారు. జనగామ జిల్లా చేసేంతవరకు ఉద్యమం ఆపేది లేదన్నారు. ఉద్యమకారుడి కాలాన్ని మరిచిన సీఎం సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలాన్ని మరచిపోయి.. దొరల కాలంలో ఉన్నట్లుగా భావిస్తున్నాడని తమ్మినేని మండిపడ్డారు. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. జనగామలో రెండు నెలలుగా 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజాభిప్రాయం చెప్పమంటే ఎలా అని ప్రశ్నించారు. ఆయన వెంట సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు రాళ్లబండి శశిధర్, ఉడుత రవి, బూడిద గోపి, మోకు కనకారెడ్డి, దస్తగిరి, బొట్ల శ్రీనివాస్, దాసరి కళావతి, ఇర్రి అహల్య, మిద్దెపాక సుధాకర్, మల్లయ్య, ప్రకాష్ ఉన్నారు. -
ఎవరీ నారాయణ? :తమ్మినేని
-
ఆవేశంతోనే తమ్మినేనిపై ఆరోపణలు
ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: నారాయణ వాటిని వెనక్కి తీసుకుంటున్నానంటూ రాఘవులుకు లేఖ సాక్షి, హైదరాబాద్: తనను ఓడించేందుకు డబ్బు తీసుకున్నారంటూ.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విచారం వ్యక్తం చేశారు. తాను ఆవేశంతో ఆ వ్యాఖ్యలు చేశానని, వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు నారాయణ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుకు సోమవారం లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘‘నా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ మీరు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి గారికి ఉత్తరం రాశారు. దాని ప్రతి నాకు పంపారు. అయితే సమస్యను కేంద్రానికి నివేదించినందున నేను సకాలంలో బదులివ్వలేదు. కేంద్ర పార్టీ ఆదేశం మేరకు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు వైఎస్సార్సీపీతో రాష్ట్రవ్యాప్తంగా లేదా తెలంగాణ ప్రాంతమంతా ఎన్నికల అవగాహన పెట్టుకుని ఉంటే మేం తప్పుబట్టే వాళ్లం కాదు. నేను పోటీ చేసిన ఖమ్మం లోక్‌సభ స్థానం వరకే మీరు వైఎస్సార్సీపీతో అవగాహన పెట్టుకున్నారు. దీంతో అపోహలు ఏర్పడ్డాయి. మీ పార్టీ ఎన్నికల ప్రచారం వరకు పరిమితం కాకుండా అంతకు మించి వ్యవహరించిందని భావించాం. కాబట్టి ఆవేశంతో వీరభద్రంపై అలాంటి వ్యాఖ్యలు (వైఎస్సార్సీపీ అభ్యర్థి పి.శ్రీనివాసరెడ్డి నుంచి 15 కోట్లు తీసుకున్నట్టుగా ప్రజలు చెప్పుకుంటున్నారని) చేశాను. అయితే ఇలాంటి ఆరోపణలకు, ప్రత్యారోపణలకు నిరూపణలు ఉండవు. బాధ్యత కలిగిన నేను అలా నిరూపించలేని అంశాలతో కామెంట్ చేసినందుకు విచారిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను. నా మూలంగా వామపక్ష ఐక్యతకు ఎలాంటి నష్టం జరగకూడదని అభిప్రాయపడుతున్నాను..’’ అని నారాయణ లేఖలో పేర్కొన్నాను.