third place India
-
2030 నాటికి మూడవ స్థానానికి
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది. -
ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జల అవార్డులను దక్కించుకుంది. దేశంలో జలసంరక్షణ, యాజమాన్య పద్ధతుల ద్వారా తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించడం తదితర విధానాలను ప్రోత్సహించడానికి 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. తాజాగా 11 విభాగాల్లో 41 అవార్డులను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకుంది. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్థానంలో నిలవగా.. ఉత్తమ స్కూల్ విభాగంలో నంద్యాల జిల్లాలోని చాగలమర్రి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) ద్వితీయ స్థానం, పరిశ్రమల విభాగంలో తిరుపతిలోని కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ తృతీయ స్థానం దక్కించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన యాక్షన్ ఫ్రెటెర్నాకు ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు లభించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ జాతీయ జల అవార్డును అందుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి చాగలమర్రి కేజీబీవీ ప్రిన్సిపాల్, సీసీఎల్ ప్రతినిధులు, యాక్షన్ ఫ్రెటెర్నా డైరెక్టర్ మల్లారెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలను కాపాడుకోగలమన్నారు. జల సంరక్షణను రోజువారీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇదీ చదవండి:గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే -
సంస్కరణల్లో తెలంగాణ నం.3
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను పురపాలికల్లో విజయవంతంగా అమలుపరిచిన దేశంలోని మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీని ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి రూ.2,508 కోట్ల అదనపు రుణాలను సమీకరించ డానికి రాష్ట్రం అర్హత సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం గురువారం ఈ మేరకు అనుమతి జారీ చేసింది. ఈ సంస్కరణ లను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ పూర్తి చేయగా, ఈ జాబితాలో చేరిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం రూ.7,406 కోట్ల అదనపు రుణాలు సమీకరించుకోవడానికి అర్హత పొం దాయి. ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశుద్ధ్య సేవలను అందించేందుకు వీలుగా పురపాలి కలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సంస్కరణలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ సంస్కరణలివే.. సంస్కరణల కోసం నాలుగు పౌర–కేంద్రీకృత ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. అవి.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార సంస్కరణల సులభతరం, పట్టణ స్థానిక సంస్థ/ యుటిలిటీ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కర ణలు.. కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఊరట కలిగించేందుకు కేంద్రం 2020 మే 17న ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం పేర్కొన్న సంస్కరణలను అమలు పరిస్తే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 2% అదనపు రుణాలను ఆయా రాష్ట్రాలు పొంద డానికి అర్హత సాధిస్తాయని అప్పట్లో తెలియజేసింది. ఈ సంస్కరణల అమలులో భాగంగా ఆస్తుల మార్కెట్ విలువను ప్రామాణికంగా తీసుకుని వాటి వైశాల్యం (ఫ్లోర్ ఏరియా) ఎంత ఉంటే ఆ మేరకు ఆస్తి పన్నులు విధించేలా పురపాలికల్లో ఆస్తి పన్నుల రేట్లను ప్రకటించాలని కేంద్రం పేర్కొంది. నీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి ప్రవాహ సేవలకు ప్రస్తుతం అవుతున్న వ్యయం ఆధారంగా వీటికి సంబంధిం చిన చార్జీలను సైతం ఫ్లోర్ ఏరియా ఆధారంగా విధించాలని నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’వ్యవస్థను అమలు చేశాయి. 7 రాష్ట్రాలు సులభ వ్యాపార సంస్కరణలు అమలు చేశాయి. 3 రాష్ట్రాలు మాత్రమే నాలుగింటిలో మూడు సంస్కరణలను అమలు చేశాయి. కాగా, కేంద్రం నిర్దేశించిన సంస్కరణల అమలుకు గత మూడు నెలలుగా తీవ్రంగా కష్టపడ్డామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల విషయంలో రష్యాను దాటేసి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే త్వరలోనే బ్రెజిల్‌ను కూడా వెనక్కి నెట్టేసి, రెండో స్థానం ఆక్రమించే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాలో కరోనా కేసులు 7 లక్షలకు, మరణాలు 20 వేలకు చేరువవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 425 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 6,97,413, మరణాలు 19,693కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,53,287 కాగా, 4,24,432 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 60.85 శాతంగా నమోదయ్యింది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనా మరణాల విషయంలో ఇండియా ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కరోనా టెస్టులు కోటి దేశంలో ఇప్పటి వరకు 1,00,04,101 కరోనా టెస్టులు నిర్వహించిన భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్త, మీడియా సమన్వయకర్త డాక్టర్ లోకేశ్ శర్మ సోమవారం చెప్పారు. ప్రస్తుతం 1,105 ల్యాబ్‌లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ల్యాబ్‌లు 788, ప్రైవేట్ ల్యాబ్‌లు 317 ఉన్నాయని పేర్కొన్నారు. గత 14 రోజులుగా నిత్యం 2 లక్షలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నామని అన్నారు. కరోనా టెస్టుల సామర్థ్యం మే 25న 1.5 లక్షలు ఉండగా, ఇప్పుడు 3 లక్షలకు చేరిందని తెలియజేశారు. -
భారత్‌కు మూడో స్థానం
షూటౌట్లో కొరియాపై విజయం అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇఫో (మలేసియా): గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అత్యద్భుత ఆటతీరుతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో మూడో స్థానం పొందింది. కొత్త కోచ్ పాల్ వాన్ ఆస్ ఆధ్వర్యంలో తొలిసారిగా బరిలోకి దిగిన సర్దార్ సింగ్ సేన ఆదివారం కొరియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో 4-1 తేడాతో నెగ్గి కాంస్య పతకం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. నికిన్ తిమ్మయ్య పదో నిమిషంలోనే ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. అయితే ఆ వెంటనే యు హ్యోసిక్ (20) స్కోరును సమం చేశాడు. దీంతో జోరు పెంచిన భారత్‌కు 22వ నిమిషంలో సత్బీర్ సింగ్ మరో ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యంలో ఉంచాడు. కానీ 29వ నిమిషంలోనే నామ్ హ్యూన్వూ చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యం కాగా.. భారత్ నుంచి ఆకాశ్‌దీప్, సర్దార్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా గోల్స్ చేసి జట్టును గెలిపించారు. అటు కొరియా ప్రయత్నాలను కీపర్ శ్రీజేష్ రెండు సార్లు అడ్డుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.