కృష్ణా పుష్కరాలకు మరో 358 సర్వీసులు
మూడో విడత ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా కెనాల్ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో దక్షిణ మధ్య రైల్వే 238 ప్రత్యేక సర్వీసులను ప్రకటించగా, మూడో విడతగా మరో 358 సర్వీసులను గురువారం ప్రకటించింది. గతేడాది గోదావరి పుష్కరాల సమయం లో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలకు రావటంతో రైళ్లు సరిపోక ఇబ్బందులు పడ్డారు. మూడో విడతతో కలిపి 596 సర్వీసులను ప్రకటించింది.
* గుంతకల్-కృష్ణా కెనాల్ మార్గంలో ఆగస్టు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో 12 సర్వీసులు నడుస్తాయి. గుంతకల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, కృష్ణా కెనాల్లో సాయంత్రం 5 గంటలకు ఇవి బయల్దేరుతాయి
* గుంతకల్-కృష్ణా కెనాల్ మధ్య అవే తేదీల్లో మరో 12 సర్వీసులు నడుస్తాయి. గుంతకల్‌లో రాత్రి 9.30కి బయల్దేరుతాయి. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 14, 16, 18, 20, 22, 24 తేదీల్లో కృష్ణా కెనాల్ స్టేషన్ నుంచి ఉదయం 11.30కి బయల్దేరుతాయి
* తిరుపతి-కృష్ణా కెనాల్ మధ్య ఆగస్టు 11 నుంచి 23 వరకు (16, 21 తేదీలు మినహా) 22 సర్వీసులు నడుస్తాయి. రాత్రి 11 గంటలకు తిరుపతిలో బయల్దేరుతాయి. తిరుగు ప్రయాణంలో 12, 13, 14, 15, 17, 18, 19, 20, 22, 23, 24 తేదీల్లో ఉదయం 10 గంటలకు కృష్ణా కెనాల్లో బయల్దేరుతాయి.
* నర్సాపూర్- కృష్ణా కెనాల్ మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు తిరుగుతాయి. నర్సాపూర్‌లో మధ్యాహ్నం 12.25కు, కృష్ణా కెనాల్లో రాత్రి 9.30కి బయల్దేరుతాయి.
* సికింద్రాబాద్-విజయవాడ మధ్య 14 నుంచి 21వ తేదీ వరకు నాలుగు సర్వీసులు తిరుగుతాయి. సికింద్రాబాద్‌లో ఉదయం 9.30కి, విజయవాడలో సాయంత్రం 5.30కి బయల్దేరుతాయి.
* సికింద్రాబాద్-కృష్ణా కెనాల్ మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు తిరుగుతాయి. సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.15కు, కృష్ణా కెనాల్లో 2.20కి బయల్దేరుతాయి.
* విజయవాడ-నర్సాపూర్ మధ్య 11 నుంచి 26వ తేదీ వరకు 26 సర్వీసులు అందుబాటులో ఉంటా యి. విజయవాడలో రాత్రి 10, నర్సాపూర్‌లో ఉద యం 4 గంటలకు బయల్దేరుతాయి. ఇదే దారిలో 12 నుంచి 23వ తేదీ వరకు మరో 26 సర్వీసులు తిరుగుతాయి. విజయవాడలో మధ్యాహ్నం 1.45కు, నర్సాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతాయి.
* విజయవాడ-మచిలీపట్నం మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు అందుబాటులో ఉంటా యి. విజయవాడలో ఉదయం 10.10కి, మచిలీపట్నంలో ఉదయం 10.45కు బయల్దేరుతాయి.
* విజయవాడ-భద్రాచలం రోడ్డు మధ్య 11 నుంచి 24వ తేదీ వరకు 50 సర్వీసులు తిరుగుతాయి. విజయవాడలో ఉదయం 10.45, రాత్రి 11.20కి, భద్రాచలం రోడ్డు స్టేషన్లో ఉదయం 5.30, సాయంత్రం 4.30కి బయల్దేరుతాయి.
* బొల్లారం-గద్వాల మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు 24 సర్వీసులు ఉంటా యి. బొల్లారంలో ఉదయం 7 గంటలకు, గద్వాలలో మధ్యాహ్నం 2.30కి బయల్దేరుతాయి.
* గద్వాల-కర్నూలు మధ్య 12 నుంచి 23వ తేదీ వరకు (15, 22 తేదీల్లో మినహా) 20 సర్వీసులు తిరుగుతాయి. గద్వాలలో మధ్యాహ్నం 3 గంటలకు, కర్నూలులో మధ్యాహ్నం 12.30కి బయల్దేరుతాయి.
* రాజమండ్రి-రాయనపాడు మధ్య 12 నుంచి 17వ తేదీ, 19 నుంచి 23వ తేదీ మధ్య 44 సర్వీసులు తిరుగుతాయి. రాజమండ్రిలో ఉదయం 4.10, మధ్యాహ్నం 2.30కి, రాయనపాడులో ఉదయం 9.30కి, రాత్రి 7.30కి బయల్దేరుతాయి.
* ఒంగోలు-కృష్ణా కెనాల్ మధ్య 12 నుంచి 18వ తేదీ, 20 నుంచి 23వ తేదీ మధ్య 44 సర్వీసులు తిరుగుతాయి. కృష్ణా కెనాల్ స్టేషన్లో ఉదయం 5.45కు మధ్యాహ్నం 2.30కి, ఒంగోలులో ఉదయం 11, సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు.