Thangarasu Natarajan
-
ఇంతకూ ‘ఎవరీ నటరాజన్?’
ఒక పెద్దాయన చాలా హుందాగా అన్నాడు... ‘నాకు యార్కర్ అంటే తెలియకపోవడం ఏమిటయ్యా! వింత కాకపోతేనూ... యార్కర్ అంటే నువ్వు వేసే బంతులే కదా. అవును... వీటిని యార్కర్ అని ఎందుకు పిలుస్తారు? కాస్త చెబుతావా?’ అప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్ అమాయకంగా ఇలా బదులిచ్చాడు... ‘అమ్మతోడు సార్... నేను వేసే వాటిని యార్కర్ అంటారని మీరు చెప్పేవరకు నిజంగా నాకు తెలియదు’ వన్స్ అపాన్ ఏ టైమ్‌లోని ‘పంచ్’ మ్యాగజైన్లలో ఇలాంటి సరదా మాటలు బోలెడు దొరుకుతాయి. అయితే యార్కర్ అంటే సరదా కాదు. ప్రత్యర్థి కాళ్లకు బంధనాలు వేసి ఇరుకున పెట్టడం...జట్టు విజయానికి దారి పరచడం. ఆ విద్యలో తన టాలెంట్ చూపుతూ ‘కింగ్’ అనిపించుకుంటున్నాడు తంగరసు నటరాజన్. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా మరోసారి తన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. కడు పేదరికం నుంచి వచ్చిన నటరాజన్ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నాడు. సేలం జిల్లాలోని చిన్న ఊరు చిన్నప్పంపట్టి. చెన్నైకి 340 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఊరు వాడే తంగరసు నటరాజన్. తండ్రి దినసరి కూలి. తల్లి రోడ్డు పక్కన చికెన్ అమ్ముతుంది. ‘జీరో సౌకర్యాలు’ తప్ప ఆ ఊళ్లో చెప్పుకోదగ్గవి పెద్దగా ఏమీలేవు. అలాంటి ఊళ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు నటరాజన్. ‘ఆట కూడెడుతుందా? కూలీ పనిచెయ్...చికెన్ కొట్టు’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆర్డర్ వేయలేదు. కొడుకు ఆడుతుంటే మురిసిపోవడం తప్ప ఎప్పుడూ అడ్డుకున్నది లేదు. క్రికెట్ సీజన్ వస్తే నటరాజన్‌కు ఒకేసారి వందపండగలు వచ్చినట్లు. పొద్దుట ఎనిమిది గంటలకల్లా ఇంట్లో నుంచి బయటపడి ఊరూరు తిరుగుతూ ఆటలు ఆడేవాడు. ‘ఇంకేముంది వాళ్లే కచ్చితంగా గెలుస్తారు’ అంటూ డీలా పడిపోయి ప్రత్యర్థి జట్టుకు గెలుపు కిరీటం తొడగడానికి రెడీ అవుతున్న అనేకానేక సందర్భాలలో సొంత జట్టును గెలిపించాడు నటరాజన్. అయిదుగురు సంతానంలో పెద్దవాడు నటరాజన్. కుటుంబమంతా కలిసి ఒక చిన్నగదిలో నివసించేది. ‘తిండి, నీళ్లు, ఆరోగ్యం అన్నీ సమస్యలే. స్కూల్లో ఉచితంగా పెట్టే భోజనంతో కడుపు నింపుకునేవాడిని’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నటరాజన్. ‘మావాడు టైమ్‌పాస్ కోసం ఆడడం లేదు. వాడికంటూ ఒక టైమ్ వస్తుంది’ అని తల్లిదండ్రులు అనుకున్నారో లేదోగానీ....అతడికంటూ ఒక ‘టైమ్’ వచ్చింది! రంజీల్లో రాణించి, టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో తడాఖా చూపిన నటరాజన్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మూడు కోట్లకు ఎంపిక చేసుకుంది. ఆ డబ్బుతో తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించాడు. ఊళ్లో ‘క్రికెట్ అకాడమీ’ మొదలు పెట్టి యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. నటరాజన్‌తో కలిసి 2009 నుంచి క్రికెట్ ఆడిన జయప్రకాష్ ‘ఆరు బంతులకు ఆరు యార్కర్లు పడేవి’ అని గతాన్ని తలుచుకుంటు మురిసిపోతుంటాడు. ‘నీకు క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’ అని గట్టిగా చెప్పింది, ప్రోత్సహించిందే ఇతడే. వీరి అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాష్‌ను మార్గ నిర్దేశకుడిగా చూస్తాడు నటరాజన్. లోకల్ విలేజ్ టోర్నమెంట్స్‌లో నటరాజన్ గెలుచుకున్న 150కి పైగా ట్రోఫీలలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆట మైకంలో అర్ధాకలితో గడిపిన రోజల నుంచి మొదలు ఓటమిని పసిగట్టి గెలుపు వ్యూహం రచించడం వరకు ఎన్నెన్నో వాటిలో ఉన్నాయి. ‘ఈ కుర్రాడికి ఎప్పుడు చూసిన ఆటలే’ అని విసుక్కున్న వారు కూడా ఇప్పుడు... ‘మన ఊరు అబ్బాయి ఎంత ఎదిగిపోయాడో చూశావా. అలా ఉండాలి పట్టుదల అంటే’ అంటుంటారు. అయితే నటరాజన్ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనంతగా ఏమీ దూసుకుపోలేదు. మొదట్లో ‘ఇంప్రాపర్ బౌలింగ్ యాక్షన్’ అని వెనక్కి పిలిచినప్పుడు ‘ఇక నా పని అయిపోయినట్లే’ అనుకున్నాడు. అంతమాత్రానా ఆటకు టాటా చెప్పలేదు. తనను తాను మరింత పదును పెట్టుకున్నాడు. ఆ తరువాత ‘బౌలింగ్ యాక్షన్’కు క్లీన్‌చీట్ వచ్చింది. ప్రయాణం మొదలైంది. మధ్యలో కాస్త తడబడ్డాడు. మరో ఛాన్స్ కోసం ఎక్కువ సమయమే వేచి చూడాల్సి వచ్చింది. ఎక్కడ నిరాశ పడలేదు. మళ్లీ లేచాడు. ముత్తయ్య మురళీధరన్లాంటి దిగ్గజాల దృష్టిలో పడ్డాడు. తన యార్కర్కతో మెరుపులు మెరిపించినప్పుడల్లా ‘ఎవరీ నటరాజన్?’ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. జవాబులో ఎంత స్ఫూర్తి ఉంటుందో కదా! అది మాత్రమే చాలదు తమిళనాడు గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ చూడడం, ఆడడం గొప్ప విషయమేగానీ దాన్ని కెరీర్ ఆప్షన్‌గా మలుచుకోవాలనే ఆలోచన తక్కువ. దీన్ని టైమ్‌పాస్ ఆటగానే చూస్తున్నారు. ప్రతిభ ఉండాలేగానీ మన కుటుంబ ఆర్థికనేపథ్యం అనేది ముఖ్యం కాదు. ఆటతీరు మాత్రమే ముఖ్యమవుతుంది. – తంగరసు నటరాజన్, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ -
యార్కర్ కింగ్..

కూలీ కొడుకు కోటీశ్వరుడయ్యాడు..
బెంగళూరు: ఈసారి ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ఎంత ధర పలికింది. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఎందుకు ఆసక్తి కనబరచలేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ తైమాన్ మిల్స్ కు అంత ధర పలకడమేమిటి అనే దానిపైనే ప్రధానంగా చర్చసాగింది. దాంతో పాటు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ప్రజ్ఞాన్ ఓజాలు కూడా ఆ తరువాత వార్తల్లో నిలిచారు. కానీ.. ఐపీఎల్ వేలం ద్వారా రాత్రికి రాత్రి కొంతమంది అనామక క్రికెటర్లు సైతం కోటీశ్వరలయ్యారు. అందులో తంగరాసు నటరాజన్ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ పేసర్ ను కింగ్స్ పంజాబ్ అత్యధిక మొత్తం పెట్టి దక్కించుకుంది. నటరాజన్ కనీస ధర రూ.10 లక్షలు ఉంటే అతన్ని రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కింగ్స్ పంజాబ్. తమిళనాడు జట్టులో నిలకడకు మారుపేరైన నటరాజన్ పై కింగ్స్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ విపరీతమైన ఆసక్తి కనబరిచడమే ఆ యువ బౌలర్ కు 30 రెట్లు అధిక ధర చెల్లించడానికి కారణమైంది. ఈ 25 ఏళ్ల యువ క్రికెటర్ ను దక్కించుకోవడానిక పలు ఫ్రాంచైజీలు పోటీ పడినప్పటికీ చివరకు అతన్ని కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. తమిళనాడుకు చెందిన నటరాజన్ ఓ రైల్వే కూలీ కొడుకు . నటరాజన్ వయసు 20 ఏళ్లప్పుడు అతని తల్లి ఓ స్టాల్ ను నిర్వహించగా, తండ్రి మాత్రం రోజు వారీ రైల్వే కూలీగా పని చేసేవాడు. అతని స్వస్థలం సాలెంలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ను ఎక్కువగా ఆడేవాడు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీ చెన్పైకు షిష్ట్ కావాల్సి వచ్చింది. చెన్నైలోని జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్న నటరాజన్ కు అక్కడే భారత ప్రధాన క్రికెటర్లు అశ్విన్, మురళీ విజయ్‌లతో పరిచయమైంది. ఇక్కడ నటరాజన్ ప్రతిభను అశ్విన్, మురళీ విజయ్‌లు గుర్తించారు. అతనికి తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) తరుపున ఆడే అవకాశం కూడా అశ్విన్, మురళీ ద్వారానే దక్కింది. ఇక్కడ నిలకడైన ప్రదర్శన చేసిన నటరాజన్ తమిళనాడు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. దాంతో అతనికి 2015-16ల్లో రాష్ట్ర రంజీ జట్టు తరపున ఆడేందుకు పిలుపు వచ్చింది. ఇక అక్కడ నుంచి తన శ్రమనే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగాడు నటరాజన్. ఇప్పుడు ఐపీఎల్ -10సీజన్ ల్లో బరిలోకి దిగుతుండటంతో నటరాజన్ పై అందరి దృష్టి ఉంది. ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ క్రికెటర్ ఎలా రాణిస్తాడో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రధానంగా కింగ్స్ పంజాబ్ నటరాజన్ పై భారీ ఆశల్నేపెట్టుకుంది. మరి ఆ ఆశల్ని నటరాజన్ నిజం చేస్తాడో లేదో చూడాలి. మిచెల్ జాన్సన్ ఆదర్శం ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సనే తనకు ఆదర్శం అంటున్నాడు నటరాజన్. అతని బౌలింగ్ అంటే తనకు విపరీతమైన ఇష్టమని పేర్కొన్నాడు. అతని బౌలింగ్ వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటానన్నాడు. తాను కూడా ఎడమ చేతి బౌలింగ్ వాటం కావడం అతనిపై మక్కువ పెరగడానికి కారణంగా నటరాజన్ చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్ ద్వారా అతన్ని కలిసే అవకాశం దక్కుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.దాంతో పాటు తన ఉన్నతికి కారణమైన అశ్విన్, విజయ్ లతో పాటు, తమిళనాడు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలకు ధన్యవాదాలు తెలియజేశాడు. తాను అసలు టీఎన్‌పీఎల్‌లో ఆడతానని అనుకోలేదని, అయితే ప్రస్తుతం ఇక్కడ వరకూ రావడం తనకు సరికొత్త అనుభూతిగా ఉందని నటరాజన్ పేర్కొన్నాడు.