third one day series
-
విండీస్‌తో భారత్ తొలి పోరు.. రోహిత్ వచ్చేశాడు!
అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ ‘సహస్ర’ సమరానికి సై అంటోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు జరుగనుంది. కొత్త నాయకుడు రోహిత్ శర్మ తనకు లభించిన ఈ వెయ్యో వన్డేలో గెలిచి... తన సారథ్యానికి విజయబాట వేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని ఈ విజయంతో తుడిచి పెట్టాలని టీమిండియా సహచరులు పట్టుదలతో ఉన్నారు. అహ్మదాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టును స్వదేశంలో కోవిడ్ చుట్టుముట్టింది. అయినా సరే సొంతగడ్డ అనుకూలతలతో, కొత్తగా రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 1000వ వన్డే పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ టి20 సిరీస్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో వెస్టిండీస్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని కరీబియన్ జట్టు తహతహలాడుతోంది. ఇరు జట్లను అనుభవజ్ఞుల కొరత వేధిస్తోంది. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమవగా... మయాంక్ అగర్వాల్ క్వారంటైన్ పూర్తి కాలేదు. దీంతో భారత్ ఓపెనింగ్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇషాన్ కిషన్. కెప్టెన్ రోహిత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. చాన్నాళ్ల తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బరిలోకి దిగే అవకాశం రాగా... గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ తుది బెర్త్ కోసం దీపక్ హుడాతో పోటీపడనున్నాడు. ఇద్దరు ఆల్‌రౌండర్లు కావడంతో ఒకరికే ఛాన్సుంది. మరోవైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్‌మైర్, కోవిడ్‌తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. దీంతో కొత్త కుర్రాళ్లు ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్, బ్రాండన్ కింగ్‌లతో భారత్‌తో సమరానికి సిద్ధమైంది. 999:ఇప్పటివరకు భారత్ 999 వన్డేలు ఆడింది. 518 మ్యాచ్‌ల్లో గెలిచింది. 431 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 9 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. స్వదేశంలో భారత్ 345 వన్డేలు ఆడింది. ఇందులో 202 విజయాలు, 131 పరాజయాలు ఉన్నాయి. 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. 9 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. విదేశాల్లో భారత్ 654 వన్డేలు ఆడింది. ఇందులో 316 విజయాలు, 300 పరాజయాలు ఉన్నాయి. 6 మ్యాచ్‌లు ‘టై’కాగా, 32 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 1974: భారత్ తమ తొలి వన్డేను 1974 జూలై 13న లీడ్స్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లతో ఓడింది. వన్డేల్లో భారత్ తొలి విజయాన్ని 1975 ప్రపంచకప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో అందుకుంది. 19:భారత్ ఇప్పటి వరకు మొత్తం 19 దేశాలతో వన్డే మ్యాచ్‌లు ఆడింది. శ్రీలంకతో అత్యధికంగా 162 మ్యాచ్‌లను భారత్ ఆడింది. ఆ తర్వాతి వరుసలో ఆస్ట్రేలియా (143), వెస్టిండీస్ (133), పాకిస్తాన్ (132), న్యూజిలాండ్ (110), ఇంగ్లండ్ (103), దక్షిణాఫ్రికా (87), జింబాబ్వే (63), బంగ్లాదేశ్ (36), కెన్యా (13), అఫ్గానిస్తాన్ (3), ఐర్లాండ్ (3), యూఏఈ (3), నెదర్లాండ్స్ (2), హాంకాంగ్ (2), బెర్ముడా (1), ఈస్ట్ ఆఫ్రికా (1), నమీబియా (1), స్కాట్లాండ్ (1) ఉన్నాయి. 418: వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరు. 2011 డిసెంబర్ 8న ఇండోర్ లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 418 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (219) డబుల్ సెంచరీ సాధించాడు. 26: వన్డేల్లో భారత జట్టుకు 26 మంది కెప్టెన్‌గా వ్యవహరించారు. ధోని అత్యధికంగా 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. ఆ తర్వాతి వరుసలో అజహరుద్దీన్ (174), గంగూలీ (146), కోహ్లి (95), ద్రవిడ్ (79), కపిల్ దేవ్ (74), సచిన్ (73), గావస్కర్ (37), వెంగ్‌సర్కార్ (18), అజయ్ జడేజా (13), శ్రీకాంత్ (13), రైనా (12), సెహ్వాగ్ (12), రవిశాస్త్రి (11), రోహిత్ శర్మ (10), వెంకట్రాఘవన్ (7), గంభీర్ (6), బేడీ (4), ధావన్ (3), కేఎల్ రాహుల్ (3), రహానే (3), వాడేకర్ (2), అమర్నాథ్ (1), కిర్మాణీ (1), విశ్వనాథ్ (1), కుంబ్లే (1) ఉన్నారు. 54: వన్డేల్లో భారత్ అత్యల్ప స్కోరు. 2000 అక్టోబర్ 29న షార్జాలో శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ 26.3 ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటైంది. -
వన్డే సమరానికి ‘సై’
బ్రిస్టల్: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌తో భారత టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. 2019లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన ఈ హరియాణా టాపార్డర్ బ్యాటర్ ఇంగ్లండ్ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్‌కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్లిష్టమైన ప్రత్యర్థి. కెప్టెన్ హెదర్‌నైట్, బీమోంట్‌లతో పాటు బ్యాటింగ్ ఆల్ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో కేట్ క్రాస్, ఎకిల్‌స్టోన్, ష్రబ్‌సోల్‌లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్ 30 మ్యాచ్‌ల్లో గెలిచింది. 37 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. -
సిరేసులో ఉండాలంటే...
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఇప్పుడు కోహ్లి బృందం కూడా అదే చేయాలి. సిడ్నీలో ఎదురైన ఓటమికి... ఈ సిడ్నీలోనే విజయంతో ఆసీస్‌కు సమాధానం ఇవ్వాలి. అప్పుడే సిరీస్‌లో ఉంటాం. లేదంటే క్లీన్‌స్వీప్ దారిలో పడిపోతాం. సిడ్నీ: తొలి వన్డే ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ఇప్పుడు రేసులో నిలిచే పనిలో పడింది. ఇక్కడే జరిగే రెండో వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ నుంచి, గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి తొందరగా బయటపడాలని కోహ్లి సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వరుస విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్... ఆల్‌రౌండ్ సత్తాతో పర్యాటక జట్టును మళ్లీ కంగారు పట్టించేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం రెండో వన్డే జరుగుతుంది. కోహ్లి ఫామ్‌పైనే కలవరం... ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి చక్కగా రాణించిన సందర్భాలున్నాయి. కానీ ప్రత్యేకించి ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో అతని ఆటతీరు పేలవం. ఇక్కడ అతని టాప్ స్కోరు 21 పరుగులే. గత మ్యాచ్‌లో అదేస్కోరును సమం చేశాడంతే! సగటైతే 11.40 పరుగులే. ‘టన్’లకొద్దీ పరుగులు బాదిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్‌కు ఎస్సీజీ అంతుచిక్కడం లేదు. ఆదివారం భారత కెప్టెన్ నిలబడినా, రాణించినా గత విశ్లేషణలన్నీ మారుతాయి. విజయం కూడా దక్కుతుంది. ఓపెనర్ మయాంక్ ఐపీఎల్లో అదరగొట్టాడు. ఇక్కడ అదేపని చేస్తే... మరో ఓపెనర్ ధావన్ ఫామ్‌లో ఉండటంతో చక్కని ఆరంభమే కాదు భారీ భాగస్వామ్యం నమోదు చేయొచ్చు. ఆ తర్వాత కోహ్లితో పాటు మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాట్‌కు పనిచెబితే పరుగుల వరద పారుతుంది. హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత వన్డే ఆడినా... తొలి మ్యాచ్‌తోనే ఫామ్ కనబరిచాడు. ఇది జట్టుకు సానుకూలాంశం. ఫిట్‌గానే చహల్... స్పిన్నర్ యజువేంద్ర చహల్ తొలి వన్డే ఆడుతూ స్వల్ప గాయంతో మైదానం వీడినా... తన 10 ఓవర్ల కోటా పూర్తి చేశాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై జట్టుకు ఎలాంటి కలవరం లేదు. అయితే గత మ్యాచ్‌లో అతనితో పాటు బుమ్రా, సైనీ ధారాళంగా సమర్పించుకున్న పరుగులతోనే జట్టు మేనేజ్మెంట్ ఆందోళన పడుతోంది. సీమర్లకు అనుకూలమైన పిచ్‌లపై బుమ్రా విఫలమవడమే కాస్త ఇబ్బందికర పరిణామం. అయితే రెండో వన్డేలో అతను కుదుటపడితే ఆ ఇబ్బందులు ప్రత్యర్థి జట్టుకు బదిలీ చెయొచ్చు. కొత్త బౌలర్ నటరాజన్‌కు అవకాశమివ్వాలని భావిస్తే సైనీని పక్కనబెట్టే అవకాశాలున్నాయి. జోరు మీదున్న ఆసీస్... భారత బౌలింగ్‌ను చితగ్గొట్టిన బ్యాట్స్‌మెన్ ఫామ్‌తో, శతక భాగస్వామ్యాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. ఇది ఇలాగే కొనసాగించి ఇక్కడే సిరీస్ గెలుచుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఫించ్ సేన ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వార్నర్, ఫించ్, స్మిత్‌ల ప్రదర్శన ఆతిథ్య జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ స్టొయినిస్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ గ్రీన్ అందుబాటులో ఉన్నాడు. దీంతో అతని అరంగేట్రం దాదాపు ఖాయమైంది. సొంతగడ్డపై పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్లది ఎప్పుడైనా పైచేయే! ఆతిథ్య అనుకూలతలు వారిని ఓ మెట్టుపైనే నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్పిన్నర్ జంపా గత మ్యాచ్‌లో భారత వెన్నువిరిచాడు. కీలక బ్యాట్స్‌మెన్‌నే కాదు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ను కూడా తన స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పిచ్, వాతావరణం గత మ్యాచ్‌లాగే పరుగుల వరద పారే పిచ్. బ్యాట్స్‌మెన్ నిలబడితే చాలు... భారీస్కోర్లు రిపీట్ అవుతాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. -
బంగ్లాదేశ్ సంచలనం
పాక్‌పై వన్డే సిరీస్ కైవసం తమీమ్ ఇక్బాల్ సెంచరీ ఢాకా: ఇకపై వన్డేల్లో బంగ్లాదేశ్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరిన బంగ్లా టైగర్స్... తాజాగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. తద్వారా తొలిసారి పాక్‌పై 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 239 పరుగులు మాత్రమే చేసింది. ఒక దశలో 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను సాద్ న సీమ్ (96 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నాడు. హారిస్ సోహైల్ (44) రాణించగా... చివర్లో వహబ్ రియాజ్ (40 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. బంగ్లా బౌలర్లంతా సమష్టిగా రాణించగా... షకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. బంగ్లాదేశ్ జట్టు 38.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (116 బంతుల్లో 116 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీ చేయగా... ముష్ఫికర్ రహీమ్ (70 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించడమే కాకుండా మూడో వికెట్‌కు తమీమ్‌తో కలిసి 118 పరుగులు జోడించాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, రాహత్ అలీ, సయీద్ అజ్మల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈనెల 22న జరుగుతుంది. -
ఒక పరుగు తేడాతో పాకిస్తాన్ ఓటమి
అబూ దుబాయ్:పాకిస్తాన్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ తో ముగించింది. వరుసుగా రెండు ఓటములు ఎదుర్కొన్న పాకిస్తాన్ చివరి మ్యాచ్ లో విజయం ముంగిట వరకూ వెళ్లి ఒక్క పరుగు తేడాతో చతికిలబడింది. ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 231పరుగులు చేసి పాక్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. అయితే ముందు బాగానే బ్యాటింగ్ చేసి రన్ రేట్ ను కాపాడుకుంటూ వెళ్లిన పాకిస్తాన్ చివర్లో అనూహ్యంగా వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (56), స్టీవ్ స్మిత్ (77) పరుగులతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన పాకిస్తాన్ కు నామమాత్రపు మ్యాచ్ లో కూడా ఊరట విజయం లభించకపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.