thota Chandra Shekar
-
'ఏలూరును మోడల్ నగరంగా తీర్చిదిద్దుతా'
ఏల్లూరు: కొల్లేరు సమస్యను పరిష్కరించే సత్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని ఏలూరు లోక్‌సభ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ తెలిపారు. కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు తగ్గిస్తామని ఆయన హామీయిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 3 నుంచి 5 ఏళ్లలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఐఏఎస్ అధికారిగా రెండున్నర దశాబ్దాలు ప్రజలతో కలిసి ఉన్నానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. ఏలూరును మోడల్ నగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. చంద్రబాబు చీకటి పాలనను ప్రజలెవరూ కోరుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనను గుర్తుచేస్తే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందుతున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా నడవలేక సినిమా యాక్టర్‌ను, మతతత్వ నాయకుడిని ఊతకర్రలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలను నమ్మి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని చంద్రశేఖర్ హెచ్చరించారు. -
'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'
-
'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'
దెందులూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ హామీయిచ్చారు. కొల్లేరు ప్రజల జీవన గతులు మెరుగుపరిచేందుకే ఈ అంశాన్ని వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. చంద్రబాబు వల్లే కొల్లేరు ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని గుడివాకలంక, పైడిచింతపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
'విభజనకు చంద్రబాబు లేఖ బుల్లెట్ గా పనిచేసింది'
ఏలూరు: సీఎం పదవిలో ఉన్నపుడు రైతులకు వడ్డీ కూడా మాఫీ చేయని చంద్రబాబు ఇప్పుడు రుణమాఫీ అంటే ఎలా నమ్ముతారు అని ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవుతుంది అనే భయంతోనే చంద్రబాబు ఆల్ ఫ్రీ అంటున్నారు అని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు మారుపేరు అని అన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలన నరకాసురుడి పాలన అని తోట చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సోనియా గాడ్సే అయితే ఆమె చేతిలో తుపాకి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్ర విభజనలో బాబు ఇచ్చిన లేఖ బుల్లెట్ గా పనిచేసిందని ఎమ్మెల్యే బాలరాజు, మాజీ ఎమ్మెల్యే రాజేష్ ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నాతో ఢిల్లీ కోటలు బద్దలవుతాయని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ పాల్గొన్నారు.