Theatre Owners Association
-
సీల్ చేసిన థియేటర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి
-
జేసీలే థియేటర్లకు అనుమతులు ఇస్తారు
సాక్షి, అమరావతి/ చిలకలపూడి (మచిలీపట్నం): నిబంధనలు పాటించని సినిమా థియేటర్ల యజమానులు వారి తప్పు తెలుసుకుని లైసెన్స్ రెన్యువల్, ఇతర అనుమతుల కోసం జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమాలు చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు వచ్చే థియేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షగట్టి థియేటర్లు మూసేయిస్తోందని విమర్శిస్తున్న వారు ఏదైనా ప్రమాదం జరిగితే మళ్లీ ప్రభుత్వం పైనే బురద జల్లుతారని అన్నారు. అనుమతుల్లేకుండా థియేటర్లు నడపడం ధర్మమని వారు ఎలా చెబుతారని నిలదీశారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో కలసి కృష్ణా జిల్లాకు చెందిన థియేటర్ల యజమానులు పలువురు మంత్రి పేర్ని నానితో మచిలీపట్నంలో గురువారం సమావేశమయ్యారు. అనంతరం మంత్రి పేర్ని నాని, నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం థియేటర్లపై చర్యలు తీసుకునే అధికారం, సీజ్ చేసిన థియేటర్లకు మళ్లీ షరతులతో అనుమతులు ఇచ్చే అధికారం జాయింట్ కలెక్టర్లకే ఉందని మంత్రి స్పష్టంచేశారు. బీ ఫారం లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అగ్నిమాపక శాఖ నిర్దేశిత ప్రమాణాలు పాటించి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసీలు), ఇతరత్రా అనుమతులు తీసుకోవాలని థియేటర్ల యజమానులకు సెప్టెంబరులోనే చెప్పామన్నారు. డిసెంబర్ ముగుస్తున్నప్పటికీ కొన్ని థియేటర్లు ఆ అనుమతులు పొందేలేదన్నారు. ప్రభుత్వం సానుభూతితో, సానుకూల ధోరణితో వ్యవహరించినప్పటికీ నిబంధనలను పాటించకపోవడం సరికాదని చెప్పారు. అనుమతులు పొందని థియేటర్లలో జాయింట్ కలెక్టర్లు తనిఖీలు చేయకుండా ఎలా ఉంటారని మంత్రి ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి వ్యతిరేకం: ఆర్. నారాయణమూర్తి సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి తాను వ్యతిరేకమని ఆర్. నారాయణమూర్తి స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు పెంచుకోవడం అధికారిక బ్లాక్ మార్కెట్ వంటిదేనన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలు, సగటు మనుషులను దృష్టిలో పెట్టుకుని టికెట్ల రేట్లు నిర్ణయించాలని చెప్పారు. సినీ పెద్దలు వ్యక్తిగత అభిప్రాయాలకు పోకుండా పరిశ్రమ మనుగడ కోసం ఆలోచించి ప్రేక్షకులను ఆనందపరచాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా తీసేవారు, చూపేవారు, చూసే వారు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అన్నారు. సినీ పెద్దలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి తాను మంత్రిని కలిసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు సమన్వయంతో ముందుకు వెళతారని ఆశిస్తున్నానన్నారు. చదవండి: (ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు) -
తెరుచుకోనున్న థియేటర్లు.. టికెట్ ధరలపై నిర్ణయం?
సాక్షి, అమరావతి : కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. ఫస్ట్‌వేవ్ నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడటంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో థియేటర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈనెల 31 నుంచి థియేటర్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు, లైసెన్సింగ్ విధానం, థియేటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యల పరిష్కారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలించాంబర్ మాజీ అధ్యక్షుడు ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చాలా మంది థియేటర్లలో సినిమాలు ప్రదర్శించలేని పరిస్థితి ఉంది. సినీ రాజధాని విజయవాడకు పూర్వ వైభవం తీసుకురావాలి. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిగణలోకి తీసుకొని స్పందిస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. ఈ సమావేశంలో 13 జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. -
'మూడు నెలల వరకు సినిమాలను ఓటీటీలో విడుదల చెయ్యొద్దు'
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని థియేటర్ల ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే మూడు నెలల వరకైనా సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దు. ఇప్పటికే మా ఒంటి నిండా బాణాలు గుచ్చుకున్నాయి. దయచేసి కత్తితో పొడిచి చంపకండి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా అక్టోబర్ తరువాతే ఓటీటీకి ఇవ్వండి అంటూ నిర్మాతలను కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర రెడ్డి, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా సహా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... "మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి’అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. "ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందుకు అందరికీ థ్యాంక్స్. ఈ విషయం అందరికీ తెలియాలి. మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతోన్నామనేది అందరికీ తెలియాలి. మీ రిక్వెస్ట్ ఏంటి? అని చాలా మంది నిర్మాతలు ఫోన్ చేసి అడుగుతున్నారు. అందరికీ తెలియాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఆగస్ట్ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా?. కనీసం అక్టోబర్ 30 వరకైనా ఆపుకోండి. సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్ ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను.. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి’ అని అన్నారు. తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు. సినిమాలను ఎవ్వరికైనా అమ్ముకోడం నిర్మాత హక్కు. సినిమాలు రిలీజైన పది వారాలకో ఎప్పుడో ఓటీటీకి అమ్ముకోవాలనే కండీషన్ తో పది కోట్లకో ఇరవై కోట్లకో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న రోజునే అగ్రిమెంట్లో ఎంటర్ చేస్తే.. మా ఛాంబర్ చర్య తీసుకుంటుంది. నిర్మాతలం మాకు హక్కు ఉంటుందని కాకుండా.. అక్టోబర్ వరకు ఎదురు చూడండి. అక్టోబర్ వరకు పరిస్థితు సద్దుమణకపోతే, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే, కరోనా తగ్గకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్లండి. నిర్మాతలందరికీ ఇది మా రిక్వెస్ట్. అందరూ ఓపికతో ఉండండి. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయి. ఈ రోజు మమ్మల్ని కిల్ చేస్తే రేపు నిర్మాతలను కిల్ చేస్తాయి. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది మేమే. పీవీఆర్, ఐనాక్స్ వంటి కంపెనీలు ఎప్పుడు ఇస్తాయో తెలిసిందే. అలాగే, ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ చేస్తాయి’ అని అన్నారు. చైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘ఈ పాండమిక్ వల్ల అందరూ ఎంత బాధ పడ్డారో అందరం చూశాం. అందరి కంటే ఎక్కువగా కష్టాలు పడింది సినిమా పరిశమ్రకు చెందిన వాళే. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కోలుకుంటున్నాయి. కానీ ఒక్క సినీ ఇండస్ట్రీ మాత్రం ఇంకా అలానే ఉంది. ప్రతీ శుక్రవారం రాగానే థియేటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఓటీటీ వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షోను తీసేసింది. నిర్మాతలకు మంచి అమౌంట్ ఇచ్చి సినిమాలను తీసేసుకుంటున్నారు. అయితే థియేటర్లో సినిమా రిలీజ్ చేసిన ఆ తరువాత ఓ 20 రోజులకు ఓటీటీకి ఇస్తే అందరూ బాగుంటారు. థియేటర్లో టిక్కెట్ ఇచ్చే వ్యక్తి నుంచి ఎంతో మంది ఆధారపడి ఉన్నారు.. మీడియా కూడా ఆధారపడి ఉంది.. మీ సహకారం కూడా కావాలి.. అందరి సపోర్ట్ లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లలేమ’ని అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా.. వాళ్లు తమ ఇష్టం మేరకు వెళ్తే.. మేం ఏం చేయాలో అది చేస్తాం.. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టాం.. అది వారికి తెలియడం లేదు.. ఇప్పుడైతే మేం రిక్వెస్ట్ చేస్తున్నాం.. నిన్న కూడా రిక్వెస్ట్ చేసినం.. భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఫ్యామిలీలు అంతా కూడా సినిమాకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ ప్లానింగ్ చేసుకుంటున్నాయ్. ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్లకి సినిమా ఏం అర్థమవుతుంది. ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుంది.. ఇది నా అభిప్రాయం’ అని అన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ ఓనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం లాక్డౌన్ కూడా ఎత్తివేసిన క్రమంలో అక్టోబర్ వరకు తెలుగు నిర్మాతలెవరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాల్ని విడుదల చేయడం అక్టోబరు వరకు ఆపాలని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ సూచించిన సంగతి తెలిసిందే. -
సమస్యలను పరిష్కరిస్తేనే థియేటర్లను తెరుస్తామంటున్న యజమానులు
-
థియేటర్లు అప్పుడే తెరవలేం!
సాక్షి, విజయవాడ: గత ఏడు నెలలుగా సినిమా రిలీజ్లు లేక నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కోవిడ్ నియంత్రణ చర్యలకు లోబడి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఫిలిం చాంబర్స్‌లో బుధవారం ఉదయం ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అధ్యక్షుడు కే.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బకాయిలు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా రద్దు కాలేదు. అనేక సమస్యల కారణంగా ఈ నెల 15 న నుంచి థియేటర్లు చేయటం లేదు. మంత్రి పేర్ని నాని గారి తో చర్చలు జరుగుతున్నాయి. మా సమస్యలు పరిష్కరించనంత వరకు సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేదు. రేపటి నుంచి సినిమా హాళ్లు తెరవకూడదని నిర్ణయించాము’అని కేఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ‘లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలి. మా సమస్యలను చిరంజీవి నాగార్జున గారి సహకారంతో ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాం’ అని ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సెక్రటరీ గోరంట్ల బాబు అన్నారు. (చదవండి: చిగురుటాకులా వణికిన తీరం ) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ఆఫ్ కామర్స్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సమయంలో థియేటర్లకి కరెంట్ మినిమమ్ చార్జీలు వేశారు. ఒక్కో థియేటర్‌కు ఈ 7 నెలల కాలం లో 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇపుడు ఉన్న పరిస్థితిలో ఒక్కో థియేటర్ ఓపెన్ చేయటానికి 10 లక్షల ఖర్చవుతుంది. కరోనా కారణంగా 500 థియేటర్లు కరెంట్ బకాయిలు కట్టలేదు. నిర్వహణ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం. కరెంట్ ఫీజులు రద్దు చేయండి. డబ్బున్న వాళ్లు కోవిడ్ సమయంలో కరెంట్ చార్జీలు కట్టారు. కట్టలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆక్యుపెన్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మా సమస్య పరిష్కస్తుందని ఆశిస్తున్నా’అని అన్నారు. (చదవండి: ‘800’ చిత్రంపై నెటిజనుల ఆగ్రహం) -
సినిమా థియేటర్లను ఆదుకోవాలి
‘‘కోవిడ్ కారణంగా ఆర్నెళ్లుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ నెల 15 నుంచి 50 శాతం సీట్లు నిండేలా థియేటర్లు ప్రారంభించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా థియేటర్లు తెరుచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పెద్ద మనసుతో అనుమతించాలి’’ అని ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం పలువురు థియేటర్ యజమానులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘థియేటర్లు మూత పడటంతో తీవ్రంగా నష్టపోయాం. ఎన్నో వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపరు. కనీసం సగం సీట్లు నిండినా మాకు సంతోషమే. ప్రేక్షకులకు కోవిడ్ సోకకుండా శానిటైజర్లతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. టికెట్లు చేతితో తాకకుండా చూసుకుంటాం. విశ్రాంతి సమయంలో ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు చేపడతాం. థియేటర్లకు ఎక్కువ కరెంటు బిల్లులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఆదుకుంటేనే సినిమా థియేటర్ల పరిశ్రమ పూర్వవైభవం తెచ్చుకుంటుంది’’ అన్నారు. -
15 నుంచి థియేటర్లను ప్రారంభిస్తాం
చిక్కడపల్లి (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా మని తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి అనుమతులు లభించాల్సి ఉందని, ఇదే అంశంపై సోమవారం ఎఫ్డీసీ చైర్మన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎం కేసీఆర్‌లను కలసి వినతిపత్రాలను అందజేయనున్నట్లు తెలిపింది. ఆర్టీసీక్రాస్‌రోడ్డు లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజ్‌గోపాల్ తాండ్ల మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్లు మూసివేసి ఉన్న నెలలకు ఫిక్స్ కరెంట్ ఛార్జీలను, ప్రాపర్టీ ట్యాక్స్‌లను తొలగించాలని కోరారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా థియేటర్లలో ఆల్టర్నేట్ సీట్లను ఏర్పాటు చేశామన్నారు. టికెట్ కౌంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నామని, పాత టికెట్ ధరలనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్కింగ్ చార్జీలను మళ్లీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు కె.సురేశ్, బాదం వెంకటకృష్ణ, గోపాల్‌రెడ్డి, సంధ్యా థియేటర్ మేనేజర్ మధుసూదన్, సుదర్శన్ థియేటర్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, దేవి థియేటర్ మేనేజర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దసరాలోపు థియేటర్లు రీఓపెన్ చేసుకుంటాం!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో వ్యాపారం లేక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న థియేటర్ యజమానులు థియేటర్ల పునఃప్రారంభానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం అక్టోబర్‌లో దసరానాటికైనా తమ వ్యాపారంసాగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశంలోని థియేటర్ యజమానులు దసరాకి ముందు థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు ప్రాంతాల్లోని ఫిల్మ్ ట్రేడ్ సభ్యులు, సినిమా, మల్టీప్లెక్స్ యజమానులు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను కలిసారు. వారిచ్చిన హామీ మేరకు రానున్న రెండు రోజుల్లో మంచి వార్త తమ చెవిన పడుతుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది అనేక లాభదాయకమైన సెలవు వారాంతాలను కోల్పోయిన చిత్ర పరిశ్రమ రానున్న పండుగ సీజన్ ముఖ్యంగా దసరా, దీపావళి రాబడిపై ఆశలు పెట్టుకుంది. ఇన్నాళ్లుగా కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర నష్టాల్లో ఉన్న వినోదరంగాన్ని కొంత గాడిలోకి తీసుకురావాలంటే దసరా, దీపావళి సీజన్ లో థియేటర్లు ఓపెన్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు యాజమానులు. 50 శాతం కెపాసిటీతో థియేటర్లు రీఓపెన్ చేసుకునే అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మూసి ఉండే ఆడిటోరియంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు అభ్యర్థించినట్టు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ ఎన్ నారంగ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారని, థియేటర్ మూత వల్ల తమకు ఎదురయ్యే భారీ నష్టాల గురించి చర్చించామని సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు. అక్టోబర్ ఒకటవ తేదీనాటికి తిరిగి తెరవడానికి అనుమతిని కోరినట్టు తెలిపారు. సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించే అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నామని ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే గత వారం గ్లోబల్ ఏవీజీసీ సమ్మిట్ ఫర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో థియేటర్ యజమానులు ముందుకు కదిలారు. దీంతో దసరా నాటికి థియేటర్లు తెరుచు కుంటాయనే ఆనందం అభిమానుల్లో నెలకొంది. కరోనామహమ్మారి కారణంగా దాదాపు గత ఆరు నెలలుగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ థియేటర్ వ్యాపారం 3,000 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్టు అంచనా. అయితే, థియేటర్లు తిరిగి తెరిచినా, ఆడటానికి కంటెంట్ లేదని ఫిల్మ్ ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ నిపుణుడు గిరీష్ జోహార్ వ్యాఖ్యానించారు. -
బతుకు 'చిత్రం' సాగేదెట్లా ?
సాక్షి, మంచిర్యాల : మూడు ఫైట్లు, ఆరు పాటలతో కళకళలాడాల్సిన సినిమా థియేటర్లు కరోనా దెబ్బకు మూన్నెళ్లుగా తెరుచుకోవటం లేదు. ప్రతిరోజు ప్రేక్షకుల సందడితో కన్పించే సినిమా థియేటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కొత్త సినిమా వచ్చిదంటే ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసిపోయే సినిమా హాళ్లు కళావిహీనంగా మారుతున్నాయి. పిల్లలు, పెద్దలకు వినోదం అందించే చోట పనిచేసే సినీకార్మికుల కష్టాలు అంతాఇంత కాదు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. థియేటర్ల మూసివేతతో కుటుంబ పోషణ గగనమైంది. సినిమా తెరపై బొమ్మ పడేదెప్పుడో.. తమ బతుకులకు భరోసా కలిగేదెప్పుడో..అని ఎదరుచూస్తున్న సినీ కార్మికుల దయనీయమైన జీవనంపై ప్రత్యేక కథనం.. తప్పుకుంటున్న యాజమాన్యాలు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొదలైన లాక్డౌన్ సినిమా థియేటర్లపై కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతో కొన్నింటికి ఆంక్షలు సడలించినా ధియేటర్లకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. సాధారణంగా ఓ మంచిసినిమా ఆడితే థియేటర్లకు ఒక రోజుకు వచ్చే ఆదాయం కనీసం రూ.50 వేల పైనే ఉంటుంది. కానీ మూసివేత కారణంగా మూడునెలల కాలంలో ఒక్కో థియేటర్ సుమారు లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోయింది. ఈనేపథ్యంలో థియేటర్ల యాజమాన్యం సినీకార్మికులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. మరికొన్ని యాజమాన్యాలు అయితే విధుల నుంచే తొలగించడంతో ఎన్నో ఏళ్లు సినిమా టాకీస్లనే నమ్ముకుని జీవనం సాగించిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ఒకవైపు వయస్సు పైబడి పోవడం.. కరోనా సమయంలో ఎక్కడా పనిదొరక్క పోవడంతో అనేక ఇబ్బందులతో కుటుంబ జీవనాన్ని నెట్టుకువస్తున్నారు. (గ్రేటర్లో కరోనా.. హైరానా) సిబ్బందికి ఇదే జీవనాధారం జిల్లాలో తొమ్మిది వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఒక్కో టాకీస్‌లో 20 మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. థియేటర్లో ఆపరేటర్, బుకింగ్ కౌంటర్లో ఉద్యోగులు, గేటు కీపర్లు, రివైండర్, స్వీపర్లు, స్కావెంజర్, వాచ్మెన్లు, మేనేజర్లతో పాటు సైకిల్‌స్టాండ్, క్యాంటీన్లో తినుబండరాలు అమ్మేవారు కనీసం నలుగురు ఉంటారు. వీరి సంఖ్య దాదాపుగా 200కు మించి ఉంటుందని తెలుస్తోంది. ఒక్కొక్కరి విధుల నిర్వహణను బట్టి రూ.9వేల నుంచి రూ.14వేల వరకు వేతనాలు చెల్లిస్తుంటారు. వీరిలో ఏళ్ల తరబడి థియేటర్లను నమ్ముకుని పనిచేసే వారు సగానికి పైగా¯నే ఉన్నారు. ప్రస్తుత కరోనా ప్రభావంతో «థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకోవడంతో వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒకటి రెండు థియేటర్ల యాజమానులు 50శాతం వేతనం ఇస్తున్నా మిగిలిన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొంత మంది కార్మికులు ఇతర మార్గాలను వెతుక్కోని పనిలో నిమగ్నమయ్యారు. ఇది తప్ప వేరే ఏపనీ తెలియని వారు రేపోమాపో బొమ్మపడక పోదా.. అనే గంపెడు ఆశతో వేతనం లేకపోయినా థియేటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాతల సహకారంతో కొందరు.. అప్పులు చేసుకుంటూ మరికొందరు బతుకును సాగిస్తున్నారు. థియేటర్లు తెరిచే వరకు ప్రభుత్వం ఆదుకోవాలని సినీ కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ఏళ్ల తరబడిగా సినిమా థియేటర్లనే నమ్ముకుని జీవిస్తున్న కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి. వేరే పనికి వెళ్దామంటే దొరకని పరిస్థితి. నెలల తరబడి నడవకపోవటంతో యాజమాన్యానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, షాపింగ్ మాల్స్‌కు ఇచ్చిన మాదిరిగానే సినిమా థియేటర్లకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వాలి. కరోనా నిబంధనల మేరకు థియేటర్లు నడిపిస్తే , కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – పోల్సాని సత్యనారాయణ,సినీ కార్మిక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
థియేటర్లు మూసేస్తాం; చిత్రసీమకు షాక్
సాక్షి, చెన్నై: తమిళ చిత్రసీమకు రాష్ట్ర థియేటర్ల యాజమానుల సంఘం షాక్ ఇచ్చింది. తమను నష్టాల్లోకి నెడుతున్న సమస్యలను పరిష్కరించకుంటే ధియేటర్లు మూసివేస్తామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ వినోదపన్ను 8 శాతం వెంటనే రద్దు చేయాలని, పెద్ద చిత్రాల ద్వారా నష్టపోతే ఆ చిత్ర నటీనటులే భరించాలని డిమాండ్ చేసింది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను 100 రోజులకు ముందు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయకూడదని సూచించింది. తమ డిమాండ్లు అంగీకరించపోతే మార్చి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూసివేస్తామని ప్రకటించింది. థియేటర్ల యాజమానుల సంఘం డిమాండ్లపై తమిళ చిత్రసీమ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ఇటీవల కాలంలో భారీ చిత్రాలు ఎక్కువగా పరాజయం పాలవడంతో థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికి ఊరట కల్పించేందుకు బడా నిర్మాతలు ముందుకు రావడం లేదు. లాభాలు వచ్చినప్పుడు తమకు వాటా ఇవ్వడం లేదు కాబట్టి నష్టాల్లో వస్తే తామెందుకు ఎదురు డబ్బులు ఇవ్వాలని నిర్మాతలు వాదిస్తున్నారు. మరోవైపు సినిమా విడుదలయి వంద రోజులు కూడా కాకుండానే అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి డిజిటల్ ఫ్లామ్‌పామ్‌లలో ప్రసారం చేసేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తిగా చూపించడం లేదు. ఈ నేపథ్యంలో తమిళ థియేటర్ల యాజమానుల సంఘం తాజా డిమాండ్లు చేసింది. -
సినిమా టికెట్ వార్
టికెట్ల రేట్ల పెంపు విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయి. ధరలు పెంచే ముందు తమను సంప్రదించడంగానీ, అనుమతిగానీ తీసుకోలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. నగరంలో ఇప్పటివరకూ 79 థియేటర్లు టికెట్ల ధరలు పెంచినట్లు మా దృష్టికి వచ్చింది.– మంత్రి తలసాని కోర్టు ఉత్తర్వుల మేరకు ధరలు పెంచాం. గురువారం ఉదయం నుంచి పలు థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.25 నుంచి రూ.50 వరకు పెంపు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. పెంచిన టికెట్ల ధరలు ఏపీలోనూ వర్తింపజేస్తాం. అయితే ఈ పెంపు 2 వారాలు మాత్రమే. – నిర్మాతల మండలి వేసవిలో పిల్లాపాపలతో సినిమాలకు వెళదామనుకుంటే.. ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ.70 పెంచడం సరికాదు. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నాం.. ఇపుడు టికెట్ల ధరలు కూడా పెంచితే సినిమాకు వెళ్లే పరిస్థితే ఉండదు. – సామాన్యుడి గగ్గోలు సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరల పెంపు థియేటర్ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య ‘టికెట్ వార్’కు తెరతీసింది. ప్రభుత్వం అనుమతితోనే టికెట్ల ధరలు పెంచామని థియేటర్ యాజమాన్యాలు చెబుతుంటే.. తమనెవరూ సంప్రదించలేదని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని స్పష్టం చేశారు. యాజమాన్యాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ధరలు పెంచాయన్నారు. థియేటర్ యాజమాన్యాలపై కోర్టుకెళ్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పడంతో ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాల మధ్య వివాదం తీవ్రతరం కానుంది. అన్ని అనుమతులు ఉన్నాయి కోర్టు ఉత్తర్వుల మేరకు ధరలు పెంచామని థియేటర్లు, మల్టీపెక్స్‌ల నిర్వాహకులు బుధవారం సాయంత్రం ప్రకటించారు. గురువారం ఉదయం నుండి పలు థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.25 నుండి 50 రూపాయల వరకు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సింగిల్ థియేటర్ యజమానులు మూడ్రోజుల క్రితమే పెంచిన ధరలను గురువారం నుండి అమలు చేస్తామని ప్రకటించగా, మల్టీపెక్స్‌ల నిర్వాహకులు మాత్రం ఆన్లైన్ టికెట్ల ధరలను బుధవారం సాయంత్రం వరకు ఆయా వెబ్సైట్లలో అందుబాటులో ఉంచలేదు. చివరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రతి టికెట్‌పై రూ.50 పెంచుతూ టికెట్లను ఆన్లైన్లో విక్రయించారు. అయితే కోర్టు ఉత్తర్వులపై సవాల్ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టకపోవటంతో పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. తాము కోర్టును ఆశ్రయించే టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి తీసుకున్నామని నిర్మాతల మండలి ప్రతినిధి దిల్ రాజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పెంచిన టికెట్ల ధరలు ఏపీలోనూ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. అందుకే తాము సింగిల్ థియేటర్లలో టికెట్ ధర రూ.80 నుంచి 110, మల్లీప్లెక్స్‌లో రూ.130 నుంచి 200 వరకు పెంచామని యజమానులంటున్నారు. ఈ పెంపు 2వారాలు మాత్రమేనన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలోని ఓ సింగిల్ థియేటర్లో సినిమా చూడాలంటే రూ.30 కనీస టికెట్ ధరగా ఉండగా.. సెకండ్ క్లాస్‌లో రూ.60 ఉన్న ధరను రూ.80, బాల్కనీ అయితే రూ.100 నుండి 125కి పెంచేశారు. అదే మల్టీపెక్స్ విషయానికి వస్తే ఖైరతాబాద్‌లోని ఐమాక్స్‌లో స్మాల్ స్క్రీన్ టికెట్ ధర రూ.138 నుండి రూ.200, బిగ్‌స్క్రీన్ అయితే రూ.250 నుండి రూ.300లకు పెంచి విక్రయించారు. సీఎస్, అధికారులతో మంత్రి సమీక్ష టికెట్ల పెంపు వ్యవహారంపై తమ దృష్టికి రాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారమే వెల్లడించారు. కాగా, టికెట్ల పెంపు అంశం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశం కావడంతోబుధవారం మంత్రి ఈ వివాదంపై సమీక్ష నిర్వహించారు. సీఎస్, అధికారులతో కలిసి ఈ విషయంపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల రేట్లు పెంపు విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయని అన్నారు. ధరలు పెంచేముందు తమను సంప్రదించడంగానీ, అనుమతిగానీ తీసుకోలేదని అసలు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మంత్రి స్పష్టంచేశారు. నగరంలో ఇప్పటివరకూ 79 థియేటర్లు టికెట్ల ధరలు పెంచినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తలసాని వెల్లడించారు. ప్రజలపై భారం పడేలా టికెట్ల ధరలు పెంచడం సరికాదన్నారు. ఇందుకు తామెలాంటి అనుమతి ఇవ్వలేదని పునరుద్ఘాటించారు. సామాన్యుడికి కూడా వినోదం కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో తాము హోంశాఖ, న్యాయశాఖలతోనూ సంప్రదింపులు జరిపామన్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే తాము కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. సామాన్యుల గగ్గోలు టికెట్ల ధరల పెంపు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. వేసవి సెలవులు కాబట్టి, పిల్లాపాపలతో సినిమాలకు వెళ్లి సరదాగా గడుపుతామని అనుకుంటే.. ఒక్కో టికెట్‌పై ఏకంగా 70 రూపాయలు పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నాం.. ఇపుడు టికెట్ల ధరలు కూడా పెంచితే.. సినిమాకు వెళ్లే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. ఇపుడున్న ధరలతో నలుగురు సభ్యులున్న కుటుంబం మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళితే.. టికెట్లకు రూ.800పోగా, ఇంటర్వెల్లో తినుబండారాలకు రూ.300 నుంచి రూ.400 వరకు వాచిపోవడం ఖాయం. మొత్తంగా ఈ ఖర్చు రూ.1200 వరకు చేరుతోంది. -
పద్మావత్ ప్రదర్శించి తీరుతాం
సాక్షి, భోపాల్ : వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావత్‌ను విడుదల చేసి తీరుతామని మధ్యప్రదేశ్‌లో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పద్మావత్ సినిమాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించి సుప్రీం ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని మధ్యప్రదేశ్ సర్కార్ యోచిస్తున్నా థియేటర్ యజమానులు మాత్రం వెనక్కితగ్గలేదు. మధ్యప్రదేశ్‌లో జనవరి 25న 150కి పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నామని, దీనికి తగిన భద్రత కల్పించాలని థియేటర్ల యజమానులు, పంపిణీదారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి అదనపు భద్రత కోరాలని కూడా సినిమా థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, డీజీపీ రిషికుమార్ శుక్లాలను థియేటర్ యజమానుల అసోసియేషన్ త్వరలోనే కలవనుంది. మరోవైపు సినిమా విడుదలను నిరసిస్తూ తీవ్ర ఆందోళనలు చేపట్టిన రాజ్పుట్ కర్ణిసేన పద్మావత్‌ను ప్రదర్శిస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. -
కష్టాల్లో దీపావళి చిత్రాలు
తమిళసినిమా: థియేటర్ల యజమానులు సమ్మె బాట పట్టడంతో దీపావళికి విడుదలకు ముస్తాబవుతున్న చిత్రాలు కష్టాల్లో పడ్డాయి. అదే విధంగా శుక్రవారం కొత్త చిత్రాలు విడుదల కాలేని పరిస్ధితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం విధించిన వినోదపు పన్నే ఈ సమస్యలకు కారణంగా మారింది. కేంద్రప్రభుత్వం జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో అసలు సమస్య మొదలైంది. 28 శాతం జీఎస్టీ పన్నుతో పాటు రాష్ట్రప్రభుత్వం అదనంగా 30 శాతం వినోదపు పన్ను విధించడానికి సిద్ధం కావడంతో షాక్‌కు గురైన థియేటర్ల మాజమాన్యం వినోదపు పన్నును వ్యతిరేకిస్తూ గత జూలై మూడో తేదీన సమ్మెను ప్రకటించారు. ఈ వ్యవహారంపై చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడంతో సమ్మెను విరమించుకున్నారు. తాజాగా గత నెల 27వ తేదీన రాష్ట్ర నగర పాలక సంస్థ 10 శాతం వినోదపు పన్నును విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ పన్ను విధానాన్ని థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళ నిర్మాతల మండలి కూడా వినోదపు పన్నును పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దిపావళి నుంచి థియేటర్లు బంద్? ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం మదురైలో థియేటర్ల యాజమాన్యం సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టికెట్ ధర, జీఎస్టీ పన్నుతో పాటు మళ్లీ రాష్ట్రప్రభుత్వం అదనంగా పన్ను విధిస్తే ప్రేక్షకులు థియేటర్లకు రారని అభిప్రాయపడ్డారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వం వినోదపుపన్నును పూర్తిగా రద్దు చేయాలని, లేని పక్షంలో దీపావళి నుంచి థియేటర్లను మూసివేసి పోరాటానికి సిద్ధం అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మదురై, రామనాథపురం, దిండుగల్, విరుదనగర్, శివగంగూ, తేని ఆరు జిల్లాల థియేటర్ యాజమాన్యం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా రాష్ట్రప్రభుత్వం విధించిన వినోదపు పన్నును రద్దు చేయాలని లేని పక్షంలో థియేటర్లను మూసివేస్తామని చెన్నై, కాంచీపురం,తిరువళూర్, థియేటర్ల యాజమాన్యం ప్రకటించారు. టికెట్ల ధరను పెంచడం,పైరసీని అరికట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెన్నైలో మంగళవారం నుంచే వినోదపుపన్నును వ్యతిరేకిస్తూ పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో చిత్ర ప్రదర్శనలను నిలిపివేశారు. శుక్రవారం విడుదల కానున్న కొత్త చిత్రాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇకపోతే దీపావళి పండగ సందర్శంగా విజయ్ నటించిన మెర్శల్ వంటి కొన్ని భారీ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. బారీ చిత్రాలంటే కనీసం రూ.50,60 కోట్ల వ్యయంతో రూపొందుతుంటాయి. అలాంటి చిత్రాలు అనుకున్న ప్రకారం విడుదల కాకపోతే ఆ నిర్మాతలకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి రాష్ట్రప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే అలాంటి చిత్రాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మెర్శల్‌పై నిషేధం కొనసాగింపు మెర్శల్ చిత్ర టైటిల్‌పై నిషేధం కొనసాగుతోంది. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనున్న మెర్శల్ చిత్రానికి సమస్యలు మాత్రం తొలగిపోవడం లేదు. ఈ చిత్రం టైటిల్ వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. రాజేందర్ అనే వ్యక్తి తాను మెర్శలాయిటేన్ అనే టైటిల్‌తో చిత్రం చేస్తున్నానని, అందువల్ల మెర్శల్ అనే టైటిల్‌ను విజయ్ చిత్రానికి పెట్టరాదంటూ ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 3వ తేదీ వరకూ విజయ్ చిత్రానికి మెర్శల్ చిత్ర టైటిల్‌ను వాడకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ కేసు విచారణ బుధవారం మళ్లీ విచారణకు రాగా ఇరుతరఫు వాదనలు విన్న న్యాయస్థానం మెర్శల్ చిత్రం టైటిల్‌పై స్టేను కొనసాగిస్తూ, ఈ నెల 6వ తేదీన తీర్పును వెల్లడించనున్నట్లు పేర్కొంది. -
మూతపడనున్న 950 థియేటర్లు
చెన్నై: జీఎస్టీ పన్నుల విధానంపై అపుడే నిరసనల సెగలు మొదలయ్యాయి. జూలై1 నుంచి అమలవుతున్న పన్నుల నేపథ్యంలో ముఖ్యంగా తమిళనాడు సినీ పరిశ్రమ అంతటా జీఎస్టీ సెగ రగిలింది. 30శాతం స్థానిక అధిక పన్నుబాదుడు, టికెట్ ధరలపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల్ యజమానులు పోరాటానికి దిగనున్నారు. సుమారు 950 థియేటర్లను బంద్ పెట్టేందుకు నిర్ణయించారు. దీంతో 1060 స్క్రీన్లు జూలై3 సోమవారం నుంచి మూతపడనున్నాయి. జీఎస్టీ పన్నుకు నిరసనగా థియేటర్ యజమానులు నిరవధిక సమ్మె చేయటానికి నిర్ణయించినట్టు సెంట్రల్ అండ్ స్టేట్ టాక్స్‌పై స్పష్టత లేని కారణంగా తమ నిరసన తెలియచేసేందుకు నిర్ణయించామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్. శ్రీధర్ చెప్పారు. మల్టీప్లెక్సులు సహా అనేక థియేటర్లు, సోమవారం నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేసాయి. అటు తమిళనాడు నిర్మాతల సంఘం కూడా దీనిపై స్పందించింది. తమిళనాడులో వసూలు చేసే వినోద పన్ను జీఎస్టీ లో భాగమా, లేక వేరుగా ఉంటుందా అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాల నుంచి స్పష్టత కావాలని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, హీరో విశాల్ డిమాండ్ చేశారు. ప్రాంతీయ సినిమాని తక్కువ స్లాబ్‌లో ఉంచాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. కాగా సినిమా టికెట్లపై పన్ను రెండు కేటగిరీలుగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. రూ.100 లోపు టికెట్లపై 18శాతం, రూ.100కు పైన టికెట్లపై 28శాతం రేట్లను కౌన్సిల్ ఫిక్స్ చేసింది. మరోవైపు తమిళనాడు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పి వేలుమణి, తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్‌తో పన్నుల సమస్యపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.