ఒక పరుగు తేడాతో పాకిస్తాన్ ఓటమి | Australia beat Pakistan by one run | Sakshi
Sakshi News home page

ఒక పరుగు తేడాతో పాకిస్తాన్ ఓటమి

Published Mon, Oct 13 2014 7:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

Australia beat Pakistan by one run

అబూ దుబాయ్:పాకిస్తాన్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ తో ముగించింది. వరుసుగా రెండు ఓటములు ఎదుర్కొన్న పాకిస్తాన్ చివరి మ్యాచ్ లో విజయం ముంగిట వరకూ వెళ్లి ఒక్క పరుగు తేడాతో చతికిలబడింది. ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 231పరుగులు చేసి పాక్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. అయితే  ముందు బాగానే బ్యాటింగ్ చేసి రన్ రేట్ ను కాపాడుకుంటూ వెళ్లిన పాకిస్తాన్ చివర్లో అనూహ్యంగా వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది.

 

ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (56), స్టీవ్ స్మిత్ (77) పరుగులతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన పాకిస్తాన్ కు నామమాత్రపు మ్యాచ్ లో కూడా ఊరట విజయం లభించకపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement